ఆనం వివేకానంద రెడ్డి
ఆనం వివేకానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు.[1] ఆయన "ఆనం వివేకా"గా సుప్రసిద్ధులు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయవేత్త. భారతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. 1999 నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి,[2] 2004లో నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి[3], 2009లో నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం నుండి[4] శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.
ఆనం వివేకానంద రెడ్డి | |||
![]()
| |||
నియోజకవర్గం | నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నెల్లూరు జిల్లా | 1950 డిసెంబరు 25||
మరణం | 2018 ఏప్రిల్ 25 హైదరాబాదు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | ఆనం హైమవతి | ||
నివాసం | హైదరాబాదు | ||
మతం | హిందూ |
ప్రారంభ జీవితంసవరించు
ఆనం వివేకానందరెడ్డి నెల్లూరులో ఆనం వెంకటరెడ్డికి 1950, డిసెంబరు 25 న జన్మించాడు. అతడు భారత స్వాతంత్ర్యానికి పూర్వం, తరువాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ రాజకీయ నాయకుడు ఆనం చెంచుసుబ్బారెడ్డి గారి సోదరుని కుమారుడు. ఆయన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి 2012 నాటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు. అతడి బంధువు ముసునూరి వినోద్ కుమార్ ఆమ్ ఆదమీ పార్టీలో యువజన శాఖ కన్వీనరుగా రాకకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. వివేకా నెల్లూరు లోని వి.ఆర్. కళాశాఅల నుండి బి.ఎ పట్టాను పొందాడు.
జీవితంసవరించు
అతడు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు మూడుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. అతడు 1982 లో నెల్లూరులోని జిల్లా లాండ్ మోర్ట్‌గేజ్ బ్యాంకుకు అధ్యక్షునిగా తన సేవలనందించాడు. 1982లో నెల్లూరు మ్యునిసిపాలిటీకి వైస్ చైర్మన్ గా ఉన్నాడు. కో-ఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షునిగా ఉన్నాడు. 1988 లో నెల్లూరులోని ఎస్.వి.జి.ఎస్ కళాశాలకు కరస్పాండెంట్, సెక్రటరీగా ఉన్నాడు. 1994 లో నెల్లూరు లోని వేణుగోపాలస్వామి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నాడు. 1996 లో మ్యునిసిపల్ చైర్మన్ యొక్క ఛాంబర్ కు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు.
రాజకీయ జీవితంసవరించు
అనేక సంవత్సరాలపాటు రాజకీయ రంగంలో ఉన్న అతడు 2014లో అధికారికంగా విరమించాడు. తన కుమారులకు రాజకీయ ప్రవేశానికి అవకాశం కల్పించాడు. ఆనం సోదరులు నెల్లూరు జిల్లాలో మేకపాటి సోదరులతో రాజకీయ ప్రత్యర్థులు. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి, శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, జగన్మోహనరెడ్డికి బలమైన మద్దతుదారులు. ఈ రెండు వర్గాలూ జిల్లా రాజకీయాల్ని విస్తృతంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా 2014 అసెంబ్లీ ఎన్నికలలో సుదీర్ఘమైన మార్పులు సంభవించాయి. 2016 తరువాత ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలోనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో చేరారు.
ఆయన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యునిగా 2009 లో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు.[5]
వ్యక్తిగత జీవితంసవరించు
వివేకానందరెడ్డి దువ్వూరుకు చెందిన ఎ.హైమవతిని వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమారులు. - ఆనం చెంచుసుబ్బారెడ్డి, ఆనం రంగా మయూర్ రెడ్డి. వారు 2014 లో రాజకీయ ప్రవేశం చేసారు. వివేకాకు క్రీడలు, ఆటలు అంటే ఇష్టం.
మరణంసవరించు
గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వివేకానందరెడ్డి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2018, ఏప్రిల్ 25 బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.[6][7]
మూలాలుసవరించు
- ↑ "ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. 25 April 2018. Archived from the original on 25 April 2018. Retrieved 25 April 2018.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". www.elections.in. Retrieved 2018-04-25.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2004". www.elections.in. Retrieved 2018-04-25.[permanent dead link]
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2009". www.elections.in. Retrieved 2018-04-25.[permanent dead link]
- ↑ "Politicians Affidavit Info". My Neta Info. Retrieved 2013-12-30.
- ↑ వెబ్ ఆర్కైవ్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు (25 April 2018). "ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత". Retrieved 25 April 2018.
- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి, పాలిటిక్స్ (25 April 2018). "టీడీపీ నేత ఆనం వివేకా కన్నుమూత". Archived from the original on 25 ఏప్రిల్ 2018. Retrieved 25 April 2018.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)