చరణ్‌రాజ్

సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు

చరణ్ రాజ్ (Charan Raj) దక్షిణ భారతీయ సినిమా నటుడు. ఆయన స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం. ఆయన ఇంతవరకు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సుమారు 400 సినిమాలలో నటించాడు.

చరణ్ రాజ్
జననం
బ్రహ్మానంద
ఇతర పేర్లుబ్రమ్మూ
వృత్తినటుడు
జీవిత భాగస్వామికల్పన
పిల్లలు1 అమ్మాయి, 2 అబ్బాయిలు

బాల్యంసవరించు

ఆయన స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం.[1] ఆయన అసలు పేరు బ్రహ్మానంద. స్నేహితులు ముద్దుగా బ్రమ్మూ అని పిలిచేవారు. ఆయన తండ్రి వివిధ ప్రాంతాలనుంచి కలప తీసుకుని వచ్చి వ్యాపారం చేసేవాడు. వారికి ఓ సా మిల్లు కూడా ఉండేది. ఆయన చదువంతా స్వంత ఊరు బెల్గాంలోనే సాగింది. ఉన్నత పాఠశాల చదువు నుంచే పాఠశాలలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొనేవాడు. కొన్ని బహుమతులు కూడా గెలుచుకున్నాడు. అందరూ అతన్ని సినిమాలకు సరిపోతావని పొగుడుతున్నా గురురాజ్ భట్ అనే స్నేహితుడు మాత్రం అతన్ని సినిమాలకు పనికిరావని ఎగతాళిగా చేశాడు. దాంతో అతడితో చాలెంజ్ చేసి నాన్న వ్యాపారం కోసం దాచుకున్న కొంత సొమ్ము తీసుకుని బెంగుళూరుకు వచ్చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అతను సినిమాల్లో చేరడం ఇష్టం లేదు.

సినిమా రంగంసవరించు

బెంగుళూరుకు రాగానే పొట్టకూటి కోసం ఓ స్టార్ హోటల్ లో రాత్రిళ్ళు పాటలు పాడేవాడు. పాటలు పాడటం అతనికి చిన్నప్పటి నుంచీ హాబీ. పగలు సినిమా అవకాశాల కోసం ప్రొడక్షన్ ఆఫీసులు, దర్శకనిర్మాతల చుట్టూ తిరిగే వాడు. కొద్ది రోజులకు ఎస్.డి. సిద్ధలింగయ్య అనే దర్శకుడు పరాజిత అనే కన్నడ సినిమా ద్వారా కథానాయకుడిగా అవకాశమిచ్చాడు. అప్పట్లో ఆ సినిమా వంద రోజులు ఆడింది. ఆ తరువాత పది సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. తరువతా తెలుగు సినిమా ప్రతిఘటన లో కాళీ అనే విలన్ పాత్ర చేశాడు. అది అతనికి చాలా మంచి పేరు తీసుకుని వచ్చింది.

వ్యక్తిగతంసవరించు

ఆయన భార్యపేరు కల్పన. వారిది పెద్దలు కుదిర్చిన వివాహం. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఖాళీ సమయాల్లో టెన్నిస్, గోల్ఫ్ ఆడుతాడు. వంటచేయడం కూడా ఆయన హాబీ. పౌరాణిక పుస్తకాలు ఇష్టంగా చదువుతాడు.

నటించిన సినిమాలుసవరించు

  1. పరాజిత (కన్నడ)
  2. ప్రతిఘటన (1986) - కాళీ
  3. ప్రతిఘాట్ (హిందీ, 1987) - కాళీ ప్రసాద్
  4. అమెరికా అబ్బాయి (1987)
  5. అరణ్యకాండ (1987)
  6. ఆస్తులు అంతస్తులు (1988)
  7. దొంగమొగుడు (1987)
  8. స్వయంకృషి (1987) - గోవింద్
  9. ఇంద్రుడు చంద్రుడు (1989) - మేయర్ సెక్రటరీ
  10. పనక్కరన్ (తమిళం, 1990)
  11. మా ఇంటి మహరాజు(1990)
  12. కర్తవ్యం (1991) - కాశీపతి
  13. సూర్య ఐ.పి.ఎస్ (1991)
  14. ఆశయం (1993)
  15. గాయం (1993) - దుర్గాప్రసాద్ బ్రదర్
  16. జెంటిల్ మాన్ (1993) - పోలీస్ ఆఫీసర్
  17. పోలీస్ బ్రదర్స్ (1994)
  18. హలో బ్రదర్ (1994)
  19. యువరత్న రాణా (1998)
  20. అనితా ఓ అనితా యదార్థ ప్రేమ కథ - దర్శకుడు
  21. అడవి చుక్క (2000) - అర్జున్
  22. అమ్మా నాగమ్మ (2001) - డాక్టర్ అమర్
  23. అతడు (2005) - పోలీస్ ఆఫీసర్
  24. నా అల్లుడు (2005)
  25. అసాధ్యుడు (2006)
  26. పిచ్చోడి చేతిలో రాయి (2009) - చక్రధరరావు
  27. అమ్మదొంగా (2008)
  28. కరెంట్ (2009)
  29. అడవిచుక్క (2008)
  30. కుద్రత్ కా కానూన్ (హిందీ, 1987) - ఎమ్.పి. చరణ్ దాస్
  31. ఏం పిల్లో ఏం పిల్లడో (2010)
  32. కొమరం పులి (2010)
  33. అధినాయకుడు (2012)
  34. రాజా నరసింహా

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు ఆదివారం సంచిక, డిసెంబరు 11, 2011, పేజీ 20