కమ్మవారిపాలెం (నందిగామ)
కమ్మవారిపాలెం, కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కమ్మవారిపాలెం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°45′53″N 80°19′53″E / 16.764702°N 80.331371°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | నందిగామ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521185 |
ఎస్.టి.డి కోడ్ | 08678 |
రవాణా సౌకర్యాలు
మార్చుజగ్గయ్యపేట. నందిగామ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 50 కి.మీ
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామానికి చెందిన పేద విద్యార్థి భూక్యా మోతీలాల్ నెహ్రూ, కోదాడలో 3వ సం. బి.ఎస్.సి. చదువుచున్నాడు. ఇతడు క్రికెట్ పోటీలలో అండర్-25 విభాగంలో ఆడి, తన అత్యుత్తమ ప్రతిభతో మార్చి-2015లో నిర్వహించే, సౌత్ ఏషియన్ శ్రీలంక పర్యటనకు ఎంపికైనాడు.
మౌలిక వసతులు
మార్చుబ్యాంకులు
మార్చుసప్తగిరి గ్రామీణ బ్యాంక్.
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుఈ ఊరికి ప్రధాన నీటి వనరు వైరా ఏరు. ఈ ఊరిలో పంపింగ్ స్కీమ్ కూడా ఉంది.
గ్రామ పంచాయతీ
మార్చు2013,జూలైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వేల్పుల కిషోర్‌బాబు సర్పంచిగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
మార్చుశ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం
మార్చుఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. 2017,ఏప్రిల్-4న, దాతలు కొణిదెన సతీష్, లక్ష్మీచైతన్య దంపతులు, శ్రీరామనవమికి కళ్యాణం జరిపించుటకై, ఈ ఆలయానికి 30 వేల రూపాయల విలువైన పంచలోహ విగ్రహాలను వితరణగా అందించారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రోచ్ఛారణలతో హోమాలు నిర్వహించారు. దాతలు ఈ విగ్రహాలకు పంచామృతాలతో సంప్రోక్షణ నిర్వహించారు. [2]
ప్రధాన పంటలు
మార్చువరి, పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ మామిడి తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటలలో మామిడి మాత్రమే కాక సపోటా పండ్లు కూడా పండుతాయి. ఇక్కడి మామిడి తోటలలో బంగినపల్లి, చిన్న రసాలు,పెద్ద రసాలు,యెల్లమంద రకాలు చాలా ప్రసిద్ధి.
ప్రధాన వృత్తులు
మార్చుప్రధాన వృత్తి వ్యవసాయము.
గ్రామ ప్రముఖులు
మార్చుడాక్టర్ కిలారు సురేంద్రనాథ్‌బెనర్జీ.