ఊరంతా అనుకుంటున్నారు

బాలాజీ సానాల దర్శకత్వంలో 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఊరంతా అనుకుంటున్నారు 2019, అక్టోబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డిల నిర్మాణ సారథ్యంలో బాలాజీ సానల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ తదితరులు నటించగా, కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించాడు.

ఊరంతా అనుకుంటున్నారు
ఊరంతా అనుకుంటున్నారు సినిమా పోస్టర్
దర్శకత్వంబాలాజీ సానల
రచనరమ్య గోగుల
శ్రీహరి మంగళంపల్లి
బాలాజీ సానల
నిర్మాతశ్రీహరి మంగళంపల్లి
రమ్య గోగుల
పి.ఎల్.ఎన్. రెడ్డి
తారాగణంనవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్
ఛాయాగ్రహణంజీ.ఎల్. బాబు
కూర్పుమధు
సంగీతంకె. ఎం. రాధాకృష్ణన్
నిర్మాణ
సంస్థ
రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
5 అక్టోబరు 2019 (2019-10-05)
సినిమా నిడివి
144 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
 • దర్శకత్వం: బాలాజీ సానల
 • నిర్మాత: శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి
 • రచన: రమ్య గోగుల, శ్రీహరి మంగళంపల్లి, బాలాజీ సానాల
 • సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్
 • ఛాయాగ్రహణం: జీ.ఎల్. బాబు
 • కూర్పు: మధు
 • నిర్మాణ సంస్థ: రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాణం

మార్చు

2016లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాలో నటించిన నవీన్ విజయ్ కృష్ణ (నటుడు నరేష్ కుమారుడు) ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు, ఈ చిత్ర ట్రైలర్ ఎడిటర్‌గా కూడా పనిచేశాడు.[1] శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, కొత్తగా నటి సోఫియా సింగ్ ఇతర పాత్రలను పోషించారు.[2] రెండు జంటల ప్రేమ కథలలో ఈ చిత్రం రూపొందింది.[3] 2018, జనవరి 22న చిత్రీకరణ ప్రారంభమైంది.[4] ఈ చిత్రాన్ని పాలకొల్లులో, లక్ష్మీ పార్వతి ఇంట్లో చిత్రీకరించారు.[1][5] జయసుధ, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.[1]

పాటలు

మార్చు

ఈ చిత్రానికి కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించాడు. రాశి ఖన్నా ఈ చిత్రంలో 'కన్నా' అనే పాటను పాడింది.[6]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కన్నా (రచన: వనమాలి)"వనమాలికె. ఎం. రాధాకృష్ణన్, కె.ఎస్. చిత్ర4:45
2."అలవాటులో లేని (రచన: శ్రీహరి మంగళంపల్లి)"శ్రీహరి మంగళంపల్లిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత ఉపద్రష్ట3:36
3."నీ రొంబా రొంబా (రచన: శ్రీహరి మంగళంపల్లి)"శ్రీహరి మంగళంపల్లిమనీషా ఎర్రబత్తిని2:51
4."మ్యారేజేస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ (రచన: పెద్దాడ మూర్తి)"పెద్దాడ మూర్తిపవన్, వైష్ణవి3:21
5."ఆటను ఆడుతున్నదేవరో (రచన: శ్రీహరి మంగళంపల్లి)"శ్రీహరి మంగళంపల్లిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం3:49
6."కన్నా (రచన: వనమాలి)"వనమాలిరాశి ఖన్నా, అనురాగ్ కులకర్ణి3:20
మొత్తం నిడివి:21:42

విడుదల

మార్చు

ఈ చిత్రాన్ని 2019, మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. అక్టోబరు 5న విడుదలయింది.[7][8] దసరా పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలయింది.[9][10]

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 1.2 Chowdhary, Y. Sunita (3 October 2019). "Naveen Vijay Krishna's long road to limelight". The Hindu. Retrieved 8 December 2020.
 2. India, The Hans (24 September 2019). "Naresh's son testing his luck". The Hans India. Archived from the original on 6 November 2020. Retrieved 8 December 2020.
 3. Pecheti, Prakash. "Playing Telugu conservative girl was all fun: Megha". Telangana Today. Archived from the original on 6 November 2020. Retrieved 8 December 2020.
 4. "ఊరంతా అనుకుంటున్నారు". Sakshi. 17 January 2018. Archived from the original on 6 November 2020. Retrieved 8 December 2020.
 5. kavirayani, suresh (24 May 2018). "Naresh's son Naveen Vijay Krishna signs a new film". Deccan Chronicle. Archived from the original on 23 April 2019. Retrieved 8 December 2020.
 6. "Raashi Khanna hums the song Kanna for Oorantha Anukuntunnaru". The Times of India. Retrieved 8 December 2020.
 7. "నరేశ్ కొడుకు సినిమా.. మహేశ్ ప్రచారం". Samayam Telugu. Archived from the original on 6 November 2020. Retrieved 8 December 2020.
 8. "వెనక్కి వెళ్లేది లేదు". Sakshi. 5 October 2019. Retrieved 8 December 2020.
 9. "Oorantha Anukuntunnaru is slated for Dussehra release". The Times of India. Retrieved 8 December 2020.
 10. "'ఊరంతా అనుకుంటున్నారు' అందరికీ నచ్చుతుంది". Sakshi. 2 October 2019. Archived from the original on 20 September 2020. Retrieved 8 December 2020.

బాహ్య లింకులు

మార్చు