ఇందిరమ్మ ఇళ్ల పథకం
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్బంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఈ గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగాంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల | |
---|---|
ప్రాంతం | తెలంగాణ, భారతదేశం |
వెబ్ సైటు | ఇందిరమ్మ ఇళ్ల పథకం అధికారిక జాలగూడు |
నిర్వాహకులు | , తెలంగాణ ప్రభుత్వం |
పథకం ప్రయోజనాలు
మార్చు- ఇళ్లు లేదా భూమి లేని వ్యక్తులకు ఇంటి నిర్మాణం కోసం ఉచిత భూమి/సైట్ అందించబడుతుంది.
- ఆర్థిక సహాయం రూ. 5,00,000 ఇంటి నిర్మాణం కోసం అవసరమైన వారికి అందించబడుతుంది.
- తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం
అర్హులు వీరే
మార్చుమార్గదర్శకాలు ఇవే[1]
- లబ్ధిదారుడు విధిగా దారిద్య్రరేఖ (బీపీఎల్)కు దిగువన ఉన్న వారై ఉండాలి.
- రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక ఉంటుంది.
- లబ్ధిదారుడికి సొంతగా ఖాళీ స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి.
- గుడిసె, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా వారు కూడా పథకానికి అర్హులే.
- అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారులు కూడా అర్హులే.
- వివాహమైనా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక చేస్తారు.
- ఒంటరి మహిళా, వితంతు మహిళలూ కూడా లబ్ధిదారులే.
- లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధి వారై ఉండాలి.
ఇళ్ల మంజూరు
మార్చుమార్గదర్శకాలు ఇవే[2]
- ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు.
- గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.
- లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి ఆ తర్వాత ఫైనల్ చేస్తారు.
- జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు.
- జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్‌లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయి.
- 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. ఆర్ సీసీ రూఫ్‌తో ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది.
- లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితాను గ్రామ, వార్డుసభలో ప్రదర్శిస్తారు.
ప్రారంభం
మార్చుఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2024 మార్చి 11న భద్రాచలం మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకటరావు, కోరం కనకయ్య, రాగమయి, జారే ఆదినారాయణ పాల్గొన్నారు.[3]
మూలాలు
మార్చు- ↑ A. B. P. Desam (9 March 2024). "ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం - పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర సాయం!". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
- ↑ ETV Bharat News (8 March 2024). "ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు - మార్గదర్శకాలు ఇవే!". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
- ↑ Andhrajyothy (11 March 2024). "ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.