కడవకుదురు

ప్రకాశం జిల్లా చినగంజాము మండలం లోని గ్రామం


కడవకుదురు, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523181. ఎస్.ట్.డి.కోడ్ = 08594. ]

కడవకుదురు
రెవిన్యూ గ్రామం
కడవకుదురు is located in Andhra Pradesh
కడవకుదురు
కడవకుదురు
అక్షాంశ రేఖాంశాలు: 15°43′34″N 80°15′22″E / 15.726°N 80.256°E / 15.726; 80.256Coordinates: 15°43′34″N 80°15′22″E / 15.726°N 80.256°E / 15.726; 80.256 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచినగంజాము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,682 హె. (4,156 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం4,337
 • సాంద్రత260/కి.మీ2 (670/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08594 Edit this at Wikidata)
పిన్(PIN)523181 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సంతరావూరు 3.4 కి.మీ, చినగంజాము 3.7 కి.మీ, గొనసపూడి 4.8 కి.మీ, పుల్లరిపాలెం 5.8 కి.మీ, పందిల్లపల్లి 6.2 కి.మీ.

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన వేటపాలెం మండలం, ఉత్తరాన ఇంకొల్లు మండలం, ఉత్తరాన చీరాల మండలం, పశ్చిమాన నాగులుప్పలపాడు మండలం.

సమీప పట్టణాలుసవరించు

చినగంజాము 3.7 కి.మీ, వేటపాలెం 8.4 కి.మీ, ఇంకొల్లు 14.1 కి.మీ, చీరాల 16.3 కి.మీ.

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామ పంచాయతీ సర్పంచిగా శ్రీ తోట సుబ్బారావు (83 సం.) ఏకథాటిగా, 25 సంవత్సరాలు పనిచేశారు. వీరి ఎన్నికల ఖర్చు రు.100/- ధరావత్తు ఖర్చు మాత్రమే. వీరు ఏకగ్రెవంగా ఎన్నికైనప్పుడు, కొన్ని సార్లు పైసా ఆశించని ఏకగ్రీవాలే. వీరి హయాంలో 300 మంది పేదలకు ఒక్కొక్కరికీ 40 సెంట్ల వ్యవసాయ భూములు ఇప్పించారు. వీరి హయాంలో, గ్రామంలో ఒక్కసారే పోలీసులు జోక్యం చేసుకున్నారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని విశేషాలుసవరించు

సగరం శ్రీకృష్ణసవరించు

  1. ఈ గ్రామానికి చెందిన ఒక పేదకుటుంబానికి చెందిన శ్రీకృష్ణ, చిన్నతనం నుండియే కబడ్డీ క్రీడలో మక్కువతో ఆ క్రీడలో శిక్షణ పొంది, తన పదవ సంవత్సరం నుండి కబడ్డీలో బరిలోనికి దిగినాడు. ఇతడు కడ్డీలో అంచెలంచెలగా ఎదుగుతూ, కళాశాల, విశ్వవిద్యాలయస్థాయిలో పలుమార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నాడు. పలు కీలక విజయాలు సాధించి తన సత్తా చాటినాడు. ఈ ఏడాది జాతీయస్థాయిలో తన సామర్ధ్యం ప్రదర్శించి "తెలుగు టైటాన్స్" యాజమాన్యం దృష్టిని ఆకర్షించాడు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన 24 మంది క్రీడాకారులను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇతడొక్కడే ఎంపికకావడం విశేషం. [3]
  2. 2015, నవంబరు-24 నుండి 27 వరకు బెంగుళూరులో నిర్వహించిన 63వ జతీయస్థాయి కబడ్డీ పోటీలలో అంధ్రప్రదేశ్ పురుషుల జట్టులో ఇతడు చూపిన ప్రతిభ ఆధారంగా, ఇతడిని ఇండియా క్యాంప్ (ప్రాబబుల్స్) కు ఎంపిక చేసారు. ఈ సందర్భంగా ఇతడు 2016, జనవరి-7 వరకు శిక్షణ పొందుతాడు. [4]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 4,337 - పురుషుల సంఖ్య 2,212 - స్త్రీల సంఖ్య 2,125 - గృహాల సంఖ్య 1,171

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,228.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,177, మహిళల సంఖ్య 2,051, గ్రామంలో నివాస గృహాలు 1,014 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,682 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-11; 8వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-10; 8వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-22; 14వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=కడవకుదురు&oldid=2892704" నుండి వెలికితీశారు