కొల్లా అశోక్ కుమార్

సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త
(కోళ్ళ అశోక్ కుమార్ నుండి దారిమార్పు చెందింది)

అశోక్ కుమార్ ఒక తెలుగు సినీ నిర్మాత, నటుడు.[2] తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.[3] కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ నటుడిగా అతనికి తొలి సినిమా. 5 సినిమాలు నిర్మించాడు. శ్రీలంక, కొలంబో లోని ఇంటర్నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ నుంచి అతనికి బిజినెస్ మేనేజ్మెంట్ లో గౌరవ డాక్టరేట్ లభించింది. ఆయనకు ఫార్మాస్యూటికల్స్ వ్యాపారం కూడా ఉంది.[4]

అశోక్ కుమార్
జననం
కొల్లా అశోక్ కుమార్

(1959-06-01) 1959 జూన్ 1 (వయస్సు 62)[1]
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1991 - ప్రస్తుతం
జీవిత భాగస్వాములుకె. ఉషారాణి
పిల్లలుకె. ప్రదీప్ చౌదరి, కె. సందీప్, కె. గౌతమ్
తల్లిదండ్రులు
  • కె. రామనాధం (తండ్రి)
  • కె. వసుంధరా దేవి (తల్లి)

సినిమాలుసవరించు

నటుడిగాసవరించు

సంవత్సరం సినిమా పాత్ర
1991 భారత్ బంద్ ప్రతినాయకుడు
1997 ఒసేయ్ రాములమ్మా ప్రతినాయకుడు
1997 ప్రేమించుకుందాం రా రెడ్డెప్ప
1998 అంతఃపురం
1998 ఆవారాగాడు
2000 జయం మనదేరా
2002 ఈశ్వర్ హీరోయిన్ తండ్రి
2002 టక్కరి దొంగ వీరు దాదా

నిర్మాతగాసవరించు

సంవత్సరం సినిమా
1988 రక్త తిలకం
1989 ధృవ నక్షత్రం
1990 చెవిలో పువ్వు
1998 ప్రేమంటే ఇదేరా
2002 ఈశ్వర్

ఆరోపణలుసవరించు

నిర్మాత నట్టి కుమార్ అశోక్ కుమార్ తో పాటు పలువురు నిర్మాతలకు నేరస్థుడు నయీంతో సంబంధాలున్నాయని ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలు అన్నీ నిరాధారమైనవనీ, తాను నట్టి కుమార్ పై పరువునష్టం దావా వేస్తాననీ వాటిని ఖండించారు.[5]

మూలాలుసవరించు

  1. "కె. అశోక్ కుమార్". tollywoodtimes.com. Retrieved 14 November 2016.[permanent dead link]
  2. "పున్నమి ఘాట్ లో సినీ నిర్మాత, నటుడు అశోక్ కుమార్ పుష్కర స్నానం". prabhanews.com. ఆంధ్రప్రభ. Retrieved 14 November 2016.[permanent dead link]
  3. MAA, stars. "Ashok Kumar". maastars. MAA stars. Retrieved 5 July 2016.
  4. నాగేశ్వర రావు. "చనిపోతే దావూద్‌తో కూడా లింకు పెడతాడు: నట్టి ఆరోపణలపై భగ్గుమన్న నిర్మాతలు". telugu.oneindia.com. వన్ ఇండియా. Archived from the original on 24 October 2016. Retrieved 14 November 2016.
  5. "నట్టికుమార్ ఆరోపణలు నిరాధారమైనవి". sakshi.com. సాక్షి. Archived from the original on 29 October 2016. Retrieved 14 November 2016.