కడప రెడ్డేమ్మ 1991లో విడుదలయిన తెలుగు చలన చిత్రం. ఆర్.సి.క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ, చలపతిరావులు నిర్మించిన ఈ సినిమాకు టి.భరధ్వాజ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శారద, రంజిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

కడప రెడ్డెమ్మ
(1991 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ
తారాగణం మోహన్ బాబు ,
శారద,
రంజిత
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ఆర్.సి. క్రియేషన్స్
భాష తెలుగు

కథ మార్చు

రగులుతున్న రాయలసీమని ఈ చిత్రంలో సమర్థవంతంగా చూపించారు. ఈ చిత్రం కులద్వేషాలు పచ్చని బతుకుల్ని బూడిద చెయ్యడమే కాదు ఊరినే వల్లకాటిగా మార్చే వైనాన్ని ఎత్తిచూపి ఆలోచింపజేసేదిగా ముగుస్తుంది.

తమ ఉభయ కులాల మధ్య సయోధ్యలేదని తెలిసి కూడా రెడ్డి కులానికి చెండిన రాజశేఖర్ రెడ్డి (భరత్), నాయుళ్ళమ్మాయి మధు (మధుబాల) కాలేజీలో ప్రేమించుకుంటారు. సహజంగానే పెద్దలు ఒప్పుకోరు. కడప రెడ్డమ్మ (శారద) వాళ్ళను కలిపేందుకు దోహదపడి, ఆ ఊరి నుంచి బైటికి దాటించేస్తుంది. తరువాత వాళ్ళు పెళ్ళీ చేసుకుంటారు. మదు గర్భవతి అవుతుంది. మళ్ళీ ఆ ఊరొచ్చిన ఆ జంటని కుల పెద్దలు బలితీసుకుంటారు. ఆ పసికందును కూడా చంపాలనుకున్న పెద్దల్ని రెడ్డమ్మ హతమారుస్తుంది.

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-22.

బాహ్య లంకెలు మార్చు