ఎర్రబోతు రాంరెడ్డి
ఎర్రబోతు రాంరెడ్డి (అక్టోబర్ 10, 1933 - నవంబర్ 10, 2018) తెలంగాణా విముక్తి పోరాటయోధుడు. నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంచేస్తూ ప్రజలను చైతన్యపరచాడు.[1] సాయుధ పోరాటంలో ఉరిశిక్ష ఖరారై చివరి క్షణాల్లో రద్దైన వారిలో రాంరెడ్డి ఒకరు.[2]
ఎర్రబోతు రాంరెడ్డి | |
---|---|
జననం | ఎర్రబోతు రాంరెడ్డి అక్టోబర్ 10, 1933 |
మరణం | నవంబర్ 10, 2018 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలంగాణా పోరాట యోధుడు |
జీవిత భాగస్వామి | సక్కుబాయమ్మ |
పిల్లలు | భాస్కర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి |
తల్లిదండ్రులు |
|
జననం - విద్యాభ్యాసం
మార్చురాంరెడ్డి 1933, అక్టోబర్ 10న ఎర్రబోతు బుచ్చిరెడ్డి, సత్తమ్మ దంపతులకు నల్లగొండ జిల్లా మండలం అప్పాజి పేట గ్రామంలో జన్మించాడు. అప్పాజీపేటలో 4వతరగతి వరకు చదివిన రాంరెడ్డి, 5నుండి 7తరగతులు నల్లగొండలోని మాల్‌బౌలీ ఉర్ధూ మీడియం స్కూల్‌లో చదువుకుంటూ రామగిరి హస్టల్‌లో ఉండేవాడు.[3]
ఉద్యమం
మార్చు1947లో 7వతరగతి చదివే రోజుల్లో కమ్యూనిస్టు ఆంధ్రమహాసభ నాయకుల ఉపన్యాసాలు విని కమ్యూనిజంపై ఆసక్తిని పెంచుకున్నాడు. తెలంగాణ ప్రజలపై రజకార్ల అరాచకాలు చూడడంతోపాటు, మీజాన్ అనే ఉద్యమ సాహిత్య పత్రికకు ఆకర్షితుడై ఉద్యమబాట పట్టాడు.
ఉరిశిక్ష రద్దు
మార్చు16 ఏళ్ళ వయసులో రజాకార్ల ఇన్‌ఫార్మర్లను మట్టుబెట్టిన ఘటనలో రాంరెడ్డి అరెస్టవడంతో, ఉరిశిక్ష పడింది. ఈ ఉరిశిక్ష పడ్డవారిలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పొలుకు చెందిన నంద్యాల శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా రామానుజాపురానికి చెందిన గార్లపాటి రఘుపతిరెడ్డి, కడవెండికి చెందిన నల్లా నరసింహులు అనే 15సంవత్సరాల యువకులు కూడా ఉన్నారు. అమెరికన్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అప్పటి టైమ్ మాగజైన్‌లో బాలుడికి ఉరిశిక్ష అనే సారాంశంతో ప్రచురితం అయ్యింది. దీనినిచూసి చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో జరిగిన యువజనోత్సవ సభల్లో 10వేలమంది యువత భారీ ర్యాలీ నిర్వహించడంతోపాటు లండన్ నుంచి డి.ఎన్.ప్రిట్ బృందం కొత్తగా ఏర్పాటైన భారత్ సుప్రీంకోర్టులో తెలంగాణ యోధులకు పడ్డ ఉరిశిక్షలపై సుదీర్ఘంగా వాదించి, అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ను సంప్రదించగా, అతను అంగీరించి ఉరిశిక్షను రద్దుచేసి యావజ్జీవ కారాగారశిక్షగా మార్చాడు.అనంతరం ఏడేండ్ల సాధారణ జైలు శిక్షను అనుభవించాడు.[4]
రాజకీయ జీవితం
మార్చుస్వాతంత్ర్యం అనంతరం అప్పాజీపేట సర్పంచ్‌గా ఏకగ్రీవంగా వరుసగా ఆరుసార్లు ఎన్నికయ్యాడు.[5]
మరణం
మార్చుగత కొంతకాలంగా అనారోగ్యంతోవున్న రాంరెడ్డి 2018, నవంబర్ 10 శనివారంరోజున హైదరాబాద్‌లోని కిమ్స్‌లో మరణించాడు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (11 November 2018). "సాయుధ పోరాట యోధుడు రాంరెడ్డి మృతి". Archived from the original on 12 November 2018. Retrieved 12 November 2018.
- ↑ నమస్తే తెలంగాణ, సంపాదకీయ వ్యాసాలు (22 February 2019). "ఉరిశిక్షను ధిక్కరించిన యోధుడు". దిలీప్ కొణతం. Archived from the original on 22 ఫిబ్రవరి 2019. Retrieved 21 September 2019.
- ↑ ఆంధ్రప్రభ, రాష్ట్రీయం (11 November 2018). "తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రాంరెడ్డి అస్తమయం". Archived from the original on 12 November 2018. Retrieved 12 November 2018.
- ↑ ఈనాడు, ప్రధాన వార్తలు (17 September 2019). "సామాన్యులే సాయుధులై". www.eenadu.net. Archived from the original on 17 September 2019. Retrieved 21 September 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (11 November 2018). "స్వాతంత్ర్య సమరయోధుడు ఎర్రబోతు రాంరెడ్డి ఇకలేరు". Archived from the original on 12 November 2018. Retrieved 12 November 2018.