కత్తి పద్మారావు

కత్తి పద్మారావు, తెలుగు కవి, దళితవాద ఉద్యమకారుడు, హేతువాది, సామాజిక కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ దళితమహాసభ స్తాపకుడు.

కత్తి పద్మారావు
కత్తి పద్మారావు
జననం(1953-07-27)1953 జూలై 27
జాతీయతభారతదేశము
రాజకీయ పార్టీ.
తల్లిదండ్రులుఅమ్మ మాణిక్యమ్మ, నాన్న సుబ్బయ్య.

బాల్యం, కుటుంబం మార్చు

పద్మారావు, గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని ఈతేరులో 1953 జూలై 27న దళిత మాల కుటుంబంలో పుట్టారు. అమ్మ మాణిక్యమ్మ, నాన్న సుబ్బయ్య. ఇద్దరూ వ్యవసాయ కార్మికులే. వారు సంవత్సరంలో ఆరు నెలలు ఈతేరులో వ్యవసాయ కూలీలుగానూ, మిగిలిన ఆర్నెల్లూ చీరాలలోని ఇండియన్ లీఫ్ టొబాకో డిపో (ఐఎల్‌టీడీ) లో కార్మికులుగా పనిచేసేవారు. తాత కట్టా రాఘవులు, చీరాల ఐఎల్‌టీడీలో మేస్త్రీ. పేరాలలోని శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణ హైస్కూలులో చదివారు. చీరాల పౌర గ్రంథాలయం, పొన్నూరు కాలేజీలోని లైబ్రరీలో చదివారు. పొన్నూరులోని శ్రీభావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో చేరారు. లక్ష్మీపార్వతి, ఐ. వెంకట్రావు, కె. కృష్ణకుమారి మొదలైన వాళ్లంతా పొన్నూరు కాలేజీలో 'భాషాప్రవీణ' కోర్సులో ఈయనకు సహాధ్యాయులు. తరువాత పొన్నూరు కాలేజీలోనే తన గురువుగారు కొండవీటి వెంకటకవి స్థానంలో లెక్చరర్‌గా పనిచేశారు.

హేతువాది మార్చు

పద్మరావు హేతువాది, హేతువాదం పత్రిక నడిపారు. తన కుమారునికి కులాంతర వివాహం (చేతన్-నళిని) చేశాడు. "ఏ మతంలోనైనా హేతువాదం ఉండాలి. సంస్కృతం చదువుకోబట్టే అంబేద్కర్, లోహియా ఉద్యమకారులయ్యారు. సంస్కృతంలో షట్దర్శనాలన్నీ హేతువాదమే చెబుతాయి" అని భావించాడు. ఈయన తను బ్రాహ్మణులను వ్యతిరేకించనని, బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తానను, ఎస్సీల్లో కూడా ఎదిగిన తర్వాత మిగిలిన వారిని తొక్కేసే బ్రాహ్మణవాదం ఉంది. దాన్నే వ్యతిరేకిస్తానని చెప్పుకున్నాడు.

పద్మారావు ప్రజారాజ్యం పార్టీలో చేరాడు.

దళిత ఉద్యమ సారధి మార్చు

ఈ శతాబ్దంలో దళిత ఉద్యమానికి, దళిత ఉద్యమ సాహిత్యానికి దశ దిశ నిర్దేశం చేసిన నాయకుడు. కవి డా,, కత్తి పద్మారావు తెలుగు దళిత సాహిత్యంలో ’జైలు గంటలు’ మోగించుకుంటూ ఈ దేశ మూలవాసులైన అంటరానివారి భూమి భా ష నే మాత్లాడుతూ అణగారిన ఆర్తుల గుండె ఘోషల్ని ’కట్టెల మోపు’ లా నెత్తికెత్తుకొని గుండెల నిండూగా బుద్ధున్ని, అంబేత్కర్ ని నింపుకొని ఆత్మగౌరవ స్వరంతో ఉద్యమ స్ఫూర్తితో, ఈ యుగ కవిత్వాన్ని వినిపిస్తూ కవి పద్మారావు ముందుకు సాగుతున్నారు.[1]

1985 లో కారంచేడూ దళితులపై జరిగిన అమానుషమైన దాడీకి వ్యతిరేకంగా పద్మారావు ఆత్మగౌరవ పొరాటాన్ని నిర్మించారు.చుండూరు దళిత ఉద్యమాన్ని నిర్మించి, పల్లె నుంచి ఢిల్లీ దాకా కదం తొక్కించారు.

తాను రాసిన 68 పుస్తకాలు ముద్రితమైనాయి.ఆయన తీసుకు వచ్చిన1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీ యాక్ట్ దళితుల జీవితాల్లో మలుపు తెచ్చింది..

సిద్ధార్థుడు తాను జీవించిన కాలంలోనే సమాజంలోని వైవిధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ధనం కోసం, రాజ్యం కోసం, కామం కోసం మానవుడు పడుతున్న తహతహకు కారణం సిద్ధార్థునికి బోధపడలేదు.

ఇకపోతే తెలుగు జాతి ప్రస్తావన క్రీస్తు పూర్వం 6వ శతాబ్ది నాటి ఐతరేయ బ్రాహ్మణంలో మనకు కనిపిస్తుంది. గౌతముని పుట్టుక కూడా క్రీస్తుపూర్వం 6వశతాబ్దమే.బుద్ధ్ధుడు జీవించిన కాలంలోనే తెలుగు దేశానికి ఆయన సందేశం వచ్చిందనేది చరిత్ర. అయితే తెలుగు లిఖిత సాహిత్యం వైదిక సాహిత్య అనువాదంతో ప్రారంభమైంది. సా.శ. 11వ శతాబ్దిలో నన్నయ్య ఈ ప్రయత్నం చేశాడు. బుద్ధుడు క్రీస్తు పూర్వం 543వ సంవత్సరంలో మహా పరినిర్వాణం చెందాడు. గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలులో దొరికిన క్రీ.పూ. 3వ శతాబ్దం నాటి శాసనాలను బట్టి ఆ ప్రాంతంలో ఆనాడు బౌద్ధం వేళ్ళు పాతుకొని ఉన్నదని తెలుస్తుంది. కర్నూలులోని జొన్నగురి, రాయచూర్‌ జిల్లాలోని కనిగిరి ఆకాలంలో సువర్ణ గిరులుగా ప్రసిద్ధి చెందిన బౌద్ధ ప్రాంతాలుగా చెప్పబడుతున్నాయి. బుద్ధుని తరువాత ప్రసిద్ధి చెందిన నాగార్జునుడు సా.శ. 1, 2శతాబ్దాల్లోనివాడు. ఈయన తెలుగువాడు. అయినప్పటికీ తెలుగులో బౌద్ధ గ్రంథాలు దొరకడం లేదు. తెలుగులో ఆనాటికి మౌఖికంగా బౌద్ధంతో ఎంతో సాహిత్యం ఉండి వుండవచ్చు. లిఖిత రూపంలో వచ్చినవి కూడా తరువాత ధ్వంసం అయి వుండవచ్చు. బౌద్ధ సత్యాలు తెలుగు నేలలో మౌఖికంగానే ప్రచారమయ్యా యి. నిజానికి బుద్ధుడు సత్యాన్వేషణ కోసం ఎంతగా శ్రమించాడో అంతగా తర్కవితర్కాలకు గురైన తర్వాత, అనేక పరీక్షలకు గురైన తర్వాతనే బౌద్ధాన్ని ఆమోదించి ఆయన శిష్యులుగా మారారని అర్థం అవుతుంది. బుద్ధుడి జ్ఞానం ఏదో అభూతం నుంచి పుట్టిందికాదు. అది ఒక తాత్వికమైన మథనం నుంచి ఆవిర్భవించింది. బుద్ధుడికి ముందున్న 62 అది భౌతికవాదాలలో ఉన్న వాస్తవాంశాలను గ్రహించే బౌద్ధం రూపొందించబడినట్లు దిఘనకాయనుడు చెప్పారు. బౌద్ధం ఒక కుల నిర్మూలనా దర్శనం. అందుకే బౌద్ధ దర్శనం కులం పునాదుల్ని పెకలించడానికి ప్రయత్నం చేసింది. హిందూ ప్రత్యామ్నాయం సృష్టించడమంటే కులానికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించడమే. తథాగతుని దృష్టిలో ఎక్కువ తక్కువ భేదాలు లేవు. పండిత పామర భేదాలు, మంచివారు, చెడ్డవారు అనే భేదాలు ఆయ నకు లేవు. కుల నిర్మూలనా భావన, అస్పృశ్యతా నిర్మూలనా చర్యలే బౌద్ధానికి ఊపిరి. నిజానికి ఆంధ్ర దేశంలో బౌద్ధం ఒక ప్రజా ఉద్యమంగా విస్తరిల్లింది. నాటి శాసనాల వల్ల వర్తకులు, పాటకజనం, సీ్త్ర జనం బౌద్ధాన్నే పోషించినట్లు, స్తూప చైత్య విహారాదులు నిర్మించినట్లు తెలుస్తుంది. వాణిజ్య పారిశ్రామిక కేంద్రాలైన పట్టణ, నగరాల సమీపంలోనూ, రహదారుల మీద బౌద్ధ క్షేత్రాలుండడం గమనించదగింది. చర్మకారులతో సహా సామాన్య ప్రజానీకం బౌద్ధం పట్ల శ్రద్ధ వహించారు. ధాన్యకటకం మొదటి నుంచి మహా సాంఘిక కేంద్రమైంది. అమరావతీ శాసనాల్లో చైత్యకుల ప్రస్తావన ఎక్కువ. అందువలన మహా సాంఘికులకే చైత్యకులని స్థానిక నామమైంది. బుద్ధునికి మొదటిగా ‘లోకోత్తర’ గుణాలను ఆపాదించిన వారు చైత్యకులే. తెలుగు నేలలోని నాగార్జుని బోధనలు ఇతర దేశాలకు ప్రయాణించి తెలుగు వారి కీర్తిని ఇనుమడింపజేశాయి. ఆ తరువాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ బౌద్ధ సూత్రాలు రాజ్యాంగంలో పొందుపరిచారు. అంబేద్కర్‌ బౌద్ధ సూత్రాలను భారత రాజ్యాంగంలోకి తీసుకువచ్చారు.

కారల్‌ మార్క్స్‌ చెప్పిన గతితార్కిక సూత్రాలు బౌద్ధంలో ఉన్నాయి. అదే విధంగా మార్క్సిజంలోని సమసమాజ భావన బౌద్ధంలోని సంఘం శరణం గచ్ఛామి సమతుల్యమైనవి. బౌద్ధం అంతర్గతంగా మార్క్సిజంలో ఉంది. మార్క్సిజం కూడా బౌద్ధ భావాన్ని అంతర్గతంగా ప్రచారం చేసింది. కొశాంబి, శ్రావస్తి, కుశినగర్‌, కపిలవస్తు, ఇప్పటికీ తెలుగు నేలలో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం దాకా, అటు మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ నుంచి తూర్పు గోదావరి జిల్లా ఆదుర్రు వరకూ ప్రతి జిల్లాలోనూ ప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రాలు, గుహాలయాలు, చైత్యాలు, స్తూపాలు, ఆరామాలు, అద్భుతమైన శిల్ప సంపద, అపూర్వమైన కట్టడాలు గతకాలపు చిహ్నాలుగా ఉన్నాయి.

ఈ చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక తాత్విక నేపథ్యాన్ని బట్టి ఈ ప్రాంతం బౌద్ధ పరిమళాలను ఇప్పటికీ వెదజల్లుతోంది. నవ్యాంధ్రకు బౌద్ధ ప్రదేశ్‌ పేరును పెట్టడం ద్వారా చైనా, టిబెట్‌, థాయిలాండ్‌ వంటి దేశాలు ఈ రాషా్ట్రన్ని సొంతం చేసుకునే అవ కాశం ఉంటుంది. బౌద్ధ పునరుజ్జీవనం ద్వారా భారత ఉపఖండంలో ఈ రాష్ట్రం అత్యున్నతమైన సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. మళ్ళీ అశోకుడికి, శాతవాహనుడికి వచ్చినంత వెలుగు ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.[2]

రచనలు మార్చు

  1. భారతీయ సంస్కృతిలో స్త్రీ

పురస్కారాలు మార్చు

  • 1992లో అంబేద్కర్‌ అవార్డు[3]
  • 2003లో సినారె సాహితీ పురస్కారం
  • 2006లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ అవార్డు
  • 2006లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ అవార్డు
  • 2006లో బోయి భీమన్న ట్రస్ట్‌ అవార్డు
  • 2008లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌
  • 2010లో ‘మహాకవి’ బిరుదు
  • 2021లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం - వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్ అవార్డు [4]

భావాలు మార్చు

  • ఎంపీలంతా తమ పెట్టుబడులు, నివాసాలు హైదరాబాదు‌లో పెట్టుకుని కోస్తా, సీమలను నిర్లక్ష్యం చేశారు.
  • మేం హైదరాబాదు రాలేం, దోచుకోలేం. మాకు ముఖ్యపట్టణం అవసరం. సమైక్య రాష్ట్రం, కలిసుందామనడం యాసిడ్ దాడే. తెలంగాణ వచ్చినా రాకపోయినా ఆంధ్రా రావాలి.
  • ఇపుడు దళితులు మధ్యతరగతి వాళ్లయ్యారు. పలుసార్లు పోటీ చేస్తేనే ప్రజలు ఎప్పుడో ఓసారి పలుకుతారు.
  • మాల-మాదిగల సమస్య తెలంగాణ వస్తే సమసిపోతుంది.

మూలాలు మార్చు

  1. సాక్షి దిన పత్రిక 27-07-2018
  2. బుద్ధ జయంతి సందర్బం గా ఆంద్రజ్యోతి దిన పత్రిక లో ప్రత్యేక వ్యాసం, వ్యాసకర్త : కత్తి పద్మారావు
  3. అన్యాయాలను చెండాడిన ‘కత్తి’ - సూర్య పత్రిక అక్టోబర్ 23, 2011[permanent dead link]
  4. Sakshi (7 July 2021). "వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య అవార్డుల ప్రకటన". Sakshi. Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.