ఇంటూరి వెంకటేశ్వరరావు

భారతీయ పత్రికారచయత

ఇంటూరి వెంకటేశ్వరరావు (జూలై 1, 1909 - 2002) స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.

ఇంటూరి వెంకటేశ్వరరావు
Inturi venkateswararao.jpg
జననంఇంటూరి వెంకటేశ్వరరావు
జూలై 1, 1909
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి
మరణం2002
వృత్తితెలుగు సినిమా రచయిత
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధులు
మతంహిందూ
తండ్రినరసింహం పంతులు
తల్లిలక్ష్మీకాంతమ్మ

ఇతను గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో నరసింహం పంతులు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. తెనాలిలో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.

ఇతను సహాయ దర్శకునిగా సుమతి, మాయలోకం, పేద రైతు, లక్ష్మి, సక్కుబాయి, నాగపంచమి, లక్ష్మమ్మ మొదలైన సినిమాలకు పనిచేశారు. వీరు సృష్టించిన కుమ్మరి మొల్ల కావ్యం నాటకం, రేడియో నాటకం, బుర్రకథ, సినిమాలుగా వెలుగుచూసింది.

వీరు చాలాకాలం నవజీవన్ సినిమా పత్రిక సంపాదకులుగా కొనసాగారు.వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక చిత్రకళను 1937లో ప్రారంభించారు. వీరు సుమారు 50 సంవత్సరాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు.

స్క్రీన్ (Screen) అనే ఆంగ్ల సినీ వారపత్రిక వీరి జీవితాన్ని సంగ్రహంగా ముద్రిస్తూ "ఎ మ్యాన్ ఆఫ్ మిలియన్ ఐడియాస్"గా అభివర్ణించింది.

రచనలుసవరించు

  • ఆంధ్ర హాలీవుడ్
  • మ్యూజింగ్స్ ఆఫ్ ది సెక్స్
  • తెలుగు సినిమా విశ్వరూపం
  • లూమినరీస్ ఆఫ్ తెలుగు ఫిలిండమ్ (ఆంగ్లం)

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

యితర లింకులుసవరించు