కమ్మవారిపాలెం (నందిగామ)

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం లోని గ్రామం
(కమ్మవారిపాలెము (నందిగామ) నుండి దారిమార్పు చెందింది)

కమ్మవారిపాలెం, కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కమ్మవారిపాలెం
—  రెవిన్యూయేతర గ్రామం  —
కమ్మవారిపాలెం is located in Andhra Pradesh
కమ్మవారిపాలెం
కమ్మవారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°45′53″N 80°19′53″E / 16.764702°N 80.331371°E / 16.764702; 80.331371
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నందిగామ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521185
ఎస్.టి.డి కోడ్ 08678

రవాణా సౌకర్యాలు మార్చు

జగ్గయ్యపేట. నందిగామ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 50 కి.మీ

విద్యా సౌకర్యాలు మార్చు

  • రవీంద్రభారతి పబ్లిక్ స్కూల్, నారాయణ టేక్నో స్కూల్, నందిగామ.
  • ఇక్కడ అక్షరాస్యత చాలా ఎక్కువ. అందరు తమ పిల్లలని చదివిస్తారు. ఈ ఊరిలో రెండు మూడు తరాల నుండి విదేశాలలో స్థిరపడిన వారు, చదువుకొని తిరిగి వచ్చిన వారు ఉన్నారు. నందిగామలోని పేరు గన్న జూనియర్ కళాశాల, పాఠశాల, ఈ ఊరి వారు స్థాపించినవే.

గ్రామ విశేషాలు మార్చు

 
కాపా వారి మేడ ఈ ఊరిలో ముఖ్య లాండ్ మార్క్.

ఈ గ్రామానికి చెందిన పేద విద్యార్థి భూక్యా మోతీలాల్ నెహ్రూ, కోదాడలో 3వ సం. బి.ఎస్.సి. చదువుచున్నాడు. ఇతడు క్రికెట్ పోటీలలో అండర్-25 విభాగంలో ఆడి, తన అత్యుత్తమ ప్రతిభతో మార్చి-2015లో నిర్వహించే, సౌత్ ఏషియన్ శ్రీలంక పర్యటనకు ఎంపికైనాడు.

మౌలిక వసతులు మార్చు

బ్యాంకులు మార్చు

సప్తగిరి గ్రామీణ బ్యాంక్.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

ఈ ఊరికి ప్రధాన నీటి వనరు వైరా ఏరు. ఈ ఊరిలో పంపింగ్ స్కీమ్ కూడా ఉంది.

గ్రామ పంచాయతీ మార్చు

2013,జూలైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వేల్పుల కిషోర్‌బాబు సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు మార్చు

శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. 2017,ఏప్రిల్-4న, దాతలు కొణిదెన సతీష్, లక్ష్మీచైతన్య దంపతులు, శ్రీరామనవమికి కళ్యాణం జరిపించుటకై, ఈ ఆలయానికి 30 వేల రూపాయల విలువైన పంచలోహ విగ్రహాలను వితరణగా అందించారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రోచ్ఛారణలతో హోమాలు నిర్వహించారు. దాతలు ఈ విగ్రహాలకు పంచామృతాలతో సంప్రోక్షణ నిర్వహించారు. [2]

ప్రధాన పంటలు మార్చు

వరి, పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ మామిడి తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటలలో మామిడి మాత్రమే కాక సపోటా పండ్లు కూడా పండుతాయి. ఇక్కడి మామిడి తోటలలో బంగినపల్లి, చిన్న రసాలు,పెద్ద రసాలు,యెల్లమంద రకాలు చాలా ప్రసిద్ధి.

ప్రధాన వృత్తులు మార్చు

ప్రధాన వృత్తి వ్యవసాయము.

గ్రామ ప్రముఖులు మార్చు

డాక్టర్ కిలారు సురేంద్రనాథ్‌బెనర్జీ.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు