వింజమూరి కృష్ణమూర్తి

వింజమూరి కృష్ణమూర్తి ఒక తెలుగు సినిమా నేపథ్యగాయకుడు. ఇతడు చెళ్ళపిళ్ళ సత్యం, కె.వి.మహదేవన్, రమేష్ నాయుడు, ఇళయరాజా మొదలైన సంగీతదర్శకులు బాణీలు సమకూర్చిన పాటలను పాడాడు. వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణరెడ్డి, మైలవరపు గోపి, ఆత్రేయ, అదృష్టదీపక్ మొదలైన రచయితల పాటలను గానం చేశాడు. ఇంకా ఇతడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ, రమోలా మొదలైన గాయకులతో కలిసి పనిచేశాడు.

వింజమూరి కృష్ణమూర్తి
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు సినిమా నేపథ్య గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1981-1994

ఇతడు పాడిన తెలుగు పాటల పాక్షిక జాబితా:

విడుదల సంవత్సరం సినిమా పాట సంగీత దర్శకుడు (లు) రచయిత (లు) సహగాయకులు
1981 నేనూ మాఆవిడ "సన్నజాజుల సాయంత్రం వెన్నులొచ్చె" సత్యం వేటూరి పి.సుశీల
1982 ఏవండోయ్ శ్రీమతి గారు "ఇల్లరికం ఎంత సుఖం" కృష్ణ-చక్ర సినారె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
"ముద్దుల రంగా ఉండు ఉండు పదికాలాలు" పి.సుశీల
శుభలేఖ "దశరథ వర కుమారుడవైతివి" కె.వి.మహదేవన్ ఎస్.పి.శైలజ
1983 ఇద్దరు కిలాడీలు "సన్నజాజుల సాయంత్రం వెన్నులొచ్చె" జయ్ రాజా గోపి పి.సుశీల
గాజు బొమ్మలు "మల్లెలాంటి చిన్నది మనువాడనున్నది" రమేష్ నాయుడు ఆత్రేయ పి.ఎస్.లతారాణి
1984 ఆకలీ! నీకు జోహార్లు " మరోసారి మానవతను మరణం కాటేసింది " కె.ఎస్.చంద్రశేఖర్ అదృష్టదీపక్ బృందం
ప్రేమ సంగమం "చూసావా అందాల మైనా మధుమాసం మా ప్రణయం" ఇళయరాజా గోపి పి.సుశీల
"ప్రతి క్షణం పరవశం తనువంతా పులకరం" వేటూరి
1988 రుద్రరూపం " పట్టపగలు" రమేష్ నాయుడు రమోలా
1994 శ్రీ రామభక్త వీర హనుమాన్ " ఈ వారధినే మనమే నిర్మించాలి ఈ క్షణం" కృష్ణతేజ బృందం

మూలాలు మార్చు