ఎటాక్ 2016, ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సి. కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో రామ్ గోపాల్ వర్మ[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ కుమార్, జగపతిబాబు, సురభి, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ తదితరులు నటించగా,[3] రవిశంకర్ సంగీతం అందించాడు.

ఎటాక్
Attack Telugu Movie Poster.jpg
ఎటాక్ సినిమా పోస్టర్
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
నిర్మాతసి. కళ్యాణ్
రచనరామ్ గోపాల్ వర్మ
స్క్రీన్ ప్లేరామ్ గోపాల్ వర్మ
కథసమీర్ చంద్ర
నటులుమంచు మనోజ్ కుమార్
జగపతిబాబు
సురభి
ప్రకాష్ రాజ్
వడ్డే నవీన్
సంగీతంరవి శంకర్
ఛాయాగ్రహణంఅంజి
కూర్పుఅన్వర్ ఆలీ
నిర్మాణ సంస్థ
సి.కె. ఎంటర్టైన్మెంట్స్
పంపిణీదారుసుభా శ్వేత ఫిల్మ్స్
విడుదల
1 ఏప్రిల్ 2016 (2016-04-01)
నిడివి
107 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశంసవరించు

గురు రాజ్ (ప్రకాశ్ రాజ్) తను చేస్తున్న దందాలు మానేసి మంచిగా బ్రతకాలనుకొని, గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. గురు ముగ్గురు కొడుకులు కాళి (జగపతి బాబు), గోపి (వడ్డె నవీన్), రాధ (మంచు మనోజ్) ఎవరికి వారుగా బ్రతికేస్తుంటారు. అదే సమయంలో పాత కక్ష్యల నేపథ్యంలో గురు దారుణ హత్యకు గురౌతాడు. తండ్రి హత్య వెనుక ఉన్న వ్యక్తులు కనుక్కునే క్రమంలో కాళి కూడా హత్య చేయబడుతాడు. ఈ హత్యలకు గల కారణాలు ఏంటి, సత్తూ (అభిమన్యుసింగ్) కు గురుకి ఉన్న సంబంధం ఏంటి, ఈ హత్య మిస్టరీను రాధా ఎలా కనుక్కున్నాడు అనేది మిగతా కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
  • నిర్మాత: సి. కళ్యాణ్
  • కథ: సమీర్ చంద్ర
  • సంగీతం: రవి శంకర్
  • ఛాయాగ్రహణం: అంజి
  • కూర్పు: అన్వర్ ఆలీ
  • నిర్మాణ సంస్థ: సి.కె. ఎంటర్టైన్మెంట్స్
  • పంపిణీదారు: సుభా శ్వేత ఫిల్మ్స్

పాటలుసవరించు

Untitled

ఈ చిత్రంలోని పాటలను సిరాశ్రీ రాయగా, రవి శంకర్ సంగీతం అందించాడు. లహరి మ్యాజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]

పాటల జాబితా
సంఖ్య. పాటపాటల జాబితా నిడివి
1. "చావదురా పగ"  రాంకీ, ఉమా నేహ 4:28
2. "ధర్మరాజు ఓడొద్దని"  స్వరాగ్, సాయిచరణ్ 5:22
3. "నాయన్ని అడుగులా"  స్వరాగ్, కీర్తన్ 2:47
4. "రక్తపు చుక్కలు"  స్వరాగ్ 5:09
5. "ప్రభుం ప్రాణనాథం"  శ్రీకాంత్, స్వరాగ్, సాయిచరణ్ 3:08
6. "ధర్మరాజు ఓడొద్దని (రిమిక్స్)"  ఉమా నేహ, స్వరాగ్, సాయిచరణ్ 5:11
మొత్తం నిడివి:
26:05

నిర్మాణంసవరించు

చిత్రీకరణసవరించు

ఈ చిత్రం 2015, ఫిబ్రవరి 20న అధికారికంగా ప్రారంభించబడింది. మరుసటి రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.[5] ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాదులోని ఒక ఆర్.టి.ఓ. కార్యాలయంలో చిత్రీకరించారు.[1]

నటీనటులు ఎంపికసవరించు

1993లో వచ్చిన గాయం సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో జగపతి బాబు చేస్తున్న రెండవ సినిమా ఇది.[5] మనోజ్ కు వర్మతో ఇది తొలిచిత్రం కాగా, జగపతి బాబుతో కరెంట్ తీగ తరువాత ఇది రెండవ సినిమా.[2] వడ్డే నవీన్ ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించాడు.[6] బీరువా సినిమాలో నటించిన సురభి ఈ చిత్రంలో ప్రధానపాత్రలో నటించింది.[3]

విడుదలసవరించు

2015, మే 30న ఈ చిత్ర మొదటి మోషన్ పోస్టర్ విడుదలయింది.[7] 2015, మే 31న థియేట్రికల్ ట్రైలర్ విడుదలయింది.[8] 2016, ఏప్రిల్ 1న ఈ చిత్రం విడుదలయింది.[9]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Manoj attacks an RTO office". 123telugu.com. Retrieved 10 January 2020. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 "RGV-Jagapati Babu team up for 'Golusu'". 123telugu.com. Retrieved 10 January 2020. Cite web requires |website= (help)
  3. 3.0 3.1 "Heroine confirmed for RGV-Manoj's 'Golusu'". telugunow.com. Retrieved 10 January 2020. Cite web requires |website= (help)
  4. "Attack (Music)". AtoZ3.com. మూలం నుండి 2016-08-02 న ఆర్కైవు చేసారు. Retrieved 2019-12-29.
  5. 5.0 5.1 "Jagapati Babu enters Varma compound from today". aptoday.com. 20 February 2015. మూలం నుండి 7 అక్టోబర్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 10 January 2020. Cite web requires |website= (help)
  6. "Vadde Naveen makes a comeback". 123telugu.com. Retrieved 10 January 2020. Cite web requires |website= (help)
  7. "Attack Motion Poster Released- Manoj, RGV". Newsonway.com. మూలం నుండి 31 May 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 10 January 2020. Cite web requires |website= (help)
  8. "RGV Attack Theatrical trailer released- Manoj". Newsonway.com. మూలం నుండి 31 May 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 10 January 2020. Cite web requires |website= (help)
  9. "'ఎటాక్‌' చేయడానికి సిద్ధమయ్యారు" (Telugu లో). Eenadu. మూలం నుండి 20 March 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 10 January 2020. Cite web requires |website= (help)CS1 maint: unrecognized language (link)

ఇతర లంకెలుసవరించు