ఈశ్వర్ సినిమా 2002లో వచ్చిన యాక్షన్ రొమాన్స్ కామిడి ఎంటర్టైనర్. ప్రభాస్,[1] శ్రీదేవి విజయ్ కుమార్, రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ఎన్.జె. బిక్షు, డా. కోట్ల హనుమంతరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించిన ఈ సినిమాకి జయంత్ సి పరాన్జి దర్శకత్వం వహించారు. నిర్మాత అశోక్ కుమార్. సంగీతం ఆర్. పి. పట్నాయక్. ప్రభాస్, శ్రీదేవి విజయ్ కుమార్ లకు ఇది మొదటి సినిమా.

ఈశ్వర్
దర్శకత్వంజయంత్ సి పరాంజి
రచనదీనరాజ్ (కథ)
జయంత్ సి పరాన్జి (చిత్రానువాదం)
పరుచూరి సోదరులు (సంభాషణలు)
నిర్మాతకోళ్ళ అశోక్ కుమార్
తారాగణంప్రభాస్
శ్రీదేవి విజయ్ కూమార్
రేవతి
శివకృష్ణ
బ్రహ్మానందం
గుండు హనుమంతరావు
బిక్షు
డా. కోట్ల హనుమంతరావు
ఛాయాగ్రహణంజవహార్ రెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఆర్. పి. పట్నాయక్
విడుదల తేదీ
11 నవంబర్ 2002
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్50 లక్షలు
బాక్సాఫీసు5 కోట్ల 35 లక్షలు

ఈశ్వర్ (ప్రభాస్) తల్లిలేని యువకుడు. దూల్ పేటలోని మురికివాడలో నివసిస్తుంటాడు. ఈశ్వర్ తండ్రి (శివ కృష్ణ) పొరుగు ప్రజల సహాయంతో గుడంబా (సారాయి) తయారు చేస్తుంటాడు. కళాశాలకు వెళుతున్న ఇందు (శ్రీదేవి) అందం చూసిన ఈశ్వర్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. 20 సంవత్సరాలుగా తన కోసం ఉన్న సుజాత (రేవతి) ను ఈశ్వర్ తండ్రి వివాహం చేసుకుంటాడు. ఈశ్వర్ సుజాతను ద్వేషిస్తుంటాడు. ఇందు తండ్రి స్థానిక ఎమ్మెల్యే (అశోక్ కుమార్) ఈశ్వర్ చంపాలని చూస్తుంటాడు. ఎవరు గెలిచారనే ఇతర కథ.

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

కోటలోని రాణి, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం రాజేష్ , ఉష, నిహాల్, లెనినా , కౌసల్య.

అమీర్ పేట, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఆర్ పి పట్నాయక్

ఓలమ్మో ఓలమ్మో, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఆర్ పీ పట్నాయక్ , ఉష

గుండెలో వలవ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.రాజేష్, ఉష

ఇన్నాళ్ళు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం . రాజేష్, ఉష

దిందిరాన , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి ,గానం.రాజేష్, ఉష

తిల్లాన థీమ్ మ్యూజిక్, గానం.ఆర్ పి పట్నాయక్ .

మూలాలు

మార్చు
  1. "Launch on new hero Prabhas". idlebrain.com. 20 March 2000. Retrieved 12 March 2011.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఈశ్వర్&oldid=4213956" నుండి వెలికితీశారు