అచ్యుత్

సినీ నటుడు

'అచ్యుత్' ఒక తెలుగు టెలివిజన్, సినీ నటుడు. ఇతను తెలుగు దూరదర్శిని, సినిమాలలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన నటుడు.[1] చిన్న ప్రాయంలోనే గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందాడు.

అచ్యుత్
అచ్యుత్
అచ్యుత్ ఛాయాచిత్రపటం.
జననం
అచ్యుత్

(1964-07-01) 1964 జూలై 1 (వయసు 59)
మరణం2002 డిసెంబరు 26
మరణ కారణంగుండెపోటు
జాతీయతభారతీయుడు
వృత్తిసినీ , టెలివిజన్ నటుడు
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామిరమాదేవి
పిల్లలుసాయి సుజాత ,
సాయి శివాని
తల్లిదండ్రులుకూనపరెడ్డి సుజాత ,
కూనపరెడ్డి రామారావ్
పురస్కారాలునంది అవార్డు , జయసేన్ అవార్డు

నేపథ్యము సవరించు

కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఆసక్తి చూపాడు. 1983లో రెండేళ్ళు హైదరాబాదు లోని మధు ఫిలిం శిక్షణా సంస్థలో నటనలో శిక్షణ పొందాడు. 1986లో ఇంధ్ర ధనస్సు అనే దూరదర్శన్ సీరియల్ లో తొలిసారి నటించాడు. తరువాత వెన్నెల వేట, 1988లో హిమబిందు, ప్రేమ అంటే ఇదే సీరియల్స్ లోనూ, 1989లో మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా అనే సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి 1991లో జంధ్యాల దర్శకత్వంలోని ప్రేమ ఎంత మధురం, 1992లో బి.సి.శేఖర్ దర్శకత్వంలోని పట్టుదల సినిమాలలో నటించాడు. ఇతని కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో జయసేన్ అవార్డు అందుకున్నాడు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 1990 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డునుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నాడు.

మరణం సవరించు

2002 సంవత్సరంలో గుండె పోటుతో హఠాన్మరణం చెందాడు.

నటించిన టెలివిజన్ ధారావాహికలు సవరించు

 • ఇంధ్ర ధనస్సు (1986) - దూరదర్శన్ - (తొలి ధారావాహిక)
 • వెన్నెల వేట
 • హిమబిందు (1988)
 • ప్రేమ అంటే ఇదే (1988)
 • మిస్టర్ బ్రహ్మానందం (1989)
 • ఇదెక్కడైనా ఉందా (1989)
 • అంతరంగాలు
 • అన్వేషిత
 • మట్టిమనిషి
 • అన్నయ్య

సినిమాలలో సవరించు

మూలాలు సవరించు

 1. "TV actor Achyuth dies of heart attack". Hindu. Dec 27, 2002. Archived from the original on 24 ఫిబ్రవరి 2013. Retrieved 2 September 2012.

బయటి లంకెలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అచ్యుత్&oldid=3206329" నుండి వెలికితీశారు