ఆగుంబె
ఆగుంబె (Agumbe) (కన్నడ:ಆಗುಂಬೆ) కర్ణాటక రాష్ట్రంలోని షిమోగ జిల్లా, తీర్థహళ్ళి తాలుకాలో ఒక గ్రామం. ఆగుంబె, పశ్చిమ కనుమలలో మలనాడు అనే ప్రాంతంలో ఉంది. ఈ గ్రామంలో పడే వర్ష పాతం ఆధారంగా భారత దేశంలో అత్యధిక వర్షపాతం పడే ప్రదేశమైన చిరపుంజి తరువాతి స్థానంలో నిలుస్తుంది. ఇంత అత్యధిక వర్షపాతం వల్ల ఆగుంబె, దక్షిణ చిరపుంజి అని పేరు సంపాదించుకొన్నది.[1] ఈ గ్రామంలో ప్రసిద్ధ సర్ప పరిశోధనా శాస్త్రవేత్త విట్టేకర్ స్థాపించిన వర్షపాత ఆధారిత అరణ్య పరిశోధనా కేంద్రం ఉంది.[2] విట్టేకర్ ఈ గ్రామాన్ని కింగ్ కోబ్రా రాజధానిగా వర్ణించాడు.[3] ఔషధ మెక్కల సంరక్షణా కేంద్రం కూడా ఆగుంబే గ్రామంలోనే ఉంది.
?ఆగుంబె కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 13°30′31″N 75°05′45″E / 13.5087°N 75.0959°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 826 మీ (2,710 అడుగులు) |
జిల్లా (లు) | షిమోగా జిల్లా జిల్లా |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 577 411 • +08181 • KA-14 |
వర్షపాతం
మార్చుఆగుంబే భారత దేశంలోనే అతధిక వర్షపాతం నమోదు చేసుకొంటున్న ప్ర్రాంతాలలో రెండవది (మెదటి స్థానం చిరపుంజీకి లేదా దాని సమీపములో ఉన్న మాసిన్రంకు దక్కుతుంది).[4] ఇక్కడ సాలీనా సగటు వర్షపాతం 7640 మి.మీ. ఇప్పటి వరకు అగుంబెలో అత్యధిక వర్షపాతం (4508 మి.మీ.) ఆగస్టు 1946లో నమోదయ్యింది.[5]
ఆకర్షణలు
మార్చుసూర్యాస్తమయం
మార్చుపశ్చిమ కనుమలలో ఉన్న ఆగుంగే సూర్యాస్తమయం చూడడానికి దేశం నలుమూలలనుండి పర్యాటకులు వస్తారు. నిర్మలమైన ఆకాశం ఉన్నరోజు అరేబియా సముద్రం చాలా దూరంలో ఉన్నప్పటికి సూర్యాస్తమయంలో అరేబియా సముద్రంలోకి సూర్యుడు వెళ్ళి పోతున్నాడా అన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
జలపాతాలు
మార్చు- కుంచికాళ్ జలపాతాలు
కుంచికాళ్ జలపాతాలు భారతదేశంలో అత్యధిక ఎత్తు నుండి పడుతున్న జలపాతాలలో ఒకటి. ప్రపంచ జలపాతాలలో ఈ జలపాతం 116 వ స్థానంలో ఉంది.[6] ఈ జలపాతం 1493 అడుగులు (455 మీటర్ల) ఎత్తు నుండి పడుతూ వరాహి నదికి జన్మనిస్తున్నది.
- బరకనా జలపాతాలు
బరకనా జలపాతం 850 అడుగులు లేదా 259 మీటర్ల ఎత్తు నుండి పడుతోంది. బరకనా జలపాతం భారత దేశంలోనే అత్యంత ఎత్తు నుండి పడుతున్న జలపాతాలలో 10వ స్థానంలో ఉంది. సీతా నది కొండలపై నుండి పడుతూ బరకనా జలపాతంగా మారుతోంది. ఈ బరకనా జలపాతానికి సీతా జలపాతం అనే మరోపేరు కూడా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో జలవిద్యుత్తు ఉత్పత్తిలో ఈ జలపాతం ప్రముఖ పాత్ర వహిస్తోంది.
- ఓణకే అబ్బే జలపాతాలు
ఆగుంబెకి దగ్గరలో ఉన్న మరొక జలపాతం. కన్నడ భాషలో ఓణకే అంటే దంపుడు కర్ర (వడ్లు దంచడానికి ఉపయగించే కర్ర) అని అర్థం. జలపాతం యొక్క ఉధృత వల్ల ఈ జలపాతాలకి ఈ పేరు వచ్చింది.
మాల్గుడి డేస్
మార్చుఆర్.కె.నారాయణన్ రచించిన మాల్గుడి డేస్ అనే నవల ఆధారంగా శంకర నాగ్ దర్శకత్వంలో నిర్మించబడిన మాల్గుడి డేస్ ధారావాహిక కార్యక్రమంలోని చాలా భాగం ఆగుంబెలో చిత్రించబడింది. 2004 సంవత్సరములో మళ్ళీ ఈ ధారావాహిక కార్యక్రమ నూతన భాగాలు కవితా లంకేష్ దర్శకత్వంలో నిర్మింబడుతోంది.[7]
ఆగుంబే చేరుకొనే విధానం
మార్చుఆగుంబే దగ్గరలో ఉన్న తాలుక, పట్టణం తీర్థహళ్ళి. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి ఆగుంబే 380 కి.మి. దూరంలో ఉంది. బెంగళూరు నుండి జాతీయ రహదారి 4 మీద తుముకూరు వరకు వెళ్ళి అక్కడ నుండి 206 నంబరు జాతీయ రహదారి మీద షిమోగా వరకు వెళ్ళి అక్కడ నుండి 13వ నంబరు జాతీయ రహదారిపై వెళ్తే తీర్థహాళ్ళి పట్టణం వస్తుంది. ఉడిపి నుండి శృంగేరికి వెళ్ళే బస్సులు ఆగుంబే మీదుగా వెళ్తాయి. అగుంబెకి దగ్గరలో రైలు స్టేషను ఉడిపిలోని కొంకణ్ రైల్వేస్టేషను. ఈ గ్రామానికి సమీప విమానాశ్రయమ మంగళూరులో ఉంది.
జంతు వైవిధ్యం
మార్చుమలనాడు, పశ్చిమ కనుమలలో భాగమైన ఆగుంబే జంతు వైవిధ్య భాండాగారం. ఆగుంబే ప్రక్కనే చివరిగా మిగిలిన లోతట్టు వర్షపాతాధిరిత అరణ్యాలైన కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం, సొమేశ్వర వన్య అభయారణ్యం ఉన్నాయి.[8] ఈ మూడు ప్రదేశాలలో చాలా నూతన వృక్ష జంతు కోటి జాతులను (species) కనుగొన్నారు. ఆగుంబెలో కనుగొనబడడం వల్ల వాటికి ఆగుంబే పేరు మీదుగా నామకరణం చేశారు.
- సెలెనోప్స్ అగుంబెన్సిస్ Selenops agumbensis: సిలినొప్స్ ప్రజాతి చెందిన ఒక సాలీడు
- తరెన్నా అగుంబెన్సిస్ Tarenna agumbensis: ఒకరకమైన మెక్క
- డ్రోసోఫిలా అగుంబెన్సిస్ Drosophila agumbensis: ఒకరకమైన చిన్న ఈగ
- ఐరినోపిప్స్ అగుంబెన్సిస్ Irenopsis agumbensis: ఒకరకమైన శిలీంద్రం (fungus)
- హైగ్రోస్టర్ అగుంబెన్సిస్ Hygroaster agumbensis: ఒక రకమైన శిలీంద్రం
- డాక్టిలేరియా అగుంబెన్సిస్ Dactylaria agumbensis:ఒక రకమైన శిలీంద్రం
ఆగుంబే దగ్గరలో కనుగొనబడిన వృక్ష-జంతు జాతులు:
- కాడులెజునేయా ప్లురిప్లికేటా Caudalejeunea pluriplicata:ఒకరకమైన లివర్ వార్ట్ (?కూరాకు) అనే మెక్క[9]
- నొతోత్యాలస్ డెసిక్టా Notothylas dissecta: ఒకరకమైన హార్న వార్ట్ (Hornwort) మధ్య అమెరికాలో కనిపించును మెదటిసారి మధ్య అమెరికా కాకుండా ఆగుంబెలో కనిపించింది.[10]
- సైక్లోటోమా ఎల్లెని Cyclotoma alleni: ఆగుంబెలో కనుగొనబడిన బీటిల్ (కుమ్మరి పురుగు వంటిది).[11]
వర్ష పాత ఆధారిత అరణ్య పరిశోధన కేంద్రం
మార్చుప్రసిద్ధ సర్పపరిశోధకుడైన (herpetologist) రోములస్ విట్టేకర్ భారత దేశంలోనే ఏకైక వర్షపాత ఆధారిత అరణ్య పరిశోధన కేంద్రాన్ని ఆగుంబెలో స్థాపించాడు.[8] 1970 సంవత్సరంలో విట్టేకర్ ఈ ప్రదేశంలో రాజ నాగు (కింగ్ కోబ్రా) ని కనుగొని, ఆ తరువాత ఆగుంబెని అరణ్య పరిశోధనా కేంద్రంగా మార్చాడు.[3] ఆగుంబెలో ఈ కేంద్రానికి అవసరమైన 7 ఎకరాల స్థలం కొనడానికి ఆర్థిక సహాయం విటాకర్ తల్లి డోరిస్ నోరడన్ చేసింది. ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం రాజ నాగు (కింగ్ కోబ్రా), ఇక్కడ కనిపించే వివిధ జాతుల జంతు-వృక్ష సంపదను అనుసరించి దక్షిణ భారతదేశంలోని వర్షాధారిత అరణ్యాలను పరిశోధిన, సంరక్షణ. మరో ప్రధాన ఉద్దేశం కర్ణాటక రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మొట్ట మొదటి రాజ నాగు (కింగ్ కోబ్రా) సంరక్షిత అరణ్యంగా మార్చడం.[8] అంతరించి పోతున్న కింగ్ కోబ్రా మీద పరిశోధన జరపడానికి, కింగ్ కోబ్రా జీవిత చరిత్ర అర్థం చేసుకోవడానికి దేశవిదేశాలనుండి నిపుణలను ఆహ్వానించడం, పారితోషికం ఇవ్వడం జరుగుతుంది.[8]
ఈ కేంద్రాన్ని స్థాపించినందుకు పురస్కారంగా విట్టేకర్‌కు బ్రిటీషు ప్రభుత్వం 2005 సంవత్సరంలో యునైటెడ్ కింగ్‌డమ్ వన్య సంరక్షణ బహుమానం (విట్లీ అవార్డు) క్రింద 30,000 పౌండ్లు పురస్కార రూపంలో ఇవ్వడం జరిగింది.[8] ఆ పురస్కారం వల్ల లభించిన పైకంతో కుటీరాలు, పరిశోధనలకు అవసరమైన శాస్త్ర పరికరాలు, చోదనకు వాహనాన్ని సమకూర్చుకొన్నాడు. ఈ పరిశోధనా స్థలానికి విద్యుత్తు కొరకు కర్ణాటక రాష్ట్ర విద్యుత్తు సరఫరా మీద ఆధారపడకుండా సాంప్రదాయేతర వనరులైన సూర్యరశ్మి ఆధారంగా తయారయ్యే సౌరవిద్యుత్తు, చిన్న జలవిద్యుత్తు కేంద్రం కూడా ఉంది. ఆ కేంద్రానికి చుట్టూ ముళ్ళకంచె వల్ల వన్య ప్ర్రాణులకు (జింకలు, చిరుతపులులు) హాని జరగకూడదనే భావనతో ముళ్ళ కంచె కాకుండా మాములు తీగ కంచె మాత్రమే వేయడం జరిగింది. ఈ కేంద్రంలో పరశోధకులకు రెండు కుటీరాలు, ఫార్మ్ హౌస్ ఉన్నాయి. ఈ కేంద్రం త్రిభుజ ఉద్దేశం పరిశోధన, విద్య, సంరక్షణ. ఈ కేంద్రం సభ్యులు తరచూ దగ్గరలో ఉన్న విద్యాలయాలకు వెళ్ళి పాముల గురించి, వాటి సంరక్షణ గురించి ఉపన్యాసాలు చేస్తారు.
ఔషధీ మెక్కల సంరక్షణా స్థలం
మార్చు1999 సంవత్సరంలో ఔషధీ మెక్కల సంరక్షణా స్థలం (Agumbe Medicinal Plants Conservation Area (MPCA) ) స్థాపించబడింది.[12]
ఆగుంబే సముద్రమట్టానికి 600-700 మీటర్ల ఎత్తులో ఉండి ఈ క్రింది పేర్కొనబడిన ఓషధ ధర్మాలు కలిగిన మెక్కలకు నిలయం అయ్యింది.
- గార్సీనియా (Garcinia)
- మిరిస్టికా (Myristica)
- లిస్టియేసి (Litsaea)
- డయోస్పోరస్ (Diospyrous)
- హోలిగ్రానా (Holigarna)
- యూజీనియా (Eugenia)
- ఫైకస్ (Ficus)
ఫౌండేషన్ ఫర్ రీవైటలైజేషన్ ఆఫ్ లోకల్ హెల్త్ ట్రెడిషన్స్ (Foundation for Revitalisation of Local Health Traditions (FRLHT) ) అనే సంస్థ జరిపిన పరిశోధన మేరకు 371 మెక్కల జాతులలో 182 మెక్కలను ఓషధీ సంపద కలిగిన వాటిగా గుర్తించారు.[12]
ఆగుంబెలో లభించే అంతరించి పోతున్న మెక్క జాతుల పేర్ల (రెడ్ లిస్టు) జాబితాలో చేర్చిన మెక్కల జాతులు
- ఎడ్నియా హొన్‌డాల Adenia hondala
- సీలస్ట్రుస్ పానిక్యులేటస్ Celastrus paniculatus
- గార్సీనియా గుమ్మి-గుట్ట Garcinia gummi-gutta
- మిరిస్టికా డాక్టలాడియస్ Myristica dactyloides
- పెర్షియా మాక్రాంతా Persia macrantha
- వటేరియా ఇండికా Vateria indica
యం.పి.సి.ఏ ఆధారంగా సాలసియా ఒబ్లాంగా (Salacia oblonga) అనే ఈ ఓషధీ ధర్మాలు కలిగిన ఈ మెక్క పశ్చిమ కనుమలు, శ్రీలంకలో మాత్రమే కనిపిస్తుంది.[12]
బయటి లింకులు
మార్చు- ఆగుంబె గురించి
- ఉడిపి గురించి సంక్షిప్త సమాచారం Archived 2007-09-27 at the Wayback Machine
- ఆగుంబె పర్వత శ్రేణులను ఎక్కడం
- మణిపాల్ చుట్టు ప్రక్కల ప్రదేశాలు Archived 2011-02-25 at the Wayback Machine
మూలాలు
మార్చు- ↑ "అగుంబెలోని అద్భుత వర్షపాతం". Online Edition of the Hindu, dated 2005-07-29. 2005, The Hindu. Archived from the original on 2012-10-23. Retrieved 2007-05-16.
- ↑ వర్షపాత ఆధారిత అరణ్యాల పరిశోధన కేంద్రం గురించి వివరణ A description of the Agumbe Rainforest Research Station is provided by రోములస్ విటాకర్. "Wet and Wild". Online Webpage of NewIndPress.com, dated 2006-10-27. Express Network Private Ltd. Archived from the original on 2007-09-29. Retrieved 2007-05-16.
- ↑ 3.0 3.1 ఆగుంబె Agumbe being called as the capital of King Cobra is mentioned by P. Oppili. "Whitaker gets top U.K. conservation prize". Online Edition of The Hindu, dated 2005-04-28. 2005, the Hindu. Archived from the original on 2007-12-24. Retrieved 2007-05-16.
- ↑ Agumbe receiving the second highest rainfall in India is mentioned by అరభింద ఘోష్. "Link Godavari, Krishna & Cauvery". Online Edition of the Central Chronicle, dated 2007-03-28. 2007, Central Chronicle. Archived from the original on 2007-10-13. Retrieved 2007-05-16.
- ↑ Rainfall data of Agumbe is provided by "Western Ghats Biodiversity Information System - The Climate". Online Webpage of Centre for Ecological Sciences. Indian Institute of Science. Archived from the original on 2007-07-02. Retrieved 2007-05-16.
- ↑ "భారత దేశంలోని జలపాతల జాబితా". ప్రపంచ జలపాతాల జాబితా. Archived from the original on 2012-08-25. Retrieved 2007-02-19.
- ↑ క్రొత్తగా చిత్రించబడుతున్న మాల్గుడి డేస్ ధారావాహిక కార్యక్రమ విభాగాలు ఆగుంబెలో చిత్రించడం "Malgudi Days are back". Online Edition of The Deccan Herald, dated 2004-04-11. 2004, The Printers (Mysore) Private Ltd. Retrieved 2007-05-16.
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;rainres
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Discovery of Caudalejeunea pluriplicata in Agumbe is mentioned by Ram Udar; U. S. Awasthi; F. Shaheen. "A new Caudalejeunea from India". Online Webpage of JSTOR (Journal Storage). 2007 JSTOR. Retrieved 2007-05-16.
- ↑ Discovery of Notothylas dissecta in Agumbe is mentioned by "Notothylas dissecta, A Hornwort new to India". Online Webpage of JSTOR (Journal Storage). 2007 JSTOR. Retrieved 2007-05-16.
- ↑ Discovery of Cyclotoma alleni in Agumbe is mentioned by "A new species of beetle described from India". Online Webpage of NCL Centre for Biodiversity Informatics. Archived from the original on 2007-10-23. Retrieved 2007-05-16.
- ↑ 12.0 12.1 12.2 A description about the Agumbe MPCA is provided by V. Prabhakaran. "Agumbe Medicinal Plants Conservation Area – A tribute to Kuvempu". Medplant Network News Volume 3, September-October 2003, Issue 03. International Development Research Centre, Canada. Archived from the original on 2007-04-30. Retrieved 2007-05-16.