ఆత్మకూరు (గ్రామీణ)

గుంటూరు జిల్లాలోని గ్రామం

ఆత్మకూరు, గుంటూరు జిల్లా, మంగళగిరి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 503., ఎస్.టి.డి.కోడ్ = 08645.

ఆత్మకూరు (గ్రామీణ)
—  రెవిన్యూ గ్రామం  —
ఆత్మకూరు (గ్రామీణ) is located in Andhra Pradesh
ఆత్మకూరు (గ్రామీణ)
ఆత్మకూరు (గ్రామీణ)
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′41″N 80°34′58″E / 16.411332°N 80.582727°E / 16.411332; 80.582727
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం మంగళగిరి
ప్రభుత్వము
 - సర్పంచి వింజమూరి జ్యోత్స్న
జనాభా (2011)
 - మొత్తం 8,723
 - పురుషుల సంఖ్య 4,338
 - స్త్రీల సంఖ్య 4,385
 - గృహాల సంఖ్య 2,394
పిన్ కోడ్ 522503
ఎస్.టి.డి కోడ్ 08645

గ్రామ చరిత్రసవరించు

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, కృష్ణాయపాలెం. నవులూరు(గ్రామీణ) దాని పరిధిలోని హామ్లెట్స్, నిడమర్రు, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి.

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలుసవరించు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

ఈ గ్రామం మంగళగిరి పట్టణానికి తూర్పు సరిహద్దునకు ఆనుకొని ఉంది.

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన తాడేపల్లి మండలం, పశ్చిమాన తాడికొండ మండలం, తూర్పున విజయవాడ మండలం, దక్షిణాన పెదకాకాని మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

ఈ గ్రామం గుండా జాతీయ రహదారి వెళ్ళు చున్నది.

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

నిర్మలా ఫార్మసీ కళాశాల.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

ఎల్.ఇ.ప్రాథమిక పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

బ్యాంకులుసవరించు

ఫెడరల్ బ్యాంక్:- గ్రామంలోని గణపతినగర్ లో, ఈ బ్యాంక్ శాఖను, 2016,ఫిబ్రవరి-10, బుధవారంనాడు ప్రారంభించారు. [6]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

ఈ గ్రామం గుండా గుంటూరు వాహిని ప్రవహించుచున్నది.

గ్రామ పంచాయతీసవరించు

  1. ఆత్మకూరు పంచాయతీ 1938లో ఏర్పడింది. ఆర్థికంగా బలోపేతమయినది ఈ పంచాయతీ. పంచాయతీలో పారిశుద్ధ్యపనులూ, కార్మికుల జీతాలూ, విద్యుత్తు బిల్లులూ చెల్లించినా ఇంకా పంచాయతీ ఆదాయంలక్షలలోనే ఊంటుంది. దీనితో ఏ నిధులు వచ్చినా అభివృద్ధి పనులకు డోకా లేదు. 2000 సం. వరకూ ఈ పంచాయతీ వార్షికాదాయం రు.5 లక్షలే. 2000 సం.లో ఈ గ్రామంలో కోకోకోలా కంపెనీ ఏర్పాటు చేయడంతో పంచాయతీ వార్షికాదాయం 3 రెట్లు పెరిగింది. ప్రస్తుత వార్షికాదాయం రు.45 లక్షలు. గ్రామంలో రహదారులూ, సిమెంటు కాలువల నిర్మాణపనులూ నిరంతరం కొనసాగుచున్నవి. [2]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి వింజమూరి జ్యోత్స్న ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ మొసలి జ్యోతిబసు ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ వినాయక దేవాలయంసవరించు

గణపతి నగర్ లోని ఈ ఆలయం ప్రముఖమైనది.

శ్రీ చక్రసహిత విజయదుర్గా చాముండేశ్వరీ ఆలయంసవరించు

ఆత్మకూరులోని ఇప్పటం రోడ్డులోని ఈ ప్రాంగణంలో, 2014,ఫిబ్రవరి-19న, శ్రీ విజయేశ్వర స్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. విజయేశ్వరస్వామి(శివలిగం)తోపాటు, పంచముఖ ఆదిశేషు, నందీశ్వరుడు విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. [4]

శ్రీ అంకాళమ్మ అమ్మవారి ఆలయంసవరించు

స్థానిక వడ్డెరపాలెంలోమిని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతరను, వడ్డెరసంఘం ఆధ్వర్యంలో, 2015,ఆగస్టు-39వ తేదీ, శ్రావణమాసం, రెండవ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. []

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంసవరించు

శ్రీ భద్రావతీ సమేత శ్రీ భావనాఋషి ఆలయంసవరించు

ఈ ఆలయంలో వెలసిన స్వామివారల వార్షిక కళ్యాణమహోత్సవం, 2017,ఫిబ్రవరి-1వతేదీ బుధవారంనాడు, పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారలకు గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. [7]

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

ఇక్కడ చేనేత కార్మికులు అధికం.

గ్రామ విశేషాలుసవరించు

ఆత్మకూరులో ప్రముఖమైన హ్యాపీ రిసార్ట్స్ & రిక్రియేషన్స్(Happy Resorts & Recreations) ఉంది. ఇక్కడ సందర్శకులకు ఏంతో అహ్లాదంగా, సౌకర్యంగా ఊండును.

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,103.[1] ఇందులో పురుషుల సంఖ్య 3,094, స్త్రీల సంఖ్య 3,009, గ్రామంలో నివాస గృహాలు 1,447 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 955 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 8,723 - పురుషుల సంఖ్య 4,338 - స్త్రీల సంఖ్య 4,385 - గృహాల సంఖ్య 2,394

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-04-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-08-21. Cite web requires |website= (help)