అడ్డాడ

భారతదేశంలోని గ్రామం

అడ్డాడ, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 390., ఎస్.ట్.డి.కోడ్ = 08674.

అడ్డాడ
—  రెవిన్యూ గ్రామం  —
అడ్డాడ is located in Andhra Pradesh
అడ్డాడ
అడ్డాడ
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°21′29″N 80°59′08″E / 16.358126°N 80.985596°E / 16.358126; 80.985596
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ బలుసు హరికిరణ్
జనాభా (2011)
 - మొత్తం 1,040
 - పురుషులు 529
 - స్త్రీలు 511
 - గృహాల సంఖ్య 308
పిన్ కోడ్ 521390
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలంసవరించు

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపత్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలుసవరించు

గుడ్లవల్లేరు, పామర్రు, వుయ్యూరు, గుడివాడ

గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు

పామర్రు, గుడివాడ నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 43 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
  3. శ్రీ అరవింద ఇంటెగ్రల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్:- అడ్డాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ పాఠశాల 22వ వర్షికోత్సవం, 2015,డిసెంబరు-5వ తేదీనాడు నిర్వహించారు. [6]

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

  1. కీ.శే.పామర్తి సురేష్, మాజీ సర్పంచి.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బలుసు హరికిరణ్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ చలసాని రామకృష్ణ ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ అలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [3]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో 2016,మే-20వ తేదీ శుక్రవారం, వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుంపూజలు నిర్వహించారు. అనంతరం వాస్తుపూజ, స్వామివారి కళ్యాణం నిర్వహించారు. తదుపరి మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన, సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. ఈ ఆలయానికి 1.7 ఎకరాల మాన్యం భూమి ఉంది. [4]&[7]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయం గ్రామంలోని చెరువు మధ్యలో ఉంది. జాతర సమయాలలో భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బల్లకట్టుపై వెళ్ళి దర్శించుకొనెదరు. [5]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చెఱకు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

శ్రీమతి జాలారి సుభాషిణిసవరించు

అడ్డాడ గ్రామంలోని ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన శ్రీమతి జాలారి సుభాషిణి, డిగ్రీ తరువాత, ఫార్మసీ కోర్సు చదివి, కొంత అనుభవం సంపాదించిన తరువాత, బెంగళూరు సమీపంలోని బిడగి పారిశ్రామికవాడలో, "శ్రీ గణేశ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్" అను ఒక హెర్బల్ ఫార్మా సంస్థను స్థాపించి, పెద్ద మొత్తంలో ఔషధాలను తయారుచేసి, Himaalaya Herbal Products, Ravisankar Art of Living, Sami, తదితర ప్రసిద్ధిచెందిన కంపెనీలకు సరఫరా చేస్థున్నారు. సంవత్సరానికి సుమారు ఆరు కోట్ల టర్నోవరుతో నడుస్తున్న ఈ సంస్థకు, 2013 లో, కర్నాటక ప్రభుత్వం వారు, ఉత్తమ మధ్య తరహా పరిశ్రమగా ఎంపికచేసి పురస్కారం ప్రదానం చేశారు. [1]

గ్రామ విశేషాలుసవరించు

గ్రామ జనాభాసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,040 - పురుషుల సంఖ్య 529 - స్త్రీల సంఖ్య 511 - గృహాల సంఖ్య 308
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1288.[3] ఇందులో పురుషుల సంఖ్య 606, స్త్రీల సంఖ్య 682, గ్రామంలో నివాసగృహాలు 330 ఉన్నాయి.

మూలాలుసవరించు

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

బయటి లింకులుసవరించు

[1] ఈనాడు వసుంధర పేజీ; 2014; ఏప్రిల్-12. [2] ఈనాడు కృష్ణా; 2014,జూలై-31; 7వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,మే-12; 37వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,మే-25; 40వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-7; 23వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-17; 23వపేజీ. [7] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,మే-21; 2వపేజీ.

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Addada". Retrieved 29 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2015-08-10.
"https://te.wikipedia.org/w/index.php?title=అడ్డాడ&oldid=2860669" నుండి వెలికితీశారు