కె. ఎం. రాధాకృష్ణన్

కె. ఎం. రాధాకృష్ణన్ ఒక తెలుగు సినిమా సంగీత దర్శకుడు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతంలో నిపుణుడు. ఆనంద్, గోదావరి, చందమామ, మాయాబజార్ లాంటి సినిమాలకు సంగీతం అందించాడు.[2] 2006 లో గోదావరి సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం లభించింది.[3] రాధాకృష్ణన్ కొన్ని ప్రకటనలకు, భక్తి పాటల ఆల్బములకు కూడా సంగీతాన్నందించాడు.

కె. ఎం. రాధాకృష్ణన్
సినివారంలో కె. ఎం. రాధాకృష్ణన్
జననం
గద్వాల, తెలంగాణ, భారతదేశం[1]
విద్యబిఎస్సీ
విద్యాసంస్థహైదరాబాదు మ్యూజిక్ కాలేజీ
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2002-ప్రస్తుతం
వెబ్‌సైటుhttp://kmradhakrishnan.com

వ్యక్తిగత జీవితం మార్చు

రాధాకృష్ణన్ గద్వాలలో జన్మించాడు. మూడో తరగతి దాకా అక్కడే చదువుకున్నాడు. కొద్ది రోజులు కోయంబత్తూరు వెళ్ళి మళ్ళీ చదువు పూర్తి చేయడానికి గద్వాల తిరిగి వచ్చాడు. అతని తండ్రి 1973 నుంచి ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండటంతో అతనికి సంగీతం మీద ఆసక్తి కలిగింది. అంతే కాకుండా ఆయన నాటకరంగ నటుడు కూడా. సుమారు 500 ప్రదర్శనల దాకా ఇచ్చాడు. ఆయన రాధాకృష్ణన్ ను హిందుస్థానీ సంగీతం నేర్చుకోమని చెప్పాడు. చాగంటి లక్ష్మి దగ్గర రెండేళ్ళ పాటు శాస్త్రీయ సంగీతం సాధన చేశాడు. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన తర్వాత హైదరాబాదులో స్థిరపడ్డాడు. హైదరాబాదు మ్యూజిక్ కాలేజీ నుండి డిప్లోమా తీసుకున్నాడు. గాంధీ భవన్ లో సంగీత శిక్షకుడి కోసం కావలసిన మెలకువలు నేర్చుకున్నాడు. ఆర్నాల్డ్ అనే గురువు దగ్గర రెండేళ్ళ పాటు పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. వెంగమాంబ అనే గురువు దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. తర్వాత కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను సమ్మేళనం చేయడం సాధన చేశాడు. బి. ఎస్సీ పూర్తి చేసిన తరువాత నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి లో సబ్ బ్రోకరుగా పనిచేశాడు.[1]

కెరీర్ మార్చు

సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు సునీల్ కుమార్ రెడ్డి అనే సంగీత దర్శకుడు సైలెన్స్ ప్లీజ్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఆయన తన సినిమాకు రాధాకృష్ణన్ నేపథ్య సంగీతం అవకాశం ఇచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత హీరో అనే బాలల చిత్రానికి సంగీతం చేసే అవకాశం దొరికింది. తర్వాత శేఖర్ కమ్ముల అతనికి ఆనంద్, గోదావరి లాంటి సినిమాలకు సంగీతం చేసే అవకాశాలు ఇచ్చాడు. ఈ రెండు సినిమాల్లో రాధాకృష్ణన్ అందించిన సంగీతం అతనికి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా సినిమాలు విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించింది. రాధాకృష్ణన్ పాటలలో రాగాలు శాస్త్రీయ సంగీత మూలాలను కలిగి ఉంటాయి.[1]

సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Idlebrain Interview". idlebrain.com. Archived from the original on 6 November 2012. Retrieved 2 June 2013.
  2. "K M Radha Krishnan's Filmography". K M Radha Krishnan's website. Archived from the original on 6 October 2013. Retrieved 1 June 2013.
  3. 3.0 3.1 "Nandi Awards 2006". idlebrain.com. Retrieved 2 June 2013.
  4. "Bhale Dongalu Audio Release". ragalahari.com. Archived from the original on 23 April 2011. Retrieved 1 June 2013.
  5. "Music launch - Baladoor". idlebrain.com. Archived from the original on 30 June 2012. Retrieved 1 June 2013.
  6. "Naaku O Loverundi Audio Release". ragalahari.com. Archived from the original on 1 September 2011. Retrieved 1 June 2013.
  7. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
సంవత్సరం సినిమా భాష గమనికలు
2000 సైలెన్స్ ప్లీజ్ Silent film నేపథ్య సంగీతం
2002 హీరో తెలుగు
2004 ఆనంద్ తెలుగు
2004 మేఘం తెలుగు
2005 కాంచనమాల కేబుల్ టివి తెలుగు
2006 గోదావరి తెలుగు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం [3]
2006 మనసు పలికే మౌన రాగం తెలుగు
2006 మాయాబజార్ తెలుగు
2007 చందమామ తెలుగు
2008 సిద్దు ఫ్రం శ్రీకాకుళం తెలుగు
2008 భలే దొంగలు తెలుగు [4]
2008 బలాదూర్ తెలుగు [5]
2011 నాకూ ఓ లవరుంది తెలుగు [6]
2014 లక్ష్మీ రావే మా ఇంటికి తెలుగు [7]
2018 శుభలేఖ+లు తెలుగు