కమతం రాంరెడ్డి, (1938 - డిసెంబరు 5, 2020) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి 3సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంరెడ్డి, ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేశాడు.[1][2]

కమతం రాంరెడ్డి
కమతం రాంరెడ్డి


మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి
నియోజకవర్గం పరిగి శాసనసభ నియోజకవర్గం (1967-1977, 1989-1994)

వ్యక్తిగత వివరాలు

జననం 1938
మొహ్మదాబాద్, గండీడ్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ
మరణం డిసెంబరు 5, 2020
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (1968-2014)
భారతీయ జనతా పార్టీ (2014-2018)
తెలంగాణ రాష్ట్ర సమితి (2018-2021)
తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, రంగనాయకమ్మ
నివాసం హైదరాబాదు
మతం హిందూ

జీవిత విషయాలు సవరించు

రాంరెడ్డి 1938లో లక్ష్మారెడ్డి, రంగనాయకమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లా, మొహ్మదాబాద్ గ్రామంలో జన్మించాడు న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు.[3]

రాజకీయ ప్రస్థానం సవరించు

1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిగి శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించాడు. అనంతరం 1972, 1989లలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందాడు. 1980లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. 1968లో చీఫ్‌విప్‌గా, 1977లో జలగం వెంగళరావు మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ, 1992లో కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్‌లో రెవెన్యూ శాఖ మంత్రిగా సేవలందించాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ రాకపోవడంతో బిజెపి పార్టీలో చేరాడు. టీడీపీ, బీజేపీ కూటమి తరఫున పరిగి నుంచి ఎన్నికల్లో పోటీచేసి, ఓడిపోయాడు. 2018లో బీజేపీ పార్టీ సస్పెండ్ చేయడంతో, టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[4]

మరణం సవరించు

రాంరెడ్డి 2020, డిసెంబరు 5న హైదరాబాదులోని తన నివాసంలో మరణించాడు. రాంరెడ్డి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి.[5]

మూలాలు సవరించు

  1. ఈనాడు, తెలంగాణ (6 December 2020). "మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత". Archived from the original on 31 January 2021. Retrieved 31 January 2021.
  2. జీ న్యూస్ తెలుగు, తెలంగాణ (5 December 2020). "Kamatham Ram Reddy: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత కన్నుమూత". Archived from the original on 6 December 2020. Retrieved 31 January 2021.
  3. "ముగిసిన 'కమతం' రాజకీయ శకం". Sakshi. 2020-12-06. Archived from the original on 2020-12-08. Retrieved 2021-01-31.
  4. "మాజీమంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత". ntnews. 2020-12-05. Archived from the original on 2020-12-05. Retrieved 2021-01-31.
  5. వి6 తెలుగు, తెలంగాణ (5 December 2020). "మాజీ రాష్ట్ర మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత". Archived from the original on 31 January 2021. Retrieved 31 January 2021.