కాచిగూడ

(వీరన్న గుట్ట నుండి దారిమార్పు చెందింది)

కాచిగూడ హైదరాబాదు నగరంలోని ప్రాంతము. ఇది మూసీ నదికి ఉత్తర ఒడ్డున ఉంది.

Kachiguda
కాచిగూడ
కాచిగూడ రైల్వే స్టేషన్
కాచిగూడ రైల్వే స్టేషన్
దేశం India
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోహైదరాబాదు
Government
 • Bodyజి.హెచ్.ఎం.సి
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడు
500 027
లోక్ సభ నియోజకవర్గంసికింద్రాబాదు
విధానసభ నియోజకవర్గంఅంబర్‌పేట
ప్రణాళికా ఏజెన్సీజి.హెచ్.ఎం.సి

విశేషాలు

మార్చు

నిజాం కాలంలో నిర్మించిన హైదరాబాదు లోని మూడవ అతి పెద్ద రైల్వేస్టేషను కాచిగూడ రైల్వేస్టేషను (Kachiguda Railway Station) ఇక్కడ ఉంది. సమీపంలోని కొండ మీద శ్యాం మందిర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన కాచిగూడ రక్షకభట నిలయము (Police Station) ఉంది.

 
కాచిగూడ రైల్వేస్టేషన్

వాణిజ్య ప్రాంతం

మార్చు

ఇది హైదరాబాదు లోని షాపింగ్ కోసం ఉన్న ఒక ప్రాంతం. సుల్తాన్ బజార్లో వస్త్రాలు లభిస్తాయి. తారకరామ, వెంకటరమణ, పద్మావతి మొదలైన సినిమా హాల్స్ ఇక్కడ ఉన్నాయి. టూరిస్ట్ హోటల్ ఈ మధ్యనే ఆధునీకరణ చేయబడింది.

రవాణా సౌకర్యాలు

మార్చు
 
The MMTS station

కాచిగూడ ప్రాంతం నుండి హైదరాబాదు లోని అన్ని ప్రాంతాలకు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. (APSRTC) బస్సు సర్వీసులు నడిపిస్తుంది. ఈ ప్రాంతంలో బస్ డిపో కూడా ఉంది. ఇక్కడ MMTS రైల్వేస్టేషను కూడా ఉంది.

ఇచట హోటల్ టూరిస్టు ప్లాజా హోటల్. దీనిని నూతనంగా నిర్మించారు. ఈ ప్రాంతంలో వైష్ణవీ హోటల్, పంచరత్న హోటల్, నంద్ ఇంటర్నేషనల్ లు ఉన్నాయి. ఇక్కడ శాకాహార హోటల్స్ అయిన హోటల్ స్వీకార్, ఇన్విటేషన్ రెస్టారెంట్, స్వాద్ రెస్టారెండు కూడా ఉన్నాయి[1]

విద్యాలయాలు

మార్చు

ఇక్కడ ప్రాచీనమైన అమృత్ కపాడియా డిగ్రీ కళాశాల (Amruth Kapadia Degree College) ఉంది. ఇక్కడ వైశ్యా వసతిగృహం (Vysya Hostel) ఉంది.

వైద్యశాలలు

మార్చు
  • శ్రీవెంకటేశ్ బర్గోంకర్ నర్సింగ్ హోమ్
  • శ్రీసాయికృష్ణ న్యూరో హాస్పిటల్

దేవాలయాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "12 Hotels around Kachiguda Railway Station Hyderabad ranked by travellers". Holidayiq.com. Archived from the original on 14 ఏప్రిల్ 2014. Retrieved 24 April 2014.

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కాచిగూడ&oldid=4237280" నుండి వెలికితీశారు