చావు కబురు చల్లగా
చావు కబురు చల్లగా, 2021 మార్చి 19న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.[1][2] జిఏ2 పిక్చర్స్ బ్యానరులో బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మించిన[3] పెగ్గలపాటి కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఇందులో కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, అమని, రజిత తదితరులు నటించారు.[4] చావు కబురు చల్లగా ‘ఆహా’లో ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యింది.
చావు కబురు చల్లగా | |
---|---|
దర్శకత్వం | పెగ్గలపాటి కౌశిక్ |
రచన | పెగ్గలపాటి కౌశిక్ |
నిర్మాత | బన్నీ వాసు అల్లు అరవింద్(సమర్పణ) |
తారాగణం | కార్తికేయ గుమ్మకొండ లావణ్య త్రిపాఠి మురళీ శర్మ ఆమని |
ఛాయాగ్రహణం | సునీల్ రెడ్డి, కర్మ్ చావ్లా |
కూర్పు | జి. సత్య |
సంగీతం | జేక్స్ బెజోయ్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీs | 19 మార్చి, 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- కార్తికేయ గుమ్మకొండ (బస్తీ బాలరాజు)[5]
- లావణ్య త్రిపాఠి (మల్లిక)[6]
- ఆమని (గంగమ్మ)
- మురళీ శర్మ
- శ్రీకాంత్ అయ్యంగార్
- రజిత
- అచంట మహేష్
- భద్రమ్
- ప్రభు
నిర్మాణం
మార్చుఈ సినిమా 2019 డిసెంబరులో ప్రకటించబడింది.[7] 2019 చివర్లో షూటింగ్ ప్రారంభించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిపివేయబడింది. 2020, అక్టోబరులో షూటింగ్ ప్రారంభించబడింది.[8]
పాటలు
మార్చుUntitled | |
---|---|
టాక్సీవాలా (2018) కోసం కంపోజ్ చేసిన జేక్స్ బెజోయ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. 2021, ఫిబ్రవరి 6న మొదటి సింగిల్ "మై నేమ్ ఈజ్ రాజు" ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "మై నేజ్ ఈజ్ రాజు" | కరుణాకర్ అడిగర్ల | ఎల్.వి. రేవంత్ | 4:39 |
2. | "ఫిక్స్ అయిపో" | కౌశిక్ పెగల్లపాటి, సనారే | రాహుల్ సిప్లిగంజ్, ఆదిత్యా తాడేపల్లి | 4:12 |
స్పందన
మార్చు'కథాంశం ఉన్నప్పటికీ, ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది' అని ది హిందూ పత్రికకు చెందిన వై.సునీతా చౌదరి రాసింది.[9] 'దర్శకుడు తీసుకున్న సవాలును సరిగా తీయడంలో విఫలమయ్యాడు' అని ది హన్స్ ఇండియా పత్రికకు చెందిన ఒక సమీక్షకుడు రాశాడు. కార్తికేయ నటనను మెచ్చుకోవడంతోపాటు త్రిపాఠికి మంచి పాత్ర లభించిందని అభిప్రాయపడ్డాడు.[10] న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు చెందిన విమర్శకుడు గబ్బేతా రంజిత్ కుమార్ ఈ సినిమాకు సానుకూల సమీక్షను ఇచ్చాడు. కథాంశం, నటనను ప్రశంసించాడు.[11]
గొప్ప ఆలోచనతో కూడిన కథాశంను నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు' అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు చెందిన జర్నలిస్ట్ నీస్తి న్యాపతి రాశాడు.
మూలాలు
మార్చు
- ↑ "Kartikeya Gummakonda and Lavanta Tripathi starrer Chaavu Kaburu Challaga to hit screens on March 19 - Times of India". The Times of India. Retrieved 2021-03-19.
- ↑ "'చావు కబురు చల్లగా' రిలీజ్ డేట్ ఫిక్స్". Thetelugufilmnagar. 2021-02-01. Retrieved 2021-03-19.
- ↑ "The upcoming Telugu film". News Trackglish. 2020-09-18. Retrieved 2021-03-19.
- ↑ "Telugu actor Kartikeya to play hero in two upcoming films". The News Minute. 2020-09-22. Retrieved 2021-03-19.
- ↑ "Kartikeya Gummakonda Birthday: A Look at the actor's upcoming films". The Times of India. 2020-09-21. Retrieved 2021-03-19.
- ↑ "Lavanya Tripathi rejoins shooting of Chaavu Kaburu Challaga after wrapping up A1 Express - Times of India". The Times of India. Retrieved 2021-03-19.
- ↑ "Kartikeya's next 'Chaavu Kaburu Challaga' announced! - Times of India". The Times of India. Retrieved 2021-03-19.
- ↑ "Kartikeya Gummakonda and Lavanya Tripathi resume shooting for Chaavu Kaburu Challaga in the new normal - Times of India ►". The Times of India. Retrieved 2021-03-19.
- ↑ Chowdhary, Y. Sunita (2021-03-19). "'Chaavu Kaburu Challaga' movie review: A diluted plot spoils the party". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-03-19.
- ↑ "Chaavu Kaburu Challaga Movie Review & Rating". The Hans India.
- ↑ "Chaavu Kaburu Challaga review: Kartikeya Gummakonda's film makes for an engaging watch". The Indian Express. 2021-03-19. Retrieved 2021-03-19.