కాటిపాపల
కటి కాపరులు షెడ్యూల్డ్ కులాల్లో ఉండవలసిన కులం. వెనుకబడిన కులాల్లో ఉంది. శవాలను దహనం చేయడం సమాధి చేయడం శ్మశానాలకు కాపలా కాయడం లాంటి పనులు చేస్తారు. కటి కాపరులు అనబడే ఈ వర్గం వారు కాటికి రాత్రి పగలూ 24 గంటలూ కాపలా వుండేవారు కాదు. ఇంద్రజాల విద్యతోనూ, ఊరిలో శవయాత్ర ఉత్తర సంస్కార క్రియలు, దశదిన కర్మలు వంటివి జరిగే సందర్భాలలో భిక్షమెత్తుకుంటారు. ఎముకలు, పూసలు వంటి వస్తువులతో పాటు అమ్మవారి విగ్రహం వుంటాయి. ప్రధానంగా వీరి వేషధారణలో కంటి నిండా పెట్టుకునే కాటుక ముఖ్యమైంది. చూడగానే అత్యంత గంభీరంగా కనిపించేందుకు ఇది దోహదం చేస్తుంది. దానితో పాటు శరీరం చుట్టూ కట్టుకునే వేర్వేరు గంటలు నడుస్తున్నప్పుడు మ్రోగుతూ బుత పిచాసి కటికి మయం అయి ఉటుoది,కటిపాపల పరుష రాముడు జిల్లేడు దీన్నే వడే పలే మడలం జోగులబ గద్వాల్ జిల్లా
పారంపర్యత
మార్చుహరిశ్చంద్రుడు వారసులం అని చెప్పుకునే ఈ కాటిపాపలు, ఒక తరం నుంచి మరోతరానికి ఈ కళారూపాన్ని అందించుకుంటుూ వస్తున్నారు. గ్రామాలలో భిక్షాటన చేసుకునే ప్రాంతాలను కూడా పంచుకుంటారు. ఒకరి ప్రాంతంలో మరొకరు వెళ్లకుండా కట్టుబాటు చేసుకునేవారు. కానీ ఈ రోజు కాటిపాపలకు ఆదరణ ఏమాత్రం లేకపోవడంతో పొట్టపోసుకోవడం కోసం వీళ్ళు వివిధ వృత్తులలోకి మారిపోయారు.
సామాజిక ఆర్ధిక స్థితిగతులు
మార్చుచక్రవర్తి హరిశ్చంద్రుడు, కాటికాపరికి అమ్ముడుపోయి కాటిపని చేశాడంటారు. సత్య హరిశ్చంద్ర నాటకంలోని కాటిసీను ప్రేక్షకులకు మహా ఇష్టం. ఇప్పుడు మన గ్రామాలన్నిటిలో కాటిపాపల కులస్తులు లేరు. కొన్ని చోట్ల మాదిగ కులస్తులే ఈ కాటికాపరిపని చేస్తున్నారు.కాటికాపరులు తమ కులవృత్తితో పాటు రోడ్లెమ్మడి జాతకాలను చెప్పుకొని వచ్చే ఆదాయంతో కాపురాలను వెళ్ళదీస్తున్నారు. కాటిపాపల కులస్తులు సత్యహరిచంద్రుని వారసులమని చెప్పుకుంటారు. వీరు సంచారజాతిగా గుర్తింపు పొందారు. హిందూ శ్మశానాలకే తమ జీవితాలను అంకితం చేశారు.అప్పట్లో వీరు నివసించడానికి ఇళ్లు నిర్మించుకునేవారు కాదు. శ్మశానంలోని చెట్టు కిందే రోజులు గడిపేవారు. శవాలను దహనం చేయడమో, ఖననం చేయడమో చేసి కూలి తీసుకునేవారు.రోజులు గడవడానికి వీరు గ్రామీణ ప్రాంతాలలో యాచించేవారు. తమకు తెలిసిన కనికట్టు విద్యను ప్రదర్శించగా ప్రేక్షకులు ఇచ్చే డబ్బుతో జీవితాన్ని గడిపేవారు. అప్పట్లో కాటిపాపల పేరు చెపితేనే గ్రామీణులు భయపడే వారు. వారు ఎంతగా భయపడేవారో అతని కనికట్టు విద్య చూడడానికి అంతకుమించిన ఉత్సాహం చూపేవారు! ఆరోజుల్లో కాటిపాపలు కనికట్టు విద్యతో నోట్లో నుంచి రాళ్లు, మండ్రగబ్బలు, పాములు తెప్పించేవారు. గ్రామీణులకు ఇదే పెద్ద వినోదం కావడంతో వీరికి ఆదాయం కూడా బాగానే వచ్చేది. వీరి వేషధారణ కూడా విచిత్రంగా ఉంటుంది. పంచలోహాలతో చేసిన కిరీటం నెత్తినపెట్టుకునేవారు. నుదుట పెద్ద బొట్టు, కళ్లకు కాటుక, మెడలో దండలతో భీతిగొలిపే విధంగా ముస్తాబయ్యేవారు. కనికట్టు విద్యకు ఉపయోగించే ఎముకలు, నిమ్మకాయలు, పెద్ద గంట, గవ్వలు, తాళ్లపత్ర గ్రంథం, చెట్టు బెరడులు, జంతు చర్మం, రాగి పలక, వెండి విగ్రహాలు, రాగిపైసలు... వంటి వస్తువులతోపాటు పాములు, తేళ్లు... వంటి జంతువులు ఈ ప్రదర్శనలో చోటుచేసుకునేవి. నోట్లో నుంచి రాళ్లు, తేళ్లు, పాములు... వంటివాటిని కనికట్టు విద్య ద్వారా తెప్పించి ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తేవారు. గ్రామాలలో ఎవరైనా చనిపోతే, వారి కుటుంబానికి చెందినవారు, బంధువులు వీరికి పాత బట్టలు ఇవ్వడంతోపాటు కొంత డబ్బు కూడా ముట్టచెప్పేవారు. అయితే తాగుడుకు వీరు బానిసలు కావడంతో వచ్చిన ఆదాయంలో ఎక్కువమొత్తం మద్యానికే ఖర్చు చేసేవారు.కులాలపరంగా శ్మశానవాటికలు రావడంతో వీరికి ఉపాధి కూడా కరువైంది! ఇటు ఆదాయంలేకపోవడం, అటు కనికట్టు విద్యకు ఆదరణ లేకపోవడంతో వీరి జీవితం దుర్భరమైంది.వీరిలో బాల్య విహహాలు సర్వసాధారణం. జీవనశైలి గిరిజనులకు దగ్గరగా ఉంటుంది కనుక తమని ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు.
కాటిపాపల గురించి
మార్చుకలమెత్తిన హలమెత్తిన
మలమెత్తినవారి నొక్కమై జూడవలెన్
వలతియు నలతియు లేదిట
బలు వృత్తులు సాగినపుడె బ్రతుకులు సాగున్ -- తెలుగులెంక’ తుమ్మల
మాయలూ, మంత్రాలు
మార్చువీరిది కూడా ఇంద్రజాల ప్రదర్శనమే. ప్రజలను భయ కంపితులుగా చేసే కళారూపమిది. వీరి వేషధారణ అతి గంభీరమైనది. ఈ ప్రదర్శకుడు రంగు రంగుల దుస్తులు ధరిస్తాడు. రెండు మూడు పెద్ద గంటలను వ్రేలాడదీస్తాడు..... నడుస్తూ వుంటే ఈ గంటలు చప్పుడు ఏదో ఏనుగు నడుస్తునట్లుగా భీతి పుడుతుంది. నొసటన పెద్ద బొట్టు, వడి తిరిగిన బుర్ర మీసాలు, ఈకల మాదిరిగా చిత్రించిన రేకుల కిరీటం..... చంకలో జోలె...... చేతిలో ఎముకలు పుచ్చుకొని భూత వైద్యుడిలా ప్రవేశిస్తాడు. వీ నిత్తి మీద ఇత్తడి రేకుల కిరీటం మినహాయిస్తే, బుడబుక్కల వారి వేషధారణకూ, వీరికి పెద్ద తేడా కనిపించదు.
వీరు కొన్ని మాయలూ, మంత్రాలు కూడా చేస్తారు. కాటి కాపర్లు అవడం వల్ల కొన్ని అతీంద్రియ శక్తులు కలిగి వుంటారనే నమ్మకం కూడావుండి. ఈనాడు కాటికాపరితనం ఎక్కడా లేదు. ఒక నాటు సత్య హరిశ్చంద్రుడు కాటి కాపరితనం చేయడం అందరికీ తెలిసిందే. వీరు ఇంటింటికి తిరుగుతారు. ఎవరికీ ఈ అపాయాన్ని కలిగించరు. వ్యాచిస్తూ పొట్ట పోసుకుంటారు. అయితే వీరు ప్రేక్షకులను సమీకరించటానికి ఇంద్రజాల విద్యల్ని ప్రదర్శిస్తారు. మూజిక్ చేసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యచికితుల్ని చేస్తారు. వీ భుజానికీ ఒక జోలె వుంటుంది. అందులో నుంచి గవ్వలతో పసుపు కుంకాలతో అలంకరించిన ఒక బొమ్మను అమ్మవారి బొమ్మంటూ తీసి అందరి ఎదుటపెడతారు. చేతిలో ఒక ఎముక వుంటుంది. ఆ ఎముకతో ఆ బొమ్మను తాకిస్తూ, ఓం మహంకాళీ శాంభవీ అంటూ క్షణంలో మండ్ర గబ్బల్నీ, తేళ్ళనీ, ఎలుకల్నీ పుట్టిస్తాడు. ఆ పుట్టిన ఎలుక చేత కీచు కీసు మనిపిస్తాడు. నోటిలో నుంచి ఇనుప గోలీల్నీ, మేకుల్నీ తీస్తాడు. అలా వ్వాచిస్తూ పొట్ట పోసుకుంటూ వ్వాచకులై, దేశ దిమ్మరులై తిరుగుతూ వుంటారు
మాతంగులు
మార్చు- అరుంధతీదేవి మాతంగ కన్య అయినట్లే, కాటికాపరి అయిన పరమేశ్వరుడు కూడా మాతంగుడే. మతంగ మహర్షి సంతానం మాల మాదిగలు. అరుంధతీ దేవి అక్క చెల్లెండ్రు అనసూయ మొదలైన వాళ్ళంతా మతంగ వంశీయులే. అరుంధతీదేవి తమ్ముడు కపిలమహర్షి కూడా మతంగుడే. అరుంధతీదేవి, వసిష్ఠులకు పుట్టినవాడు శక్తి మహర్షి. శక్తిమహర్షికీ మాతంగ కన్యకు పుట్టినవాడు పరాశరుడు. పరాశరుడికీ, సత్యవతికి పుట్టినవాడు వ్యాసుడు. బ్రాహ్మణ స్త్రీకి - శూద్ర పురుషునికి పుట్టినవాడు ‘చండాలుడు’ అని మనుస్మృతి చెప్తుంది. శూద్రుని వలన వైశ్య స్త్రీకి పుట్టిన వాడు అయోగుడు. క్షత్రియ స్త్రీకి పుట్టినవాడు క్షత. వీరంతా వర్ణసంకరులు. వీరే అవర్ణులు. అంటే, ఏ వర్ణానికీ చెందనివారు. వారే ‘పంచమ వర్ణం’ వాళ్ళు!--బోయి భీమన్న, దార్ల వెంకటేశ్వరరావు
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చు- అర్కీవ్.ఆర్గ్ లో తెలుగువారి జానపద కళారూపాలు పుస్తకపు మూలప్రతి
- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు