ఉమ్రాన్ మాలిక్

జమ్మూ కాశ్మీర్ కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు

ఉమ్రాన్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టుకు కుడిచేతి ఫాస్ట్ బౌలర్‌గా ఆడుతున్నాడు. 2022 జూన్ లో ఐర్లాండ్‌పై భారతదేశం తరపున అరంగేట్రం చేశాడు.[1] ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, దేశవాళీ క్రికెట్‌లో జమ్మూ- కాశ్మీర్ తరఫున ఆడతాడు.

ఉమ్రాన్ మాలిక్
ఉమ్రాన్ మాలిక్ (2023)
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1999-11-22) 1999 నవంబరు 22 (వయసు 24)
జమ్మూ, జమ్మూ కాశ్మీర్
మారుపేరుజమ్మూ ఎక్స్ ప్రెస్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 249)2022 నవంబరు 25 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2023 జూలై 29 - వెస్టిండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.21
తొలి T20I (క్యాప్ 98)2022 జూన్ 26 - ఐర్లాండ్ తో
చివరి T20I2023 ఫిబ్రవరి 1 - న్యూజీలాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.21
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2020/21–స్రస్తుతంజమ్మూ, కాశ్మీర్
2021–ప్రస్తుతంసన్‌రైజర్స్ హైదరాబాద్ (స్క్వాడ్ నం. 24)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20 ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 8 8 7 11
చేసిన పరుగులు 2 5 16 16
బ్యాటింగు సగటు 16.00 16.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 2* 4* 16 14
వేసిన బంతులు 330 139 752 480
వికెట్లు 13 11 12 15
బౌలింగు సగటు 27.30 26.00 46.66 34.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/57 3/48 3/25 3/57
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 2/– 2/–
మూలం: Cricinfo, 2023 ఫిబ్రవరి 1

జననం మార్చు

మాలిక్ 1999, నవంబరు 22న పండ్ల విక్రయదారుడు అబ్దుల్ రషీద్ - సీమా బేగం దంపతులకు జమ్మూ నగరంలోని గుజ్జర్ నగర్ ప్రాంతంలో జన్మించాడు.[2][3]

క్రికెట్ రంగం మార్చు

2021 ఏప్రిల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం మాలిక్ ముగ్గురు నెట్ బౌలర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు.[4] 2021 అక్టోబరు 3న 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 49వ మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు.[5][6] సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో అతను 150 కిమీ కంటే ఎక్కువ వేగంతో వరుసగా ఐదు బంతులు బౌలింగ్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.[7][8] తన ఫాస్ట్ బౌలింగ్ తో 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు.[9] 2021, నవంబరు 23న తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం, భారతదేశం ఎ తరపున దక్షిణాఫ్రికా ఎ కి వ్యతిరేకంగా ఆడాడు.[10]

2022 ఐపిఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతనిని కొనసాగించింది.[11][12] 2022 ఏప్రిల్ 27న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాలిక్ ట్వంటీ 20 క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్లు సాధించాడు.[13][14] ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా కూడా మాలిక్ ఎంపికయ్యాడు.[15] ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్ లో 157 వేగంతో ఒక భారతీయుడు వేసిన అత్యంత వేగవంతమైన బంతిని వేశాడు.

2022 మేలో మాలిక్ దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం భారత ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[16] మరుసటి నెలలో ఐర్లాండ్‌తో జరిగిన రెండు-మ్యాచ్‌ల సిరీస్‌కు భారత టీ20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[17] తన టీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రంలో 2022, జూన్ 26 న ఐర్లాండ్‌పై భారతదేశం తరపున ఆడాడు.[18] 2022 నవంబరులో న్యూజిలాండ్‌పై భారత క్రికెట్ జట్టు తరపున అతని మొదటి అంతర్జాతీయ వన్డేలోకి అరంగేట్రం చేశాడు. డెవాన్ కాన్వేని తన తొలి వికెట్‌గా ఔట్ చేశాడు.

మూలాలు మార్చు

  1. "Umran Malik makes debut for Team India in first T20I against Ireland". Zee News. 26 June 2022.
  2. "Meet India's fastest bowler, Umran Malik". ESPNcricinfo. Retrieved 2023-08-02.
  3. Jain, Praveen (2022-05-08). "Fruit-seller to father of sensation: Snapshots of how life has changed for Umran Malik's family". ThePrint. Retrieved 2023-08-02.
  4. "From Gujjar Nagar to IPL 2021: Umran Malik Story | SRH". Penbugs. 6 October 2021. Retrieved 2023-08-02.
  5. "IPL 2021, KKR vs SRH: Umran Malik - Know about Sunrisers Hyderabad debutant". India TV. 3 October 2021. Retrieved 2023-08-02.
  6. "Full Scorecard of KKR vs SRH 49th Match 2021/22". ESPNcricinfo. Retrieved 2023-08-02.
  7. "Raw pace and nerveless accuracy: How Umran Malik regained Sunrisers' middle-overs control". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  8. "IPL 2021: Umran Malik clocks 153kmph, Kane Williamson calls him 'special'". Times of India. Retrieved 2023-08-02.
  9. "Umran Malik to stay back in UAE as net bowler for India's T20 World Cup campaign". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  10. "1st unofficial Test, Bloemfontein, Nov 23 - 26 2021, India A tour of South Africa". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  11. "IPL 2022: Sunrisers Hyderabad retain Kane Williamson, Rashid Khan, Abdul Samad and pacer Umran Malik". India Today (in ఇంగ్లీష్). 30 November 2021. Retrieved 2023-08-02.
  12. Desk, India com Sports. "IPL Retentions: Umran Malik to Abdul Samad; Biggest Surprises". www.india.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
  13. "GT vs SRH: Umran Malik breathes fire to claim first five-wicket haul in IPL". India Today. Retrieved 2023-08-02.
  14. "'Umran Malik will take the world by storm if selected for India'". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  15. "IPL 2022: Emerging Player Award – Umran Malik". iplt20.com. Retrieved 2023-08-02.
  16. "New faces galore for India's T20 international series against South Africa; squad named for rescheduled England Test". International Cricket Council. Retrieved 2023-08-02.
  17. "Hardik Pandya to captain India in Ireland T20Is; Rahul Tripathi gets maiden call-up". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  18. "1st T20I, Dublin (Malahide), June 26, 2022, India tour of Ireland". ESPN Cricinfo. Retrieved 2023-08-02.