కన్నడ మంజులగా చెందిన మంజుల కన్నడ, తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది. ఈమె కర్ణాటక రాష్ట్రం, తుమకూరుకు చెందిన హొన్నేనహళ్ళి అనే గ్రామంలో జన్మించింది. ఈమె తండ్రి ఒక పోలీసు అధికారి. ఈమెకు చిన్న తనం నుండే నాట్యం పట్ల మక్కువ కలిగింది. ఈమె బెంగుళూరులో కె.ఆర్.రామ్‌ వద్ద భరతనాట్యం అభ్యసించింది. కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద నాట్యంలో ప్రథమ బహుమతి పొంది మైసూరు సంగీత నాటక అకాడమీ వారి స్కాలర్‌షిప్పును పొందింది. ఈమె తొలిసారిగా "మనెకట్టినోడు" అనే కన్నడ సినిమాలో ఉదయ్‌కుమార్ కూతురుగా బాలతారగా సినిమా రంగప్రవేశం చేసింది. తరువాత ఈమె ఎరడుముఖ, యారు సాక్షి, ప్రొఫెసర్ హుచ్చురాయ మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమె తోట రాముడు, ఆడది గడప దాటితే వంటి తెలుగు సినిమాలలో కూడా నటించింది.[1]

మంజుల
జననం(1954-11-08)1954 నవంబరు 8
తుమకూరు, మైసూరు రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక), భారతదేశం
మరణం1986 సెప్టెంబరు 12(1986-09-12) (వయసు 31)
బెంగళూరు, భారతదేశం
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1972–1986
జీవిత భాగస్వామిఅమృతం
పిల్లలు1

మూలాలు

మార్చు
  1. సంపాదకుడు (1975-12-01). "తోటరాముడు తో తెలుగులో పరిచయమైన కన్నడ నటి - మంజుల". విజయచిత్ర. 10 (6): 48–49.

బయటిలింకులు

మార్చు