ఎదురులేని మనిషి (2001 సినిమా)

ఎదురులేని మనిషి జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో 2001 లో విడుదలైన చిత్రం.[1] ఇందులో నాగార్జున, సౌందర్య, షెహనాజ్, నాజర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను కామాక్షీ మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించాడు.

ఎదురులేని మనిషి
దర్శకత్వంజొన్నలగడ్డ శ్రీనివాసరావు
నిర్మాతడి. శివప్రసాద్ రెడ్డి
తారాగణంఅక్కినేని నాగార్జున,
సౌందర్య,
కోట శ్రీనివాసరావు,
అచ్యుత్, సుహాని కలిత
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2001
భాషతెలుగు

సూర్యమూర్తి ఊరికి పెద్దమనిషి. ఊర్లో అందరూ అతన్ని గౌరవంగా చూస్తుంటారు. సూర్యమూర్తి తన తాత, బామ్మ, ఒక చిన్న పాపతో కలిసి ఉంటాడు. అతని లాగే ఉండే తమ్ముడు సత్య హైదరాబాదులో కంప్యూటర్ సైన్సులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వస్తాడు. సత్యకి తెలుగు తెలియని ఒక అమ్మాయి స్నేహితురాలిగా ఉంటుంది. సూర్యమూర్తి పెళ్ళి వయసు వచ్చినా జీవితాంతం పెళ్ళి చేసుకోనని అంటూ ఉంటాడు. కానీ అతనికి ఎలాగైనా పెళ్ళి చేయాలని అమ్మాయికోసం వెతుకుతుంటాడు సత్య. అప్పుడే అతనికి వసుంధర తారసపడుతుంది. కొన్ని సంఘటనల తర్వాత ఆమె సూర్యమూర్తితో పెళ్ళికి ఒప్పుకొంటుంది. అప్పుడే ఆమెకు ఒక నిజం తెలుస్తుంది. తన అక్క భవానిని పెళ్ళి చేసుకుంది సూర్యమూర్తి, సత్య అన్న అనీ, సూర్యమూర్తి వల్ల అతను చనిపోయాడనీ తన కుమార్తె రాణిని సూర్యమూర్తి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడని చెబుతుంది. వసుంధర సూర్యమూర్తిని పెళ్ళి చేసుకుని ఆ కుటుంబం మీద పగ సాధించాలని చూస్తుంది. వసుంధర కొన్ని నాటకాలు ఆడి సూర్యమూర్తిని మెప్పించాలని ప్రయత్నిస్తుంది. చివరికి అందరి బలవంతం మేరకు సూర్యమూర్తి వసుంధరను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకొంటాడు. పెళ్ళైన తర్వాత పురోహితుడితో కలిసి కొన్ని రోజుల దాకా శోభన ముహూర్తం వాయిదా వేస్తుంది వసుంధర. తర్వాత ఒక దొంగ ద్వారా వాళ్ళింట్లో నగలు దొంగతనం చేయించి అక్క దగ్గరికి చేర్చాలని చూస్తుంది. కానీ ఆదొంగ పోలీసులకు పట్టుబడిపోతాడు. ఈ లోపు సత్య వసుంధరకు నిజం చెబుతాడు. నిజానికి భవాని ప్రవర్తన మంచిది కాదనీ అందుకే సూర్యమూర్తి రాణిని బలవంతంగా తీసుకువచ్చేశాడని తెలుస్తుంది. వసుంధర సూర్యమూర్తి మంచి మనసును అర్థం చేసుకుంటుంది. వదినను కాపాడటం కోసం దొంగతనం కేసును తనమీద వేసుకుంటాడు సత్య. చివరికి కుటుంబం అంతా ఎలా ఒక్కటైందనేది మిగతా కథ.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: జొన్నలగడ్డ శ్రీనివాసరావు
  • సంగీతం: ఎస్.ఎ.రాజకుమార్
  • మాటలు: మరుదూరి రాజా
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఇ.ఎస్.మూర్తి, చంద్రబోస్, పోతుల రవికిరణ్
  • నేపథ్య గానం: హరిహరన్, సుజాత, కె.ఎస్.చిత్ర, శంకర్ మహదేవన్, అనూరాధ శ్రీరామ్, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కృష్ణరాజు, పి.రజనీఉదిత్ నారాయణ్
  • ఛాయా గ్రహణం: చోటా కె నాయుడు
  • కూర్పు: కోలా భాస్కర్
  • కధ, స్క్రీన్ ప్లే,: భూపతిరాజా
  • నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
  • నిర్మాణ సంస్థ: కామాక్షి మూవీస్
  • విడుదల:30:03:2001.

పాటల జాబితా

మార్చు
  • ఏనాడైనా అనుకొన్నా నా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.హరిహరన్, చిత్ర .
  • ఏమైందమ్మ ఈనాడు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. హరి హరన్.
  • ఆకాశంలో సూరీడు...నడుమును చూస్తే, రచన: ఇ. ఎస్. మూర్తి, గానం. శంకర్ మహదేవన్, అనూరాధ శ్రీరామ్
  • మనసన్నది అన్నది, రచన: పోతుల రవికిరణ్, గానం. హరిహరన్ , కె. ఎస్. చిత్ర
  • డం డమా డం డమా, రచన: చంద్రబోస్ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహదేవన్, సుజాత, అనురాధ శ్రీరామ్, కృష్ణరాజు , పి. రజనీ
  • అరే ఈల కొట్టి, రచన: చంద్రబోస్ , గానం. ఉదిత్ నారాయణ్ , సుజాత
  • శివ స్తోత్రమ్

మూలాలు

మార్చు
  1. "Telugu Cinema - Eduruleni Manishi - Nagarjuna, Shehnaz & Soundarya". www.idlebrain.com. Retrieved 2020-06-23.