ఇద్దరు కిలాడీలు

1983 సినిమా

ఇద్దరు కిలాడీలు 1983 లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో సుమన్, భానుచందర్, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు.

ఇద్దరు కిలాడీలు
దర్శకత్వంరేలంగి నరసింహా రావు
రచనభరత్ (కథ, మాటలు),
కాశీ విశ్వనాథ్ (మాటలు)
నిర్మాతతమ్మారెడ్డి వి. కె.
తారాగణంసుమన్,
భానుచందర్,
జయసుధ,
సాధన
ఛాయాగ్రహణంబి. కోటేశ్వరరావు
కూర్పుసి. హెచ్. మురళి
సంగీతంజయ్ రాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1983
భాషతెలుగు
వై.కాశీ విశ్వనాథ్

కథ మార్చు

రాజా, రంగా అనే ఇద్దరు యువకులు ధనవంతుల దగ్గర ఉన్న సంపదను దోచుకుని పేదవాళ్ళకి పంచిపెడుతూ, పట్టుబడినప్పుడల్లా జైలుకు వెళ్ళి వస్తుంటారు. అలా ఒకసారి జైలుకు వెళ్ళగా వారిని కొండాపురం అనే ఊరికి చెందిన యువకుడి దీనగాథ కదిలిస్తుంది. అతను అమాయకుడనీ పెద్దిరాజు, బుల్లిరాజు అనే తండ్రి కొడుకుల వల్ల తనకు తీరని అన్యాయం జరిగిందని చెబుతాడు. వారిద్దరి వల్ల ఆ ఊరిలో జనాలు చాలా ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారని తెలుసుకుంటారు. అప్పటి దాకా దొంగతనం చేయడం, పేదలకు పంచిపెట్టడం, జైలుకెళ్ళి రావడం తప్ప ప్రత్యేకంగా లక్ష్యమేమీ లేని ఆ ఇద్దరూ, ఆ ఊరి బాగు కోసం పోరాడాలనుకుంటారు.

ఆ ఊరికి వెళ్ళగానే పెద్దిరాజు, బుల్లిరాజు చేతిలో మోసపోయిన అనేకమంది అమాయకులు కనిపిస్తారు. అందులో దమయంతి అనే ఒక ఉపాధ్యాయుడి భార్య. ఆమెను మానభంగం చేసి భర్తను చంపేసి వ్యభిచారి అనే ముద్ర వేస్తారు. నారాయణ అనే రైతుకూలీకి ఇచ్చిన భూమిని బలవంతంగా లాక్కుని అతన్ని పిచ్చివాణ్ణి చేసుంటారు. రైతుల దగ్గర బలవంతంగా పన్నులు చేస్తుంటారు. రాజా, రంగా ఇద్దరూ ఊర్లోకి రాగానే ఈ దురాగతాన్ని ఎదుర్కొని బుల్లిరాజుకు దేహశుద్ధి చేస్తారు.

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఇందులో పాటలు శ్రీశ్రీ, గోపి రాశారు. పి. సుశీల, ఎస్. జానకి, జి. ఆనంద్, ఎస్. పి. శైలజ, వింజమూరి కృష్ణమూర్తి పాటలు పాడారు.

మూలాలు మార్చు

  1. "ఇద్దరు కిలాడీలు పూర్తి సినిమా". youtube.com. Mango Indian films. 28 July 2016. Retrieved 12 April 2018.