ఆలేటి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యడు ఆలేటి మహీపాల్ రెడ్డి భార్యైన ఈవిడ తెలుగుదేశం పార్టీ తరపున ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 1994, 2009లో ప్రాతినిథ్యం వహించింది.[1][2]

ఆలేటి అన్నపూర్ణ
ఆలేటి అన్నపూర్ణ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
1994 - 1999, 2009 - 2014
నియోజకవర్గము ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మే 7, 1956
వేల్పూరు, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి ఆలేటి మహీపాల్ రెడ్డి
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

జననం - విద్యాభ్యాసంసవరించు

అన్నపూర్ణ 1956, మే 7న వేముల నర్సారెడ్డి, గంగవ్వ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా లోని వేల్పూరు లో జన్మించింది. డిగ్రీ వరకు చదువుకుంది.

వివాహం - పిల్లలుసవరించు

1972, మే 25న ఆలేటి మహీపాల్ రెడ్డి తో అన్నపూర్ణ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.

రాజకీయ ప్రస్థానంసవరించు

1992లో రాజకీయాల్లోకి ప్రవేశించింది. నిజామాబాద్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షులుగా పనిచేసింది. 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి, స్వతంత్ర అభ్యర్థైన బాజిరెడ్డి గోవర్ధన్ పై విజయం సాధించింది. ఆ సమయంలో రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ ఛైర్మెన్ గా పనిచేసింది. 1999లో భారత జాతీయ కాంగ్రేసు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో, 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి శనిగరం సంతోష్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కె.అర్.సురేష్ రెడ్డిపై విజయం సాధించింది.

మూలాలుసవరించు

  1. మననాయకుడు. "ఆలేటి అన్నపూర్ణ". mananayakudu.com. Retrieved 12 May 2017.[permanent dead link]
  2. మైనేత. "Annapurna Aleti". myneta.info. Retrieved 12 May 2017.

ఇతర లంకెలుసవరించు