ఎవరు (2019 సినిమా)
ఎవరు 2019, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] పివిపి సినిమా పతాకంపై పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పోట్లూరి, కెవిన్ అన్నె నిర్మిచిన ఈ చిత్రానికి వెంకట్ రాంజీ దర్శకత్వం వహించగా అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు.[2][3] పాకాల శ్రీచరణ్ సంగీతం, బిహెచ్ గ్యారీ ఎడిటింగ్ చేశారు.[4] ది ఇన్విజిబుల్ గెస్ట్ అనే స్పానిష్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం తీయబడింది.[5]
ఎవరు | |
---|---|
దర్శకత్వం | వెంకట్ రాంజీ |
రచన | అబ్బూరి రవి (మాటలు) |
స్క్రీన్ ప్లే | వెంకట్ రాంజీ |
నిర్మాత | పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పోట్లూరి, కవిన్ అన్నే |
తారాగణం | అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ |
ఛాయాగ్రహణం | వంశీ పచ్చిపులుసు |
కూర్పు | గ్యారీ బిహెచ్ |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థ | పివిపి సినిమా |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2019 |
సినిమా నిడివి | 118 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 7 కోట్లు |
బాక్సాఫీసు | 35 కోట్లు |
కథ
మార్చుబిజినెస్ మ్యాగ్నెట్ రాహుల్ భార్య రెజీనా నవీన్ చంద్రను హత్య చేస్తుంది. తనను అత్యాచారం చేసినందకు అతన్ని చంపానని రెజీనా అంటుంది. అటు.. రెజీనాకు వ్యతిరేకంగా ఓ లాయర్ కోర్టులో వాదించడానికి రెడీ అవుతాడు. ఈ నేపథ్యంలో రెజీనా కూడా తనపై కేసును వీక్ చేయాలని పోలీస్ ఆఫీసర్ అయిన అడివి శేషుకి డబ్బులు ఇస్తుంది. ఏడాది క్రితం తప్పిపోయిన మురళీ వర్శను వెత్తుకుంటూ అతని కొడుకు వస్తాడు. ఈ కేసులో రెజీనా హస్తం కూడా ఉంటుంది. కూనూర్ ప్రాంతంలో రిసార్ట్స్ నిర్వహించే వినయ్ వర్మ (మురళీ శర్మ) కనిపించకుండా పోతారు. అతన్ని వెతుక్కుంటూ క్యాన్సర్‌తో బాధపడే ఆయన కొడుకు రాహుల్ (నిహాల్) పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు. అదే స్టేషన్‌లో ఎస్.ఐగా పనిచేస్తుంటాడు విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్). డబ్బు ఇస్తే ఎలాంటి పనినైనే చేసే లంచావతారం విక్రమ్ వాసుదేవ్.. వినయ్ వర్మ కేసును డీల్ చేయడానికి రాహుల్ దగ్గర లంచం తీసుకుంటాడు.
నటవర్గం
మార్చు- అడివి శేష్ (విక్రమ్ వాసుదేవన్)
- నవీన్ చంద్ర (డిఎస్పి అశోక్ కృష్ణ)
- రెజీనా (సమీరా/సమ్ మహ)[6]
- మురళీ శర్మ (వినయ్ వర్మ)
- నిహాల్ కొదాటి (ఆదర్శ్ వర్మ)
- పవిత్ర లోకేష్ (ఆదర్శ్ వర్మ తల్లి)
- రాజా రవీంద్ర (సీఐ)
- పమ్మి సాయి (కానిస్టేబుల్ రెడ్డి)
- శశిధర్ (పోలీస్)
- వినయ్ వర్మ (సమీరా లాయర్ బెనర్జీ)
- సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్ (సమీరా భర్త రాహుల్ మహా)
సాంకేతికవర్గం
మార్చు- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకట్ రాంజీ
- నిర్మాత: పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పోట్లూరి, కవిన్ అన్నే
- మాటలు: అబ్బూరి రవి (మాటలు)
- సంగీతం: శ్రీచరణ్ పాకాల
- ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
- కూర్పు: గ్యారీ బిహెచ్
- నిర్మాణ సంస్థ: పివిపి సినిమా
నిర్మాణం
మార్చుఈ చిత్రం హైదరాబాదు, కొడైకెనాల్ వంటి ప్రాంతాలలో చిత్రీకరించబడింది. 2019, జూలైలో చిత్రీకరణ పూర్తయింది.[7]
ప్రచారం
మార్చుఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టీజర్ ను 2019, ఆగస్టు 4న పివిపి సినిమా విడుదలచేసింది.[8]
పాటలు
మార్చుఎవరు | |
---|---|
పాటలు by శ్రీచరణ్ పాకాల | |
Released | 20 ఆగస్టు 2019 |
Recorded | 2019 |
Studio | స్టూడియో 102 |
Label | అదిత్యా మ్యూజిక్ |
ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, వి.ఎన్.వి. రమేష్ కుమార్ సాహిత్యాన్ని అందించాడు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ఎన్నెన్నో" | చిన్మయి | 2:52 |
2. | "ఏదేమైన" | పూజన్ కొహ్లీ | 2:12 |
స్పందన
మార్చు- ఫస్ట్ పోస్ట్ - 3.5/5[9]
- టైమ్స్ ఆఫ్ ఇండియా – 3/5[10]
మూలాలు
మార్చు- ↑ "Evaru: Adivi Sesh announces the release date of his next film". Times of India. 17 July 2019.
- ↑ "Confirmed: Adivi Sesh lines up 'Major' and 'Goodachari 2' after 'Evaru'". Times of India. 10 July 2019.
- ↑ "Adivi Sesh's Evaru inspired from Hollywood film". Telugu Sira. 7 June 2019. Archived from the original on 11 జూలై 2019. Retrieved 29 నవంబరు 2019.
- ↑ "The film is \official adaptation of the Spanish film 'The Invisible Guest'". The Times Of India.
- ↑ సాక్షి, సినిమా (20 July 2019). "అడవి శేష్ 'ఎవరు' రీమేకా?". Sakshi. Archived from the original on 20 జూలై 2019. Retrieved 5 December 2019.
- ↑ ఈనాడు, సినిమా (18 August 2019). "అడివి శేష్‌లో ఆ బలం ఉంది". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 18 ఆగస్టు 2019. Retrieved 5 December 2019.
- ↑ "Regina's next is Evaru, a thriller". Times of India. 8 June 2019.
- ↑ "EVARU Theatrical Trailer – Adivi Sesh – Regina Cassandra – Naveen Chandra – Venkat Ramji -PVP Cinema". YouTube. PVP Cinema. 4 August 2019.
- ↑ "Evaru movie review: Adivi Sesh, Regina Cassandra's mystery thriller springs a pleasant surprise". Firstpost. 15 August 2019.
- ↑ "EVARU MOVIE REVIEW". The Times of India.