ఆర్టెమిస్ ఒప్పందాలు

 

ఆర్టెమిస్ ఒప్పందాలు
ఆర్టెమిస్ ఒప్పందాలు: చంద్రుడు, అంగారకుడు, తోకచుక్కలు, గ్రహశకలాల శాంతియుత, పౌర అంవేషణలో సహకారానికి సూత్రాలు
సంతకాలు చేసిన దేశాల మ్యాపు
ఆర్టెమిస్ ఒప్పందాల్లో భాగస్థులు
  Signatory nation

రకంఅంతరిక్ష చట్టం
సంతకించిన తేదీ2020 అక్టోబరు 13
కక్షిదారులు
భాషలుఇంగ్లీషు

ఆర్టెమిస్ ఒప్పందాలు అనేవి అంతరిక్ష పరిశోధనకు సంబంధించి అమెరికా ప్రభుత్వానికి, వివిధ దేశాల ప్రభుత్వాలకూ మధ్య జరిగిన బహుళపక్ష ఒప్పందాలు. ఇవి తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేని ఒప్పందాలు. 2025 నాటికి మానవులను తిరిగి చంద్రునిపైకి పంపడానికి అమెరికా నేతృత్వంలో చేసే ప్రయత్నం, అంగారక గ్రహానికి, దానికి ఆవలకూ అంతరిక్ష పరిశోధనను విస్తరించడం వీటి అంతిమ లక్ష్యం. [8] 2023 జూన్ 29 నాటికి, యూరప్‌లో పది, ఆసియాలో ఎనిమిది, ఉత్తర అమెరికాలో మూడు, దక్షిణ అమెరికాలో మూడు, ఓషియానియాలో రెండు, ఆఫ్రికాలో రెండు - మొత్తం ఇరవై ఏడు దేశాలు, ఒక భూభాగం ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

నాసా, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లు రూపొందించిన ఈ ఒప్పందాలు చంద్రుడు, అంగారక గ్రహం, తదితర ఖగోళ వస్తువుల పౌర అన్వేషణ లోను, శాంతియుత వినియోగాల్లోనూ వివిధ దేశాలతో సహకారం కోసం ఒక ఫ్రేమ్‌వర్కును ఏర్పాటు చేశాయి. [9] అవి 1967 నాటి ఐక్యరాజ్యసమితి ఔటర్ స్పేస్ ట్రీటీలో స్పష్టంగా నిర్వచించబడ్డాయి. ఒప్పందాలపై సంతకం చేసినవారు ఈ ట్రీటీని సమర్థించవలసి ఉంటుంది. అంతరిక్ష చట్టాన్ని రూపొందించే అత్యంత ప్రధానమైన ఐరాస విధానాలను ఈ ఒప్పందాల్లో ఉదహరించారు. [10] [11] [12] [13] [note 1]

2020 అక్టోబరు 13న ఎనిమిది దేశాల జాతీయ అంతరిక్ష సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. అవి ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లక్సెంబర్గ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్.[10] సంతకం చేసిన ఇతర దేశాలలో ఉక్రెయిన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, బ్రెజిల్, పోలాండ్, మెక్సికో, ఇజ్రాయెల్, రొమేనియా, బహ్రెయిన్, సింగపూర్, కొలంబియా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, రువాండా, నైజీరియా, చెక్ రిపబ్లిక్, స్పెయిన్, ఈక్వెడార్, భారతదేశం ఉన్నాయి. మరిన్ని దేశాలను చేర్చుకోవాలని నాసా ఎదురుచూస్తున్నందున ఈ ఒప్పందాలు సంతకం కోసం తెరిచే ఉన్నాయి.[14] అదనపు సంతకాలు చేసినవారు నేరుగా ఆర్టెమిస్ కార్యక్రమ కార్యకలాపాలలోపాల్గొనవచ్చు లేదా ఒప్పందాలలో పేర్కొన్న విధంగా చంద్రునిపై బాధ్యతాయుతమైన అన్వేషణ సూత్రాలకు కట్టుబడి ఉండటానికి అంగీకరించవచ్చు.[15]

2020 మే 5న డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చంద్రునిపై గనుల తవ్వకం కోసం ఒక కొత్త అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందిస్తోందని, ఇది 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ నుండి తీసుకోబడిందనీ రాయిటర్స్ ఒక ప్రత్యేక నివేదికను ప్రచురించింది.[16][17] పది రోజుల తరువాత అప్పటి నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ చంద్రుడిని అన్వేషించడానికి, త్రవ్వడానికీ ఒక విధాన చట్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో భాగస్వామి దేశాలతో ఆర్టెమిస్ ఒప్పందాలను అధికారికంగా ప్రకటించాడు.[18]

ఈ ఒప్పందాలు ఆర్టెమిస్ కార్యక్రమం అనే పేరుతో ఉద్భవించాయి. 2024 నాటికి చంద్రుని పైకి తొలి మహిళను, తదుపరి పురుషుడినీ పంపడానికి 2017 లో ప్రారంభించిన అమెరికా ప్రణాళిక ఇది.[19] ఒప్పందాలపై సంతకం చేసే ప్రభుత్వాలు అధికారికంగా ఆర్టెమిస్ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, భవిష్యత్ అంతరిక్ష పరిశోధనా కృషిలో సంఘర్షణలు, అపార్థాలను నివారించేందుకు గాను ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడానికి ఈ ఒప్పందాలు ఉద్దేశించబడ్డాయనీ బ్రిడెన్‌స్టైన్ పేర్కొన్నారు.[19]

ఈ ఒప్పందాలను నాసా, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, కొత్తగా తిరిగి నెలకొల్పబడిన నేషనల్ స్పేస్ కౌన్సిల్‌లు కలిసి రూపొందించాయి. తుది పత్రాన్ని 2020 మేలో వెలువరించటానికి ముందు సంప్రదింపుల కోసం అనేక ప్రభుత్వాలకు దాని ముసాయిదాను పంపారు.[18][16]

2020 అక్టోబరు 13న రికార్డ్ చేసిన, ప్రత్యక్ష ప్రసారం చేసిన వేడుకలో, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, లక్సెంబర్గ్, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ల జాతీయ అంతరిక్ష సంస్థల డైరెక్టర్లు ఒప్పందాలపై సంతకం చేశారు.[10][20] సరిగ్గా ఒక నెల తరువాత ఉక్రేనియన్ జాతీయ అంతరిక్ష సంస్థ అధిపతి కూడా ఈ ఒప్పందాలపై సంతకం చేశారు.[21][22]

2021 మే 22న దక్షిణ కొరియా ఈ ఒప్పందాలపై సంతకం చేసంది. [23] [24] ఒక వారం తర్వాత న్యూజిలాండ్ చేరింది. [25] 2020 లోనే సంతకం చేయాలనే ఉద్దేశాన్ని సూచించిన బ్రెజిల్, [26] 2021 జూన్‌లో ఆర్టెమిస్ ఒప్పందాల్లో చేరింది. ఒప్పందాల్లో సంతకం చేసిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్.[27]

2021 అక్టోబరు 26న దుబాయ్‌లో జరిగిన 72వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ (IAC)లో పోలండు స్పేస్ ఏజెన్సీ అధిపతి, స్వదేశీ పోలిష్ స్పేస్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే కోరికను వ్యక్తం చేస్తూ, ఈ ఒప్పందాలపై సంతకం చేసారు. [28] 2021 డిసెంబరు 9 న మెక్సికో కూడా చేరింది.

2022లో, ఒప్పందాలపై సంతకం చేసిన వారి సంఖ్య మునుపటి సంవత్సరం కంటే రెట్టింపు అయింది. 2022 జనవరి 26న ఇజ్రాయెల్ ఒప్పందాలపై సంతకం చేసింది, [29] తర్వాత రొమేనియా, [30] బహ్రెయిన్, [31] సింగపూర్‌లు [32] మార్చిలోను, కొలంబియా మే లోను, [33] ఫ్రాన్స్ 2022 జూన్ 7న దాని అంతరిక్ష కార్యక్రమ 60 వ వార్షికోత్సవం నాడు చేరాయి. [34] 2022 జూలై 14 న సౌదీ అరేబియా ఒప్పందాలపై సంతకం చేసింది. [35] 2022 డిసెంబరు 13 న, అమెరికా-ఆఫ్రికా నాయకుల సమావేశంలో రువాండా, నైజీరియాలు సంతకం చేసాయి. [36] [37]

2022 సెప్టెంబరు 19 న, ఈ ఒప్పందాల గురించి, అంతరిక్షంలో సహకారం గురించీ మరింత విస్తృతంగా చర్చించడానికి, సంతకాలు చేసిన దేశాల ప్రతినిధులు IACలో తమ మొదటి సమావేశాన్ని నిర్వహించారు. [38] [39]

2023 మేలో, చెక్ రిపబ్లిక్ [40] [41] స్పెయిన్‌లు అధికారికంగా ఒప్పందాలపై సంతకం చేశాయి. [42]

2023 జూన్ 22 న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, భారతదేశం అధికారికంగా ఒప్పందాలపై సంతకం చేసింది. [43] భారతదేశం ఈ ఒప్పందాలపై సంతకం చేస్తుందని, ఆర్టెమిస్ కార్యక్రమంలో అమెరికాతో సహకరిస్తుందనీ అమెరికా 2021 లోనే సూచించింది. [44] ఈ ఒప్పందాలపై సంతకం చేసినవారిలో భారతదేశమే అతిపెద్ద అంతరిక్ష శక్తి. దాని సభ్యత్వంతో అంతరిక్ష అన్వేషణ, పరిశోధనలలో సరసమైన ఆవిష్కరణలకు మార్గం పడినట్లైంది. [45]

ఒప్పందాలు

మార్చు

ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి ఈ ఒప్పందాలపై సంతకం పెట్టడం తప్పనిసరి అయినప్పటికీ, సాధారణంగా అంతరిక్షాన్ని అన్వేషించడానికి కీలక సూత్రాలు, మార్గదర్శకాలను ఇవి క్రోడీకరిస్తాయని వివరించబడింది. [12] వాటి ప్రకటిత ఉద్దేశ్యం " బాహ్య అంతరిక్ష ఒప్పందం లోను ఇతర సాధనాల్లోనూ ఉన్న ముఖ్యమైన బాధ్యతలను అమలు చేసే వీలు కలిగించడం." ఈ ఒప్పందం ఒకే పత్రంలో ఉంటుంది. ఒప్పందాల సూత్రాలకు కట్టుబడి ఉండే ప్రతి దేశం దానిపై సంతకం చేస్తుంది. చంద్రునిపైన, వెలుపలా నిర్దుష్ట కార్యకలాపాల కోసం అంతరిక్ష ఏజెన్సీల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను ఇవి సూచిస్తాయి.

నిబంధనలు: [46]

  • ఈ ఒప్పందాల క్రింద పేర్కొన్న సహకార కార్యకలాపాలు ప్రత్యేకంగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని, సంబంధిత అంతర్జాతీయ చట్టాలకు ఇవి అనుగుణంగా ఉండాలని ధృవీకరిస్తుంది.
  • బాహ్య అంతరిక్ష ఒప్పందంలోని ఆర్టికల్ XIకి అనుగుణంగా పారదర్శకత, శాస్త్రీయ సమాచారాన్ని పంచుకోవడానికి నిబద్ధతను నిర్ధారిస్తుంది.
  • అంతరిక్ష-ఆధారిత మౌలిక సదుపాయాల కోసం ప్రస్తుత ఇంటర్‌ ఆపరాబిలిటీ ప్రమాణాలను ఉపయోగించుకోవడానికి, అవి ఉనికిలో లేనప్పుడు లేదా సరిపోనప్పుడు ప్రమాణాలను స్థాపించడానికీ సహేతుకమైన ప్రయత్నాలు చేసేందుకూ నిబద్ధతగా ఉండాలి.
  • రెస్క్యూ అండ్ రిటర్న్ అగ్రిమెంట్ కింద వారి బాధ్యతల ప్రకారం ఆపదలో ఉన్న బాహ్య అంతరిక్షంలో సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందించడానికి అన్ని సహేతుకమైన ప్రయత్నాలు చేయడానికి నిబద్ధతతో ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ ద్వారా అవసరమైన విధంగా, అంతరిక్షంలో వస్తువుల నమోదుకు బాధ్యతను పేర్కొంటుంది
  • వారి కార్యకలాపాలపై సమాచారాన్ని బహిరంగంగా పంచుకోవడానికి, శాస్త్రీయ డేటాను బహిరంగంగా పంచుకోవడానికి నిబద్ధతతో ఉండాలి. అలా చేస్తున్నప్పుడు, ఏదైనా యాజమాన్య లేదా ఎగుమతి-నియంత్రిత సమాచారానికి తగిన రక్షణను అందించడానికి సంతకం చేసినవారు పరస్పరం సమన్వయం చేసుకోవడానికి అంగీకరిస్తారు, సంతకం చేసిన వ్యక్తి తరపున నిర్వహించే వరకు ఈ నిబంధన ప్రైవేట్ రంగ కార్యకలాపాలకు విస్తరించదు.
  • చారిత్రికంగా ముఖ్యమైన మానవ లేదా రోబోటిక్ ల్యాండింగ్ సైట్‌లు, కళాఖండాలు, అంతరిక్ష నౌకలు, కార్యకలాపాలకు సంబంధించిన ఇతర సాక్ష్యాలను కలిగి ఉన్న బాహ్య అంతరిక్ష వారసత్వాన్ని సంరక్షించడానికి ఒక ఒప్పందం ఉంటుంది. అలా చేయడానికి అవసరమైన అభ్యాసాలు, నియమాలను అభివృద్ధి చేయడానికి బహుళజాతి ప్రయత్నాలకు దోహదపడుతుంది.
  • బాహ్య అంతరిక్ష ఒప్పందానికి అనుగుణంగాను, సురక్షితమైన, స్థిరమైన కార్యకలాపాలకు మద్దతుగానూ అంతరిక్ష వనరుల వెలికితీత, వినియోగాలను నిర్వహించాలనే ఒప్పందం ఉంటుంది. బాహ్య అంతరిక్ష ఒప్పందం నిషేధించిన జాతీయ కేటాయింపులు ఇందులో ఉండవని సంతకం చేసినవారు ధృవీకరిస్తారు. ఈ విషయంపై అంతర్జాతీయ పద్ధతులు, నియమాలను మరింత అభివృద్ధి చేయడానికి బహుళపక్ష ప్రయత్నాలకు దోహదపడే ఉద్దేశాన్ని కూడా వారు వ్యక్తం చేస్తారు.
  • ఇతర దేశాల కార్యకలాపాల పట్ల గౌరవం, హానికరమైన జోక్యాలకు సంబంధించి ఔటర్ స్పేస్ ట్రీటీలో ఉన్న నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అంతరిక్షానికి సంబంధించి తమ కార్యకలాపాల స్థానం, స్వభావాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు. సంతకం చేసినవారు అంతర్జాతీయ పద్ధతులు, ప్రమాణాలు, నియమాలను మరింత అభివృద్ధి చేయడానికి బహుళపక్ష ప్రయత్నాలకు దోహదపడాలనే ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేస్తారు.
  • అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడానికి, సాధారణ కార్యకలాపాలలోను, కార్యాచరణ లేదా పోస్ట్-మిషన్ దశల్లోనూ విచ్ఛిన్నం, ప్రమాదాలు జరిగినపుడూ కొత్త, హానికరమైన అంతరిక్ష శిధిలాల ఉత్పత్తిని పరిమితం చేయడం పట్ల నిబద్ధతతో ఉంటారు.

ప్రతిస్పందనలు

మార్చు

మద్దతు

మార్చు

ఆర్టెమిస్ ఒప్పందాలు సాధారణంగా అంతర్జాతీయ చట్టాన్ని, అంతరిక్షంలో సహకారాన్నీ ముందుకు తీసుకుపోతున్నాయని స్వాగతించబడ్డాయి. [12] ఒప్పందాల సారాంశం "వివాదరహితం" అని, దేశాల అంతరిక్ష కార్యకలాపాలను నియంత్రించడానికి "అంతరిక్ష చట్టం లోని ముఖ్య సూత్రాలను క్రోడీకరించే ముఖ్యమైన రాజకీయ ప్రయత్నాన్ని" సూచిస్తుందనీ పరిశీలకులు పేర్కొన్నారు. [12] సహకారం, శాంతియుత ఉపయోగం యొక్క ఏకరీతి ప్రమాణాల దిశలో అంతరిక్ష అన్వేషణను ప్రభావితం చేయడంలో సహాయపడేదిగా ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయ న్యాయ కోవిదులు గౌరవించారు. [47] సెక్షన్ 9లో, బాహ్య అంతరిక్షంలో మానవ సాంస్కృతిక వారసత్వం ఉనికిని, దానిని రక్షించాల్సిన అవసరాన్నీ గుర్తించిన మొదటి బహుళపక్ష సాధనంగా కూడా ఒప్పందాలను ప్రశంసించారు. [48]

విమర్శ

మార్చు

ఈ ఒప్పందాలు "అమెరికా వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణపై చాలా కేంద్రీకృతమై ఉన్నాయి" అని విమర్శించబడ్డాయి. రష్యా "అమెరికాకు అనుకూలంగా ఉండేలా అంతర్జాతీయ అంతరిక్ష చట్టాన్ని రూపొందించే ప్రయత్నం ఇది" అని ఖండించింది. [49] వోల్ఫ్ సవరణ వెలుగులో చైనాకు అవకాశంగా ఉండటమే కాకుండా, చైనా ప్రభుత్వ అనుబంధ మీడియా ఈ ఒప్పందాలను "ఐరోపా వలసవాదులు ఎన్‌క్లోజర్ పద్ధతిలో భూ కబ్జాలు చేసిన దానికి సమానం" అని పేర్కొంది. [50] పాకిస్తాన్, యుఎఇ వంటి మూడవ పక్ష దేశాలను చేర్చుకునే పోటీ ప్రయత్నంగా, చైనా వారి ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ ప్రతిపాదనపై కలిసి పనిచేయడానికి రష్యా, చైనాలు ఒక అవగాహనకు వచ్చాయి. [51]

సైన్స్ మ్యాగజైన్ యొక్క పాలసీ ఫోరమ్‌లో వ్రాస్తూ ఇద్దరు పరిశోధకులు, దేశాలు తమ అభ్యంతరాల గురించి మాట్లాడాలని పిలుపునిచ్చారు. స్పేస్ మైనింగ్‌పై చర్చలు జరపడానికి అమెరికా, ఐక్యరాజ్యసమితి ఒప్పంద ప్రక్రియ ద్వారా వెళ్లాలని వాళ్ళు వాదించారు. నాసా ఒప్పందాలను అనేక దేశాలు ఆమోదించినట్లయితే, ఔటర్ స్పేస్ ట్రీటీ ఒప్పందాలపై అవి చేసే భాష్యాలే ప్రబలంగా ఉంటాయని వారు ఆందోళన చెందారు. [49] నాసా వారి ఆర్టెమిస్ లూనార్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలంటే ఆర్టెమిస్ ఒప్పందాలపై అంగీకారం తెలపడం తప్పనిసరి. [49]

దేశాలు మరొక ఖగోళ వస్తువుపై హక్కు అడగడాన్ని ఔటర్ స్పేస్ ట్రీటీ స్పష్టంగా నిషేధిస్తుంది. కానీ ఈ ఒప్పందాలు, వాటిపై సంతకం చేసినవారు ఖగోళ వస్తువుల నుండి సేకరించిన ఏదైనా వనరులపై హక్కు పొందేందుకు అనుమతించడం ద్వారా ఇవి అంతరిక్ష చట్టాన్ని ఉల్లంఘించాయని కూడా విమర్శకులు వాదిస్తున్నారు. [52] నెబ్రాస్కా-లింకన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫ్రాన్స్ వాన్ డెర్ డంక్, ఈ ఒప్పందాలు "వివిధ దేశాలకు వాణిజ్య కార్యకలాపాలలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించే ప్రాథమిక హక్కు"ను ఇచ్చే "ఔటర్ స్పేస్ ట్రీటీపై అమెరికా ఇస్తున్న వివరణను" బలపరుస్తున్నాయని పేర్కొన్నాడు. ఒక బలహీనమైన ప్రత్యామ్నాయ వివరణ ఏమిటంటే, "వాణిజ్య పరమైన కార్యకలాపాలను ఏకపక్షంగా ఆమోదించడం, బాహ్య అంతరిక్ష ఒప్పందానికి అనుగుణంగా లేదు. అంతర్జాతీయ చట్టం మాత్రమే, ముఖ్యంగా-బహుశా-అంతర్జాతీయ లైసెన్సింగ్ వ్యవస్థతో సహా, అటువంటి వాణిజ్య దోపిడీని చట్టబద్ధం చేయగలదు." [53] [54]

గమనికలు

మార్చు
  1. Except the Moon Treaty, despite Australia having ratified it.

మూలాలు

మార్చు
  1. "Brazil Signs Artemis Accords". NASA.gov. 15 June 2021. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 5 జూలై 2023.
  2. "Israel, American NASA Set To Collaborate On Space Exploration; Special Focus On Moon And Mars – Minister".
  3. Foust, Jeff (10 December 2021). "Mexico joins Artemis Accords". SpaceNews. Retrieved 10 December 2021.
  4. "Space exploration soars with Artemis Accords". The Beehive (in ఇంగ్లీష్). Retrieved 2021-06-01.
  5. Potter, Sean (2021-05-27). "Republic of Korea Joins List of Nations to Sign Artemis Accords". NASA. Archived from the original on 2021-05-27. Retrieved 2023-07-05.
  6. "Ukraine becomes the 9th country to sign the Artemis Accords". U.S. Embassy in Ukraine (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-17. Retrieved 2021-05-01.
  7. "Isle of Man Government - Artemis Accords to be extended to the Isle of Man".
  8. Dunbar, Brian (2019-07-23). "What is Artemis?". NASA. Retrieved 2021-05-01.
  9. "NASA: Artemis Accords". NASA. Retrieved 2021-05-01.
  10. 10.0 10.1 10.2 Potter, Sean (2020-10-13). "NASA, International Partners Advance Cooperation with Artemis Accords". NASA. Retrieved 2021-05-01.
  11. "Fact Sheet: Artemis Accords - United for Peaceful Exploration of Deep Space". U.S. Embassy & Consulates in Brazil (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-20. Retrieved 2021-05-01.
  12. 12.0 12.1 12.2 12.3 Newman, Christopher (2020-10-19). "Artemis Accords: why many countries are refusing to sign Moon exploration agreement". The Conversation. Retrieved 2021-06-17.
  13. "The Artemis Accords and the Future of International Space Law". ASIL. Retrieved 2021-06-17.
  14. "NASA, International Partners Advance Cooperation with First Signings of Artemis Accords". NASA. Oct 13, 2020. Archived from the original on 2020-10-15. Additional countries will join the Artemis Accords in the months and years ahead, as NASA continues to work with its international partners to establish a safe, peaceful, and prosperous future in space. Working with emerging space agencies, as well as existing partners and well-established space agencies, will add new energy and capabilities to ensure the entire world can benefit from the Artemis journey of exploration and discovery.
  15. Howell, Elizabeth (August 25, 2022). "Artemis Accords: Why the international moon exploration framework matters". Space.com. Retrieved November 6, 2022.
  16. 16.0 16.1 "NASA: Artemis Accords". nasa.gov. NASA. Retrieved 16 May 2020.
  17. "Exclusive: Trump administration drafting 'Artemis Accords' pact for moon mining - sources". Reuters. 6 May 2020. Retrieved 15 May 2020.
  18. 18.0 18.1 Wall, Mike (15 May 2020). "NASA lays out 'Artemis Accords' for responsible moon exploration". space.com. Retrieved 16 May 2020.
  19. 19.0 19.1 Grush, Loren (2020-10-13). "US and seven other countries sign NASA's Artemis Accords to set rules for exploring the Moon". The Verge (in ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
  20. Grush, Lauren (October 13, 2020). "US and seven other countries sign NASA's Artemis Accords to set rules for exploring the Moon". The Verge. Retrieved October 13, 2020.
  21. "Ukraine becomes the 9th country to sign the Artemis Accords". U.S. Embassy in Ukraine (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-17. Retrieved 2021-05-01.
  22. "Україна стала дев'ятою країною, яка підписала Домовленості в рамках програми "Артеміда"". www.nkau.gov.ua (in ఉక్రెయినియన్). Archived from the original on 2020-11-15. Retrieved 2020-11-15.
  23. Potter, Sean (2021-05-27). "Republic of Korea Joins List of Nations to Sign Artemis Accords". NASA. Archived from the original on 2021-05-27. Retrieved 2023-07-05.
  24. Potter, Sean (2021-05-26). "Republic of Korea Joins List of Nations to Sign Artemis Accords". NASA. Archived from the original on 2022-04-16. Retrieved 2021-05-26.
  25. Foust, Jeff (2021-06-01). "New Zealand signs Artemis Accords". SpaceNews (in అమెరికన్ ఇంగ్లీష్).
  26. Bill Nelson [@senbillnelson] (June 15, 2021). "Brazil joins 11 other nations as a signatory of the #Artemis Accords today! As the 1st country in South America to make this commitment to a sustainable space environment, Brazil shows the global impact of the Accords around the world. Thanks for your support, @Astro_Pontes!" (Tweet) – via Twitter.
  27. Potter, Sean (2020-12-14). "NASA Administrator Signs Statement of Intent with Brazil on Artemis". NASA. Archived from the original on 2022-04-16. Retrieved 2021-05-01.
  28. Foust, Jeff (2021-10-27). "Poland signs Artemis Accords". Space News (in ఇంగ్లీష్). Retrieved 2021-10-27.
  29. אייכנר, איתמר (26 January 2022). "זה רשמי: ישראל הצטרפה ל"הסכמי ארטמיס" בחלל" [It's official: Israel has joined the "Artemis Accords" in space]. ynet (in హిబ్రూ).
  30. "Romania Signs Artemis Accords". NASA. 1 March 2022. Retrieved 2 March 2022.
  31. "Bahrain Signs Artemis Accords". NASA. 8 March 2022. Retrieved 8 March 2022.
  32. "Republic of Singapore Signs the Artemis Accords". United States Department of State. 28 March 2022. Retrieved 28 March 2022.
  33. Potter, Sean (2022-05-10). "NASA Welcomes Vice President of Colombia for Artemis Accords Signing". NASA. Retrieved 2022-05-10.
  34. Potter, Sean (2022-06-07). "France Signs Artemis Accords as French Space Agency Marks Milestone". NASA. Retrieved 2022-06-07.
  35. Potter, Sean (2022-07-14). "Saudi Arabia Signs Artemis Accords". NASA. Archived from the original on 2022-07-19. Retrieved 2022-07-16.
  36. House, The White (2022-12-13). "STATEMENT: Strengthening the U.S.-Africa Partnership in Space". The White House (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-13.
  37. Foust, Jeff (2022-12-13). "First African nations sign Artemis Accords". SpaceNews (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-14.
  38. (2023). "Signatories of the U.S.-Led Artemis Accords Meet in Person for the First Time".
  39. Foust, Jeff (2022-09-21). "Artemis Accords signatories hold first meeting". SpaceNews (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-24.
  40. Tingley, Brett (2023-05-03). "Czech Republic signs Artemis Accords for 'peaceful, cooperative and sustainable' moon exploration". Space.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-13.
  41. McGuinness, Jackie; Bardan, Roxana (2023-05-03). O'Shea, Claire (ed.). "NASA Welcomes Czech Foreign Minister for Artemis Accords Signing". NASA. Retrieved 2023-05-13.
  42. Jones, Andrew (2023-06-02). "Spain signs the Artemis Accords for peaceful moon exploration". Space (in ఇంగ్లీష్). Retrieved 2023-06-05.
  43. Singh, Jagmeet (2023-06-22). "India joins NASA's Artemis Accords for collaborative lunar exploration". TechCrunch (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-23.
  44. "ISRO's NETRA in Bengaluru to soon receive information from US agency about threats to space assets". Deccan Herald (in ఇంగ్లీష్). 2021-09-25. Retrieved 2021-09-26.
  45. Whittington, Mark R. (2023-07-02). "India signing the Artemis Accords is a historic win for space exploration". The Hill (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-02.
  46. "The Artemis Accords. Principles for Cooperation in the Civil Exploration and Use of the Moon, Mars, Comets, and Asteroids for Peaceful Purposes" (PDF). NASA (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-19.
  47. Fidler, David P (June 2, 2020). "The Artemis Accords and the Next Generation of Outer Space Governance". Council on Foreign Relations (in ఇంగ్లీష్).
  48. Hanlon, Michelle; Martin, Anne-Sophie (25 October 2020). "#SpaceWatchGL Opinion: In a Historic First, Eight Nations Formally Recognize the Need to Preserve Heritage in Space". SpaceWatch.Global.
  49. 49.0 49.1 49.2 . "U.S. policy puts the safe development of space at risk".
  50. Ji, Elliot; Cerny, Michael B; Piliero, Raphael J (17 September 2020). "What Does China Think About NASA's Artemis Accords?". The Diplomat.
  51. Rajagopalan, Rajeswari Pillai (7 June 2021). "The Artemis Accords and Global Lunar Governance". The Diplomat.
  52. Grush, Loren (2020-10-13). "US and seven other countries sign NASA's Artemis Accords to set rules for exploring the Moon". The Verge (in ఇంగ్లీష్). Retrieved 2020-10-30.
  53. von der Dunk, Frans (2020-06-02). "The Artemis Accords and the law: Is the Moon 'back in business'?". Public Interest Media (in New Zealand English). Archived from the original on 2020-06-02. Retrieved 2020-10-30.
  54. Stirn, Alexander (2020-10-30). "Raumfahrt: Wie die USA das Völkerrecht aushebeln könnten". www.spektrum.de (in జర్మన్). Archived from the original on 2020-11-01. Retrieved 2020-10-30.