ఐనంపూడి (పామర్రు)
ఐనంపూడి కృష్ణా జిల్లా, పామర్రు మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం.521 138., ఎస్.టి,డి.కోడ్ = 08671.
ఐనంపూడి (పామర్రు) | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°17′45″N 80°54′20″E / 16.295870°N 80.905564°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | పామర్రు |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీ బొప్పన భరత్ కుమార్ |
జనాభా (2011) | |
- మొత్తం | 791 |
- పురుషులు | 405 |
- స్త్రీలు | 386 |
- గృహాల సంఖ్య | 219 |
పిన్ కోడ్ | 521138 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ చరిత్రసవరించు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పామర్రు మండలంసవరించు
పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
ఐనంపూడి అన్న గ్రామనామం అయినం(ఐనం) అన్న పూర్వపదం, పూడి అన్న ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. అయినం అన్న పదానికి నది/ఏరు వంపు తిరిగేచోట ప్రవాహానికి అభిముఖంగా ఉన్న ప్రదేశం అని అర్థం. పూడి అన్న పదం వాగులు, వంకల పక్కన ఉండి, ఏమాత్రం వరద పోటెత్తినా పూర్తిగా మునిగిపోయే ప్రాంతాన్ని సూచిస్తుంది.[2]
గ్రామ భౌగోళికంసవరించు
[3] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
ఈ గ్రామం గుడివాడ నుండి పామర్రు మార్గములో, అడ్డాడ నుండి ఒక కి.మీ. దూరంలో ఉంది.
సమీప గ్రామాలుసవరించు
గుడివాడ, పెడన, మచిలీపత్నం, హనుమాన్ జంక్షన్
సమీప మండలాలుసవరించు
పమిడిముక్కల, పెదపారుపూడి, వుయ్యూరు, గుడ్లవల్లేరు
గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు
పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 47 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
ఈ గ్రామానికి దగ్గరలో గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కాలేజి ఉంది.అరుణోదయ హైస్కూల్, పామర్రు ఎస్.ఎ.ఐ.ఇంగ్లీషుయ్ మీడియం హైస్కూల్, ఐనంపూడి
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బొప్పన భరత్ కుమార్, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
శ్రీ దత్త సమేత అభయసాయినాథ మందిరంసవరించు
ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని, 2015,మే నెల-16వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [4]
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
వరి, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు
ఈ గ్రామంలో పోలవరపు, బొప్పన, చలసాని, అట్లూరి వారు ఉన్నారు. వీరిలో గ్రామ ప్రముఖుడుగా పొలవరపు చిన కుటుంబరావు ఉండేవాడు. ఈయన గతంలో పలుమార్లు సర్పంచిగా పనిచేశాడు. ఈ రోజు ఆ ఊరు చాలా బాగుపడినది.
గ్రామ విశేషాలుసవరించు
గణాంకాలుసవరించు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 817.[4] ఇందులో పురుషుల సంఖ్య 436, స్త్రీల సంఖ్య 381, గ్రామంలో నివాసగృహాలు 207 ఉన్నాయి.
- 2011 జనాభా; ! క్రమ సంఖ్య!!ఊరి పేరు!!గడపల సంఖ్య!!మొత్తం జనాభా!!పురుషుల సంఖ్య!!స్త్రీలు
|- 2. ఐనంపూడి (పామర్రు) 207 817 436 381
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
- ↑ తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Inampudi". Retrieved 29 June 2016. External link in
|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.
వెలుపలి లింకులుసవరించు
[3] ఈనాడు కృష్ణా, 2014,జులై-31; 7వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,మే-17; 40వపేజీ.