ఒకటి
ఒకటి (one) అనేది లెక్కించడానికి వాడే (cardinal) అంకెలలో మొదటి అంకె. దీనిని వివిధ సందర్భాలలో ఇలా వాడుతారు
- లెక్కలో మొదటిది. అంటే కొన్ని వస్తువుల సమూహాన్ని లెక్క పెట్టేపుడు "ఒకటి"తో మొదలు పెడతారు. ఇక్కడ అన్నింటిలో ఆ వస్తువు కూడా ఒకటి మాత్రమే కాని దానికి విశేష స్థానం ఏమీ లేదు. (ఒకటి, రెండూ, మూడు ....)
- అన్నింటికంటే ముందున్నది. మిగిలిన వస్తువులన్నీ దీని తరువాతివని. అలాగని ఇది మిగిలిన వాటికంటే మంచిదనేమీ కాదు (ఒకటో నెంబరు సిటీ బస్సు)
- అన్నింటికంటే ఉత్తమమైనది, ముఖ్యమైనది వంటి అర్ధాలలో (ఒకటో నెంబరు కుర్రాడు, నెం.1 బీడీలు)
- కలసిపోయాయనే అర్ధంలో (అందరూ ఒకటే, వసుధైక కుటుంబం)
- తోడు లేనిది (ఒక్కడై పోయాడు, ఒంటరినై పోయాను)
- తోడు అవసరం లేనిది, పోలిక లేనిది (ఒంటెద్దు బండి, ఒంటరి వీరుడు, ఒక్క మగాడు)
ఒకటిని సూచించే గుర్తులు
మార్చుఅంతర్జాతీయంగా "1" అనే గుర్తు "ఒకటి" అనే అంకెను సూచించడానికి వాడటమ్ బాగా స్థిరపడిపోయింది. తెలుగు లిపిలోనూ, భారతీయ హైందవ గ్రంథాలలోనూ "౧" అనే ఇంకా అక్కడక్కడ వాడుతున్నారు కానీ ఇపుడు "1"నే అత్యధికంగా వాడుతున్నారు. రోమను సంఖ్యలని అక్కడక్కడ అలంకారానికి వాడే చోట్ల ఒకటికి ఇంకా "I" లేదా "i" గుర్తులను వాడుతారు.
వివిధ భాషలలో
మార్చువివిధ భాషలలో ఒకటికి వాడే పదాలు, గుర్తులు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
నిజ సంఖ్య (Cardinal) | 1 ఒకటి |
క్రమ సంఖ్య (Ordinal) | 1వ, ఒకటవ, మొదటి |
గుణకములు Factorization | |
భాజకములు (Divisors) | 1 |
రోమన్ సంఖ్య | I |
ద్వియాంశ విధానం (Binary) | 1 |
అష్టాంశ విధానం (Octal) | 1 |
ద్వాదశాంశ విధానం (Duodecimal) | 1 |
షోడశాంశ విధానం (Hexadecimal) | 1 |
వన్ one | ఆంగ్లం |
అదీన్ один ("a-deen") | రష్యన్ |
ఏక్ एक | హిందీ |
ఒందు | కన్నడం |
ఒన్ఱు | తమిళం |
అక్కం | మళయాళం |
ఏకా | బెంగాలీ |
ఎకో | ఒరియా |
ఏక | మరాఠీ |
యేక | గుజరాతీ |
పంజాబీ | |
.. | కష్మీరీ |
.. | నేపాలీ భాష |
.. | మణిపురి భాష |
.. | అస్సామీ భాష |
.. | కష్మీరీ |
ఏకః | సంస్కృతం |
తెలుగు భాష వాడుకలో
మార్చు“ఒక”నే కొందరు “వక” అనీ, మరికొందరు “వొక” అనీ రాస్తారు. కానీ వ్యాకరణ పరంగా “ఒక”ఒప్పు, మిగిలిన రెండు ప్రయోగాలూ తప్పు కావచ్చును. అయితే వాడుకలో అన్నీ ఒకటే.
- “ఒక”కి సంక్షిప్త రూపం “ఓ”. “ఒకటీ ఓ చెలియ” అనే పాటలో “ఒకటీ” అన్నది అంకెని సూచిస్తుంది. “ఓ” అన్నది “ఒక” అనే అర్థాన్ని ఇస్తుంది.
- “ఒక” అన్నా “ఒంటి” అన్నా ఒకటే అర్థం. అందుకనే కాబోలు “ఒకటికి” అన్నా “ఒంటేలుకి” అన్నా ఒకటే.
- “ఒంటరి” అంటే ఎవరి తోటీ సాంగత్యం లేకుండా ఉన్న వాడనో, కాక పెళ్ళి కానివాడనో, నాతిగల బ్రహ్మచారి అనో అర్థం స్ఫురిస్తుంది. ఒంటరులు ఒక కులం. సైన్యంలో పదాతులని కూడా ఒంటరులు అనే అంటారు. (పదాతులు వాహనాలు లేని వారు కనుక ఒంటరులు అయేరేమో మరి!)
- “ఒకేఒక” అని నొక్కి వక్కాణించవలసి వస్తే “ఒక్క” అని “క”ని నొక్కి పలికితేసరిపోతుంది. లేక “ఒక్కగానొక్క” అని అనొచ్చు.
- “ఒకానొక” అంటే “ఏదో ఒక” అనే అర్థం స్ఫురిస్తుంది. ఒకప్పుడు అంటే ఒక వేళ,ఒక నాడు, మొదలైన అర్థాలు చెప్పుకోవచ్చు కదా. కాని “ఒక వేళ” అన్నప్పుడు “అయితే గియితే” అనే అర్థంకూడ వస్తుంది.
- “ఒండు” అంటే కన్నడంలోనే కాదు తెలుగులో కూడా “ఒకటే”. (“ఒండొరులు” అనే ప్రయోగం బట్టి).
- రాముడికి ఒక భార్య, ఒక మాట, ఒక బాణం. రాముడిలా జీవితాంతం ఒకేఒక భార్యతో ఉండే వాళ్ళు ఏక పత్నీ వ్రతులు.
- ఒకే కడుపున పుట్టిన వారు ఏకోదరులు. ఒకే ఒక అంకం ఉన్న నాటకాలని "ఏకాంకిక" అంటారు. ఒకే రకం పంటని సాగు చేస్తే దానిని ఏకసాయం అంటారు.
- “ఏక” సంస్కృతం అయినప్పటికీ తెలుగు వాడుకలో “ఒక” మాటల కంటే “ఏక” మాటల కంటే ఎక్కువ.
- “ఏక” కానిది “అనేక.” ఇలా “ఏక” తోక దగ్గర వచ్చే పదాలకి “ప్రత్యేక”, “తదేక” అనేవి మరొకరెండు ఉదాహరణలు.
- “ఒంటరితనం” అంటే తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఏకాంతంగా ఉండడం. “ఏకాంతం” అంటే కోరుకుని ఒంటరిగా ఉండడం.
- ఒంటరిగా ఉన్న వ్యక్తిని “ఏకాకి” అని లోకులు అంటారు కాని “కావు కావు” అని అరిచే కాకులు నిజంగా ఏకాకులు కావు.
- ఒంటరిగా ఉన్న వాళ్ళని, ఒంటెద్దు బుద్ధులు ఉన్న వాళ్ళని “ఒంటి పిల్లి రాకాసి”అంటారు. “ఒంటరి ఒంటె” అని కూడా అంటారు.
- ఒంటి బ్రాహ్మణుడు మంచి శకునం కాదని ఒక మూఢ విశ్వాసం ఉంది.
- అరగంట కాని వేళలో గడియారం గంట కొడితే ఒంటిగంట అయినట్లు లెక్క.
- గణితంలో “ఏకాంతర కోణం” అన్నప్పుడు “ఏకాంతర” అంటే ఒకటి విడిచి మరొకటి అని అర్థం.
- గణితంలో “ఒకటి” ముఖ్య సంఖ్య (”కార్డినల్ నంబర్”), “ఒకటవ” అన్నది క్రమ సంఖ్య (”ఆర్డినల్ నంబర్”). గణితం దృష్టిలో ఒకటి బేసి సంఖ్య, నిజ (”రియల్”) సంఖ్య, ధన సంఖ్య, సహజ (”నేచురల్”) సంఖ్య, పూర్ణాంకం, నిష్ప (”రేషనల్”) సంఖ్య. గణితంలో “ఒకటి” ప్రధానసంఖ్య (”ప్రైమ్ నంబర్”) కూడా. ఈ ప్రధాన సంఖ్యలే శ్రీనివాస రామానుజన్ సంగడికాళ్ళందరిలో ప్రధానులు.
- ఒకసారి వింటే కంఠతా వచ్చే వారిని ఏకసంథాగ్రాహి అంటారు.
- ఏకాగ్రత అంటే ఒకే ఒక అంశం మీద దృష్టి నిలపడం అని ఏకగ్రీవంగా తీర్మానంచెయ్యవచ్చు. ఏకాగ్రత లేనివారు ఏకసంథాగ్రాహులు కాజాలరు.
- ఏకాహం అంటే ఒకే దినం చేసే కర్మకాండ.
- ఎకాఎకీ అంటే ఒకే దారి తీసుకుని వచ్చెయ్యడం. “ఏకాండీగా ఉన్న తాను” అన్నప్పుడు ఏక ఖండమైన బట్ట అని వివరణ.
- తెలుగులో పదినీ ఒకటినీ కలిపితే “పదునొకటి” వస్తుంది. తెలుగు పదికి ”ఒండు” కలపగా వచ్చినది “పదకొండు”. కాని సంస్కృతంలో దశనీ ఏకనీ కలిపితే “దశేక” కాదు, “ఏకాదశ” అవుతుంది. ఇది తెలుగుకీ సంస్కృతానికీ ఉన్న తేడాలలో ఒకటి.
- వ్యాకరణంలో సంధి కార్యం జరిగినప్పుడు రెండు అక్షరాల స్థానంలో ఒకేఒక అక్షరం ఆదేశంగా వస్తే దానిని ఏకాదేశ సంధి అంటారు.
- రాజనీతిలో ఏకాధిపత్యం వేరు, నిరంకుశత్వం వేరు.
- “ప్రథమ” అంటే “ఒకటవ” అని అర్థం కనుక ప్రధానం అంటే ముఖ్యమైనది.వివాహాది కార్యక్రమాలలో తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమాన్ని ప్రధానం అంటారు.
ఇతర భాషలనుండి వివిధ రంగాలలో వాడుక
మార్చు- గ్రీకు భాషలో “మొనో” అంటే ఏక. అందుకనే ఏకాంతంగా బతికేవాడిని “మొనాకోస్” అంటారు. ఇందులోంచే “మంక్” అన్నమాట వచ్చింది. ఇటువంటి వారిని మనం “ఏకాకి” అనవచ్చు.
- లేటిన్ నుండి వచ్చిన “యూని”, గ్రీకు నుంచి వచ్చిన “మొనో” అన్న ప్రత్యయాలతో ఇంగ్లీషులో ఎన్నో మాటలు ఉన్నాయి.”యూనిట్, యునీక్, యునైట్, యూనిటీ, యూనివర్స్, మొనోపలీ” మొదలైనవి.”మోనోలిథిక్” అంటే ఏకశిల.
- మోనో అంటే “ఒక”. టోన్‌అంటే “స్వరం”. కనుక మోనోటోన్‌అంటే ఎగుడుదిగుళ్ళులేకుండా ఉండే ఒకే ఒక స్వరం. ఇలా ఉదాత్త అనుదాత్తాలు లేకుండా అంటే మొనోటనస్‌గా ఉండే కార్యక్రమాలు బోరుకొడతాయి.
గణిత శాస్త్రంలో
మార్చుసాధారణ లెక్కలు
మార్చుగుణకారము | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 50 | 100 | 1000 | |||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 50 | 100 | 1000 |
భాగహారము | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 0.5 | 0.25 | 0.2 | 0.125 | 0.1 | |||||||||||
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
వర్గీకరణ | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 1 | 1 | 1 | 1 | 1 | 1 | 1 | 1 | 1 | 1 | 1 | 1 | ||
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఇతర గణితాంశాలు
మార్చు- ఏదైనా సంఖ్యను ఒకటితో గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. కనుక 1 ని గుణాకార తత్సమం "multiplicative identity" అంటారు. అందువలన సంఖ్యాసూచనా విధానంలో ఏస్థానంలోనైనా 1 "automorphic number" అవుతుంది.
- ఏదైనా సంఖ్యను ఒకటితో భాగిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది.
- ఏదైనా సంఖ్యకు "1"తో వర్గీకరిస్తే (exponentiate చేస్తే) మళ్ళీ అదే సంఖ్య వస్తుంది.
- ధన బేసి పూర్ణాంకాలలో (positive odd integer) "1" అతి చిన్నది.
- సహజ సంఖ్యా సమితి Natural Numbers "N" 1 తో ప్రారంభమైతుంది.
- ఒకానొకప్పుడు "1"ని ప్రాథమిక సంఖ్యగా (prime) పరిగణించేవారు కాని, ఈ రోజుల్లో ఆ హోదా నుండి 1 ని తొలగించిటం వల్ల కొన్ని మౌలికమైన గణిత సంబంధమైన లాభాలు పొడచూపుతున్నాయి.
- గణాంక పట్టికలనీ (statistical tables), దత్తాంశ సమితులనీ (data sets) పరిశీలించి చూస్తే సాధారణంగా ఏ సంఖ్యలో అయినా ఒక అంకె కనబడే సంభావ్యత (probability) సిద్ధాంత పరంగా 0.1 (అంటే పదింట ఒకటి) ఉండాలి. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక సంఖ్య మొదటి స్థానంలో 1 పదింట మూడు సార్లకి పైబడి కనిపిస్తుంది. మన సామాన్య అనుభవానికి అతీతమైన ఈ దృగ్విషయాన్ని (phenomennon) Benford's law అంటారు.
ఇతర సందర్భాలలో
మార్చుఇంకా విశేషాలు
మార్చువనరులు
మార్చు- ఈ మాట తెలుగు వెబ్ పత్రిక - మార్చి 1999 సంచిక - వేమూరి వేంకటేశ్వరరావు వ్యాసం - రచయిత, పత్రికల సౌజన్యంతో
- వేమూరి వేంకటేశ్వరరావు, "ఒకటి, రెండు, మూడు,..., అనంతం," కినిగె ఇ-ప్రచురణ, https://web.archive.org/web/20190428112414/http://kinige.com/