కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని వస్త్ర పరిశ్రమ

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (వరంగల్ టెక్స్‌టైల్ పార్క్) తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ప్రతిపాదించిన టెక్స్‌టైల్ పార్కు.[2][3] 2,000-3,000 ఎకరాల విస్తీర్ణంలో "ఫైబర్ టు ఫ్యాబ్రిక్ (ఎండ్-టు-ఎండ్)" 'కాటన్-టు-గార్మెంట్' పార్కు ఏర్పాటు చేయబడుతుంది.[4][5] కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు గీసుకొండ మండలంలోని శాయంపేట గ్రామంలో, సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఉంది.

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు
రకంప్రభుత్వ సంస్థ
పరిశ్రమటెక్స్‌టైల్ పార్కు
ప్రధాన కార్యాలయం,
సేవ చేసే ప్రాంతము
2000 ఎకరాలు[1]
యజమానితెలంగాణ ప్రభుత్వం

చరిత్ర

మార్చు

భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుగా రూపొందుతున్న ఈ పార్కు కోసం 2017, అక్టోబరు 22న వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలంలోని శాయంపేటలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు.[6]

టెక్స్‌టైల్, అపెరల్ ఇండస్ట్రీకి అత్యాధునిక తయారీ సౌకర్యాలు, ఇంటిగ్రేటెడ్ మౌలిక సదుపాయాలతో కూడిన పారిశ్రామిక స్థలాన్ని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు అందిస్తోంది. పూర్తి టెక్స్‌టైల్స్ వాల్యూ చైన్‌ను కవర్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ మోడల్‌లో ఈ పార్కు అభివృద్ధి చేయబడుతోంది.

పార్కు

మార్చు

రూ .3900 కోట్ల పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం 22 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. తిరువూరు ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ కూడా ఈ పార్కులో 10 యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.[7][8] వస్త్ర/దుస్తులు పరిశ్రమ నుండి డిమాండ్, అవసరాల ఆధారంగా 1075 కోట్ల వ్యయంతో ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు దశలవారీగా ప్రతిపాదించబడింది. 9,000 కోట్లతో సాధారణ సౌకర్యాలు, ఫ్యాక్టరీ భవనాలు, ప్లాంట్, యంత్రాలు, ఇతర సామాజిక మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు పెట్టబడ్డాయి.

కంపనీల ఏర్పాటు

మార్చు

కేరళకు చెందిన కిటెక్స్‌ వస్త్ర పరి‌శ్రమ, గణేష్ గ్రూప్ (గణేష్ ఎకోపెట్ & గణేష్ ఎకోటెక్)లు ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు 2022 మే 7న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు.[9] ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్ పరకాల ఎమ్మెల్యేల చల్లా ధర్మారెడ్డి, పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ (తూర్పు) ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

  • కిటెక్స్‌ వస్త్ర పరి‌శ్రమ: కేరళకు చెందిన కిటిక్స్ వస్త్ర పరి‌శ్రమ ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ పిల్ల‌ల దుస్తులు త‌యారు చేసే సంస్థ. 1600 కోట్ల రూపాయల పెట్టుబ‌డితో ఏర్పాటుకానున్న ఈ పరిశ్రమలో దాదాపు 15 వేలమందికి ఉద్యోగాలు రానున్నాయి.[10]
  • గణేష్ గ్రూప్ పరిశ్రమ: గణేష్ గ్రూప్ సంస్థ, గణేష్ ఎకోపెట్ & గణేష్ ఎకోటెక్ అనే రెండు యూనిట్లను ప్రారంభించనుంది. 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గణేష్ ఎకోపెట్ పరిశ్రమ రీసైకిల్ ఫిలమెంట్ నూలు, రీసైకిల్ పాలిస్టర్ చిప్‌లను తయారు చేస్తుంది. ఈ యూనిట్ ద్వారా మండలంలో 500 మందికి పైగా ఉపాధి లభించనుంది. 250 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గణేష్ ఎకోటెక్ పరిశ్రమ పెట్ ఫ్లేక్స్, పాలీప్రొఫైలిన్ ఫైబర్‌లను తయారు చేస్తుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది.
  • యంగ్ వ‌న్ పరిశ్రమ: కొరియాకు చెందిన యంగ్ వ‌న్ అనే కంపెనీ 1100 కోట్ల‌ రూపాయలతో 298 ఎకరాలతో ఎవర్‌ టాప్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. సింథటిక్‌ జాకెట్స్‌, బూట్స్‌, ట్రాక్‌ సూట్స్‌తోపాటు ట్రెక్కింగ్‌కి ఉపయోగించే ఇతర వస్ర్తాలు ఉత్పత్తి చేయనున్న ఈ పరిశ్రమలో 11,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు క‌ల్పించ‌నుండగా, పరోక్షంగా మరో 11,700 మందికి ఉపాధి లభిస్తుంది. 2023, జూన్ 17న మంత్రి కేటీఆర్ ఈ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన చేశాడు.[11]

మూలాలు

మార్చు
  1. "Most Viewed Business News Articles, Top News Articles". The Economic Times. Retrieved 29 August 2021.
  2. "Telangana CM lays foundation stone for mega textile park". Business Standard. Retrieved 29 August 2021.
  3. "Integrated Textile Park in Warangal: Telangana State". TSO. Retrieved 29 August 2021.
  4. Revathy, L.N. (17 February 2017). "Telangana woos investors to Warangal textile park". Thehindubusinessline.com. Retrieved 29 August 2021.
  5. "Green nod for Mega Textile Park in Warangal". Thehindu.com. Retrieved 29 August 2021.
  6. telugu, NT News (2023-06-11). "17న యంగ్‌వన్‌కు శంకుస్థాపన". www.ntnews.com. Archived from the original on 2023-06-11. Retrieved 2023-06-19.
  7. "TEA may set up 10 units in proposed Warangal textile park". Business Standard. 16 February 2017. Retrieved 29 August 2021.
  8. "22 firms sign MOU's for investment in Kakatiya Mega Textile Park". retail.economictimes.indiatimes.com. Retrieved 29 August 2021.
  9. telugu, NT News (2022-05-07). "ప్రాజెక్టుల‌కు భూములిచ్చిన‌ రైతులంద‌రికీ పాదాభివంద‌నాలు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-05-07. Retrieved 2022-05-07.
  10. telugu, NT News (2022-05-06). "రాష్ర్టాలు దాటొచ్చిన కిటెక్స్‌". Namasthe Telangana. Archived from the original on 2022-05-06. Retrieved 2022-05-08.
  11. "KTR: తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి: కేటీఆర్". EENADU. 2023-06-17. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.

బయటి లింకులు

మార్చు