లీలా శాంసన్

భారతీయ నృత్యదర్శకురాలు

లీలా శాంసన్ (జ.1951) ఒక భరతనాట్య కళాకారిణి, నృత్యదర్శకురాలు, రచయిత్రి.

లీలా శాంసన్
లీలా శాంసన్
జననం (1951-05-06) 1951 మే 6 (వయసు 73)[1]
కూనూర్, నీలగిరి జిల్లా, తమిళనాడు
వృత్తిఅధ్యక్షురాలు: కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు(2011–15)
డైరెక్టరు: కళాక్షేత్ర (2005–13)
అధ్యక్షురాలు: కేంద్ర సంగీత నాటక అకాడమీ (2010–14)
Actor: ఓ కాదల్ కణ్మణి (2015), ఆదిత్యవర్మ (2019), సిల్లు కరుపట్టి (2019)
Current groupస్పందన (1995–ప్రస్తుతం)
Dancesభరతనాట్యం
వెబ్‌సైటుపద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు, కళైమామణి

ఆరంభ జీవితం

మార్చు

ఈమె 1951 మే 6వ తేదీన[2] తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కూనూర్‌లో బెంజమిన్ అబ్రహామ్‌ శాంసన్, లైలా శాంసన్ దంపతులకు జన్మించింది.ఈమె తండ్రి పూనేకి చెందిన యూదు మతస్థుడు. అతడు 1939లో రాయల్ ఇండియన్ నేవీలో చేరి 1964 నాటికి వైస్ అడ్మిరల్‌గా భారత నౌకాదళాన్ని ముందుకు నడిపాడు. అతడు 1959-1962 మధ్యలో ఖాడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి కమాండెంటుగా పనిచేశాడు.[3] ఈమె తల్లి అహ్మదాబాద్‌కు చెందిన గుజరాతీ రోమన్‌ కేథలిక్.[2][4]

ఈమె 9 యేళ్ళ వయసులో ఈమె తండ్రి ఈమెను శాస్త్రీయ నృత్యం, సంగీతం నేర్పించడానికి రుక్మిణీదేవి అరండేల్ ఆధ్వర్యంలోని "కళాక్షేత్ర"లో చేర్చాడు. ఈమె అదే సమయంలో బీసెంట్ థియొసాఫికల్ హైస్కూలులో చదువుకుంది.[3] ఈమె సోఫియా మహిళా కళాశాల నుండి బి.ఎ. పట్టను పొందింది. [5] బి.ఎ. పూర్తి అయిన తర్వాత ఈమె కళాక్షేత్రలోనే ఉంటూ భరతనాట్యం అభ్యసించసాగింది.[6][7]

వృత్తి

మార్చు

భరతనాట్యం సోలోయిస్టుగా ఈమె తన వృత్తిని ప్రారంభించి భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోను, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.[6] ఈమె ఢిల్లోలోని శ్రీరామ్‌ భారతీయ కళాకేంద్రలో, గంధర్వ మహావిద్యాలయలో విద్యార్థులకు భరతనాట్యాన్ని నేర్పించింది.[8][9] ఇంకా ఈమె లండన్ కోవెంట్ గార్డెన్‌లోని రాయల్ ఒపెరా హౌస్‌లో, మాంచెస్టర్‌లోని మిలాప్ ఫెస్ట్‌లో భరతనాట్యం నేర్పించింది. ఈమె శిష్యులలో జాయిస్ ఫాల్ పోర్సబహియాన్, జస్టిన్ మెక్‌కార్తి, కమల్‌జిత్ భాసిన్ మాలిక్, జిన్‌షాన్‌షాన్, నవతేజ్ సింగ్ జోహార్, అనూషా సుబ్రహ్మణ్యం, అదితి రావు హైదరి మొదలైనవారున్నారు.

1995లో ఈమె స్పంద అనే డ్యాన్స్ గ్రూపును ప్రారంభించింది. సంచారి, ది ఫ్లవరింగ్ ట్రీ అనే రెండు డాక్యుమెంటరీ ఫిల్మ్‌లను నిర్మించింది.[10]

ఈమె రుక్మిణీదేవి అరండేల్ జీవిత చరిత్రను రచించింది.

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ.ప్రభుత్వం 2005 ఏప్రిల్ నెలలో కళాక్షేత్రకు డైరెక్టర్‌గా నియమించింది.[11][12]తరువాత ఈమె 2010 ఆగష్టులో కేంద్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా,[1][13][14]ఏప్రిల్ 2011లో కేంద్ర ఫిల్మ్‌ సెన్సార్ బోర్డు అధ్యక్షురాలిగా[15][16] నియమించబడింది.

ఈమె 2012లో కళాక్షేత్ర డైరెక్టర్ పదవికి రాజీనామా చేసింది.[17][18] ఈమె డేరా బాబా నటించిన "ఎం.ఎస్.జి.:ద మెసెంజర్ ఆఫ్ గాడ్" అనే సినిమాకు సెన్సార్ అనుమతులు ఇవ్వకుండా రద్దు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ సినిమాకు అప్పిలేట్ ట్రిబ్యూనల్‌లో అనుమతులు లభించడంతో ఈమె తన సెన్సార్ బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేసింది.[19]

ఈమె 2015లో మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ కాదల్ కణ్మణి అనే తమిళ సినిమా ద్వారా నటనారంగంలోనికి ప్రవేశించింది. తరువాత 2017లో ఆ సినిమా హిందీ రీమేక్ ఓకే జానూలో నటించింది. ఇంకా ఈమె ఆదిత్యవర్మ (2019), పుతం పుదు కాలై (2020) మొదలైన సినిమాలలో నటించింది.

అవార్డులు

మార్చు

ఈమెకు పద్మశ్రీ పురస్కారం (1990),[20] నృత్య చూడామణి, కళైమామణి (2005),[21]సంగీత నాటక అకాడమీ అవార్డు (1999–2000)[22] మొదలైన అవార్డులు లభించాయి.

వివాదాలు

మార్చు

ఈమె ప్రియాంక గాంధీకి నాట్యం నేర్పిన గురువుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నెహ్రూ - గాంధీ కుటుంబానికి సన్నిహితురాలు.[23][24][15][24]ఈమె కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ.ప్రభుత్వం పరిపాలించిన 10 సంవత్సరాలలో 6 ముఖ్యమైన పదవులను చేపట్టింది. అనేక దినపత్రికలు ఈమెకు సెన్సార్ బోర్డ్ అధ్యక్షపదవి కట్టబెట్టడం పూర్తిగా పక్షపాతంగా జరిగినట్లు ఆరోపించాయి.

ఈమె సంగీత నాటక అకాడమీ, కళాక్షేత్ర, సెన్సారుబోర్డుల అధ్యక్షపదవిలో ఉన్నప్పుడు నాయవిరుద్ధంగా నియామకాలను చేపట్టడం, అనర్హులకు కాంట్రాక్టులను ఇవ్వడం వంటి అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.[25][26] [27]

2014లో అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రాన్ని ఎటువంటి కత్తిరింపులు లేకుండా సర్టిఫికెట్ ఇవ్వడాన్ని విశ్వహిందూ పరిషత్ విమర్శించింది. హిందూ మతాన్ని కించపరిచే సన్నివేశాలను యథాతథంగా అనుమతించడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించింది. సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్, సినిమా నటుడు అనుపమ్‌ ఖేర్ ఈమె రాజకీయాలు చేస్తున్నదని రాజీనామా చేయాలని ఆరోపించాడు.[28][29] ఈమె ముస్లిం వర్గాల ఒత్తిడిపై ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంలో,[30] క్రైస్తవ మత వర్గాల వత్తిడికి తలొగ్గి కమాల్ ధమాల్ మాలామాల్ చిత్రంలో[31] కత్తిరింపులకు అంగీకరించడం పీకే చిత్రం విషయంలో వ్యతిరేకించడం విమర్శలకు దారితీసింది.[32]

2019 డిసెంబరు నెలలో సి.బి.ఐ. ఈమెతో పాటు మరో ముగ్గురిపై కళాక్షేత్రలో ఆర్థిక నేరాలపై కేసును పెట్టింది.[33]

రచనలు

మార్చు
 • రిథమ్‌ ఇన్ జాయ్: క్లాసికల్ ఇండియన్ డాన్స్ ట్రెడిషన్స్ (1987) లస్ట్ర్ ప్రెస్, న్యూఢిల్లీ
 • రుక్మిణీదేవి: ఎ లైఫ్ (2010) పెంగ్విన్ బుక్స్ ఇండియా, ఢిల్లీ ISBN 0-670-08264-3.[34]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష వివరాలు
2015 ఓ కాదల్ కణ్మణి భవాని తమిళం తమిళంలో తొలి చిత్రం
2017 ఓకే జానూ చారు శ్రీవాత్సవ హిందీ హిందీలో తొలి చిత్రం
2019 ఆదిత్యవర్మ ఆదిత్య నాన్నమ్మ తమిళం అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్
సిల్లు కరుపట్టి యశోద '
2020 పుతం పుదు కాలై భైరవి
కాలీ ఖుహీ దాది హిందీ

సినిమా అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం Ref.
2015 దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డు ఓ కాదల్ కణ్మణి ప్రతిపాదించబడింది [35]
2011 నార్వే తమిళ్ ఫిల్మ్‌ ఫెస్టివల్ అవార్డ్స్ నార్వే తమిళ్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఉత్తమ సహాయనటి అవార్డు ఓ కాదల్ కణ్మణి గెలుపు -

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 "Press Release" (PDF). Sangeet Natak Academi. 10 August 2010.
 2. 2.0 2.1 Sruti, Issues 160-171, Publisher P.N. Sundaresan, 1998
 3. 3.0 3.1 http://www.rediff.com/news/2003/sep/11spec.htm
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-08. Retrieved 2021-04-25.
 5. "Sophia at 75: Its legacy? How it always brought our dreams to life, say alumni". Hindustan Times. 20 June 2017.
 6. 6.0 6.1 Artiste's Profile: Leela Samson Archived 10 జూలై 2011 at the Wayback Machine, Centre for Cultural Resources and Training (CCRT), Government of India.
 7. Noted students of Kalakshetra Archived 12 మార్చి 2008 at the Wayback Machine
 8. How Many?
 9. "Borders no Bar". Indian Express. 13 June 2009.
 10. www.penguinbooksindia.com
 11. "Leela Samson takes over as Kalakshetra director". The Hindu. Chennai, India. 18 April 2005. Archived from the original on 20 April 2005.
 12. Leela Samson Profile artindia.net.
 13. "Sangeet Natak Akademi chairperson Leela Samson resigns". IBNLive. 10 October 2014. Archived from the original on 2015-02-14. Retrieved 2021-04-25.
 14. "Leela Samson to be Sangeet Natak Academy chairperson". The Times of India. 1 July 2010. Archived from the original on 3 November 2012.
 15. 15.0 15.1 "A silent rebel against extremism". The New Indian Express. 5 September 2010. Archived from the original on 14 ఏప్రిల్ 2016. Retrieved 25 ఏప్రిల్ 2021.
 16. "New censor board chief Leela Samson promises balanced approach". The Hindu. Chennai, India. 2 April 2011.
 17. "I'll try through my dance to find myself again". The Hindu. Chennai, India. 30 April 2012.
 18. "Leela Samson to quit as Kalakshetra director". The Hindu. Chennai, India. 28 April 2012.
 19. "Censor Board chief Leela Samson quits over MSG nod, govt denies interference". Hindustan Times. New Delhi, India. 16 January 2015. Archived from the original on 16 జనవరి 2015. Retrieved 25 ఏప్రిల్ 2021.
 20. "Padma Awards". Ministry of Communications and Information Technology.
 21. Kalaimamani Awards for 123 persons announced The Hindu, 15 February 2006.
 22. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 17 February 2012.
 23. "Samson is Sonia's choice". Sunday Guardian. Archived from the original on 2020-11-12. Retrieved 2021-04-25.
 24. 24.0 24.1 "Dancing to her tune". Indian Express. 3 April 2011.
 25. "The Dance of Controversy". India Today. 4 May 2012.
 26. "Leela's Kala as Kalakshetra Director Questioned". Daily Pioneer. 14 July 2013.
 27. "The Dirt beneath the Charm". The Hindu. 1 May 2012.
 28. "If PK was cleared, why not MSG? VHP accuses Leela Samson of 'playing politics'". Firstpost. 20 January 2015.
 29. "Anupam Kher criticizes Censor Board chairman Leela Samson for resigning from her post". IBNLive. 19 January 2015. Archived from the original on 2015-01-22. Retrieved 2021-04-25.
 30. "Censor Board and its uncensored leelas". Daily Pioneer.
 31. "Catholic groups get objectionable 'Kamaal Dhamaal Malamaal' scenes out". DNA India.
 32. http://www.kemmannu.com/index.php?action=flashnews&type=269we
 33. "CBI registers corruption case against Leela Samson,3 other Kalakshetra officials". TOI. 14 December 2019.
 34. www.outlookindia.com "First Light: Embodies the spirit of Kalakshetra style of Bharatanatyam in content, style and visual appeal"
 35. "Who will win the award for Best Supporting Actor (Female) - Tamil?". Retrieved 4 October 2018.

బయటి లింకులు

మార్చు