తెల్లం వెంకటరావు

తెల్లం వెంకటరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయనను 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భద్రాచలం శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

తెల్లం వెంకటరావు

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 డిసెంబరు 2023 - ప్రస్తుతం
ముందు పోదెం వీరయ్య
నియోజకవర్గం భద్రాచలం

వ్యక్తిగత వివరాలు

జననం (1970-01-25) 1970 జనవరి 25 (వయసు 54)
చిన్న బండిరేవు గ్రామం, దుమ్ముగూడెం మండలం, భద్రాద్రి జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌
తల్లిదండ్రులు బాపపయ్య, జానకమ్మ
జీవిత భాగస్వామి ప్రవీణ
సంతానం నికిత, రిషిత[1]
నివాసం భద్రాచలం, తెలంగాణ భారతదేశం
వృత్తి వైద్యుడు, రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

తెల్లం వెంకటరావు 2014లో రాజకీయాల్లోకి వచ్చి 2014లో మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయి ఆ తరువాత బీఆర్‌ఎస్‌లో చేరాడు. ఆయన ఆ తరువాత బీఆర్‌ఎస్‌ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేస్తూ 2018 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తెల్లం వెంకటరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి  రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు, కానీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో తనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన తిరిగి 2023 ఆగస్టు 17న హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరాడు.[4]

తెల్లం వెంకటరావును 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించగా[5], ఆయన బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పొదెం వీరయ్యపై 5,719 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[6][7]

తెల్లం వెంకటరావు 2024 ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాడు.[8][9]

మూలాలు

మార్చు
  1. "Tellam Venkata Rao 2023 Election Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 7 April 2024. Retrieved 7 April 2024.
  2. Namasthe Telangana (6 November 2023). "తెల్లం వెంకటరావు". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  3. NT News (4December 2023). "తేట తెల్లంగా విజయతీరం". Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024. {{cite news}}: Check date values in: |date= (help)
  4. A. B. P. Desam (17 August 2023). "బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం వెంకట్రావు - భద్రాచలం అభ్యర్థి ఆయనే !?". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  5. Andhrajyothy (22 August 2023). "ఆఖరున వచ్చి.. అభ్యర్థిగా నిలిచి." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  6. News18 తెలుగు (4 December 2023). "అసెంబ్లీలో అధ్యక్షా అననున్న డాక్టర్లు.. ఎమ్మెల్యేలుగా 16 మంది వైద్యులు..!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  8. Andhrajyothy (6 April 2024). "రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే". Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024.
  9. Eenadu (7 April 2024). "భారాసకు షాక్‌.. కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే". Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024.