90ఎంఎల్ (సినిమా)
90ఎంఎల్, 2019 డిసెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. కార్తికేయ క్రియేటీవ్ వర్క్స్ బ్యానరులో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాకు శేఖర్‌రెడ్డి యెర్ర దర్శకత్వం వహించాడు. ఇందులో కార్తికేయ గుమ్మకొండ, నేహా సోలంకి ప్రధాన పాత్రల్లో నటించగా,[1] అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు. అశోక్ రెడ్డి 2018లో ఆర్‌ఎక్స్ 100 అనే సినిమాను నిర్మించాడు.[2][3]
90ఎంఎల్ | |
---|---|
దర్శకత్వం | శేఖర్‌రెడ్డి యెర్ర |
రచన | శేఖర్‌రెడ్డి యెర్ర |
నిర్మాత | అశోక్ రెడ్డి గుమ్మకొండ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | జె. యువరాజు |
కూర్పు | ఎస్.ఆర్. శేఖర్ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | కార్తికేయ క్రియేటీవ్ వర్క్స్ |
విడుదల తేదీs | 6 డిసెంబరు, 2019 |
సినిమా నిడివి | 159 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 8.3 కోట్లు |
బాక్సాఫీసు | 18 కోట్లు |
నటవర్గం
మార్చు- కార్తికేయ గుమ్మకొండ (దేవదాస్)
- నేహా సోలంకి (సువాసన)
- రవికిషన్ (జయరాం)
- అజయ్ (శేషు)
- రావు రమేష్ (క్షునాకర్ రావు, సువాసన తండ్రి)
- ప్రగతి (దేవదాస్ తల్లి)
- సత్య ప్రకాష్ (రామ్ దాస్, దేవదాస్ తండ్రి)
- రోల్ రైడా (కిషోర్)
- రఘు కారుమంచి (జయరాం సహచరుడు)
- ప్రభాకర్ గౌడ్ (రాజా)
- పోసాని కృష్ణ మురళి (మురళి)
- ఆలీ (డా. నాదిరిదిన్న, పునరావాస కేంద్రం)
- గుండు సుదర్శన్ (డాక్టరు)
- ప్రవీణ్ (విగ్నేష్)
- తాగుబోతు రమేష్ (రమేష్)
- దువ్వాసి మోహన్
- కళ్యాణి
- సి. వి. ఎల్. నరసింహా రావు
- బేబి నిధిరెడ్డి
- నెల్లూరు సుదర్శన్
నిర్మాణం
మార్చుఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి, కార్తికేయను కలవడానికి శేఖర్ రెడ్డికి సహాయం చేశాడు.[4] టెలివిజన్ నటి నేహా సోలంకి హీరోయిన్ గా, రవి కిషన్, సత్య ప్రకాష్, రాపర్ రోల్ రైడా ఇతర పాత్రల్లో నటించడానికి అంగీకరించారు.[5][6] అజర్‌బైజాన్లో మూడు పాటలు చిత్రీకరించారు. 2019 సెప్టెంబరులో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయింది.[7] ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కారణంగా మీడియా కవరేజీ వచ్చింది.[8][9] అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. రోజూ తాగవలసిన వ్యాధి ఉన్న తాగుబోతు పాత్రలో కార్తికేయ నటించాడు.[10] సెప్టెంబరు 21న టీజర్ విడుదలయింది.[11] అక్టోబరు 20న ట్రైలర్ విడుదలయింది.[12] ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకావాల్సి ఉంది, అయితే కొన్ని దృశ్యాలను తొలగించమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, నిర్మాతలను కోరడంతో సినిమా డిసెంబరు 6న విడుదలయింది.[13][14]
పాటలు
మార్చుఅనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు.[15]
- "సింగిలు సింగిలు" - రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం మనసి[16]
- "యినిపించుకోరు" - రాహుల్ సిప్లిగుంజ్[17]
- "నాతో నువ్వుంటే చాలు" - అద్నాన్ సామి[18]
- "వెళ్ళిపోతుందే" - అనూప్ రూబెన్స్[19]
- "90ఎంఎల్ టైటిల్ సాంగ్" - అనురాగ్ కులకర్ణి
- "అనుకోలేదే అనుకోలేదే" - రమ్య బెహరా
- "వందేళ్ళ లైఫ్ లోనా" - సాయిశరన్, సాహితి
స్పందన
మార్చుదక్కన్ క్రానికల్ పత్రిక ఈ సినిమాకి 1.5/5 రేటింగ్ ఇచ్చింది. "90ఎంఎల్ చెడ్డ పానీయం లాంటిది" అని రాసింది.[20] టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది. "సన్నివేశాలు ఏవీ ఒకదానితో ఒకటి మిళితం కాలేదు, ఈ సినిమా యాదృచ్ఛిక సన్నివేశాల కలయికలాగా అనిపిస్తోంది" అని రాసింది. "కార్తికేయ ప్రధాన పాత్రలో నటించడం కొంత ప్రశంసనీయం అయితే, మొత్తంగా ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు" అని తెలంగాణ టుడే పత్రిక రాసింది.[21]
మూలాలు
మార్చు- ↑ Krishna, Murali (28 November 2019). "The ladies man". The New Indian Express. Retrieved 26 January 2021.
- ↑ "Karthikeya's 90 ML Movie Review & Rating". www.thehansindia.com. 6 December 2019.
- ↑ TV9 Telugu, TV9 (6 December 2019). "Karthikeya Latest movie review: Karthikeys's 90 ML movie review- 90ఎంఎల్ రివ్యూ.. కిక్ ఏ మేరకు ఎక్కిందంటే..!". TV9 Telugu. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chowdhary, Y. Sunita (19 November 2019). "Telugu film '90 ML' has no connection to Oviya's Tamil film, says Shekar Reddy". The Hindu.
- ↑ "Kartikeya's 90ML TRAILER: Struggles of an Authorized Drinker to win his love - Times of India". The Times of India.
- ↑ "Kartikeya and Neha Solanki's '90 ML' has a release date! - Times of India". The Times of India.
- ↑ "Kartikeya's next is the 'authorised drinker' in '90ML' - Times of India". The Times of India.
- ↑ "90ml flows into Azerbaijan". Deccan Chronicle. 19 October 2019.
- ↑ "Concept poster of actor Kartikeya's next with the makers of RX 100 is intriguing - Times of India". The Times of India.
- ↑ Adivi, Sashidhar (1 December 2019). "90 ML does not preach about alcohol: Kartikeya Gummakonda". Deccan Chronicle.
- ↑ "Kartikeya's 90ML teaser to be released soon - Times of India". The Times of India.
- ↑ "90ML Teaser: Katikeya's character seems to be a high-functioning alcoholic - Times of India". The Times of India.
- ↑ "Kartikeya Gummakonda's 90ML release postponed to December 6 - Times of India". The Times of India.
- ↑ "Censor troubles for 90ML? - Times of India". The Times of India.
- ↑ "90ML Movie Review {2/5}: Kartikeya deserved better!". The Times of India.
- ↑ "Watch: Telugu Song Video 'Singilu Singilu' from '90ML' Ft. Kartikeya and Neha Solanki | Telugu Video Songs - Times of India". timesofindia.indiatimes.com.
- ↑ "'Yinipinchukoru' song promo from '90 ML' released - Times of India". The Times of India.
- ↑ "Natho Nuvvunte Chalu from 90ML - Times of India". The Times of India.
- ↑ "'వెళ్లిపోతుందే..' ఎమోషనల్ సాంగ్." Samayam Telugu.
- ↑ Kavirayani, Suresh (December 8, 2019). "90ML movie review: 90ML is a bad drink, after all". Deccan Chronicle.
- ↑ Kumar, P Nagendra. "90 ML, fails to give a high!". Telangana Today.