ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు
ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వైద్యుడు. ఆయన 2021, మే 19న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఈ పదవిలో ఆయన ఆరేళ్లపాటు కొనసాగనున్నాడు.[1][2][3]అయన 2021 మే 21న బాధ్యతలు చేపట్టాడు.[4]
ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు | |||
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) సభ్యుడు
| |||
పదవీ కాలం 2021 – ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 12 ఫిబ్రవరి 1961 పోత్గల్ గ్రామం, ముస్తాబాద్ మండలం , రాజన్న సిరిసిల్ల జిల్లా , తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | అనూరాధ | ||
సంతానం | డా. వంశీప్రియ, డా. శశిప్రియ | ||
నివాసం | సిరిసిల్ల | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వైద్యుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుఎరవెల్లి చంద్రశేఖర్‌రావు 1961, ఫిబ్రవరి 12న తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, పోత్గల్ గ్రామంలో ఎరవెల్లి చినరామారావు, వరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పదో తరగతి వరకు పోత్గల్‌లోనే చదివాడు, హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసి, విజయవాడలో బీఏఎంఎస్ చదివి, పట్టా పొందాడు.[5]
వృత్తి జీవితం
మార్చుఎరవెల్లి చంద్రశేఖర్‌రావు బీఏఎంఎస్ పూర్తి చేశాక కొంతకాలం సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో మెడికల్ ప్రాక్టీసు ప్రారంభించాడు. 1986లో ముస్తాబాద్ మండల కేంద్రంలో తిరుమల నర్సింగ్ హోం ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. చంద్రశేఖర్‌రావు దంపతులు దాదాపుగా 33 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాడు.
రాజకీయ జీవితం
మార్చుచంద్రశేఖర్రావు విద్యార్థి దశ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ భావాలున్న కలిగిన వ్యక్తి. ఆయన తొలిసారి 2009లో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ముస్తాబాద్ జడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. [6]
మూలాలు
మార్చు- ↑ Sakshi (20 May 2021). "టీఎస్‌పీఎస్సీకి కొత్త కళ". Sakshi. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
- ↑ The Indian Express (19 May 2021). "Dr. B Janardhan Reddy appointed TSPSC Chairman". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
- ↑ The New Indian Express (20 May 2021). "Telangana government appoints Janardhan Reddy as TSPSC chief". The New Indian Express. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
- ↑ Namasthe Telangana (21 May 2021). "పదవికి న్యాయం చేస్తా". Namasthe Telangana. Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.
- ↑ Namasthe Telangana, కరీంనగర్ (19 May 2021). "టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా చంద్రశేఖర్‌రావు". Namasthe Telangana. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
- ↑ EENADU (20 May 2021). "వలసల గడ్డకు సమున్నత స్థానం". EENADU. Retrieved 20 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)