కాళిచరణ్ (2013 సినిమా)
కాళిచరణ్ 2013, నవంబరు 8న విడుదలైన రాజకీయ నేపథ్య తెలుగు చలనచిత్రం. శ్రీ కరుణాలయం పతాకంలో శ్రీ ప్రవీణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చైతన్య కృష్ణ, చాందిని తమిలరసన్, నాగినీడు, రావు రమేష్, పంకజ్ కేసరి ప్రధాన పాత్రల్లో నటించగా, నందన్ రాజ్ సంగీతం అందించాడు.[1] చాందిని తమిళరసన్, పంకజ్ కేసరిలకు ఇది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రాన్ని పోర్ కుతిరై పేరుతో తమిళంలోకి అనువాదం చేశారు. దానికోసం కొన్ని సన్నివేశాలను అక్కడి స్థానిక నటులతో రీషూట్ చేశారు.[2][3][4][5]
కాళిచరణ్ | |
---|---|
దర్శకత్వం | శ్రీ ప్రవీణ్ |
రచన | మాటలు: ఖాజా పాషా శివ శ్రీ ప్రవీణ్ |
నిర్మాత | శ్రీ ప్రవీణ్ |
తారాగణం | చైతన్య కృష్ణ చాందిని తమిలరసన్ పంకజ్ కేసరి |
ఛాయాగ్రహణం | విశ్వ దేవబత్తుల సతీష్ ముత్యాల |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | నందన్ రాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ కరుణాలయం |
పంపిణీదార్లు | బేబి మనస్విని |
విడుదల తేదీ | 8 నవంబరు 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- చైతన్య కృష్ణ (కాళిచరణ్)[6]
- చాందిని తమిలరసన్ (తీర్థ)
- పంకజ్ కేసరి (పశుపతి)[7]
- కవిత శ్రీనివాసన్
- నాగినీడు (కాళిచరణ్ తండ్రి)
- రావు రమేశ్
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాణం, దర్శకత్వం: శ్రీ ప్రవీణ్
- మాటలు: ఖాజా పాషా, శివ, శ్రీ ప్రవీణ్
- సంగీతం: నందన్ రాజ్
- సినిమాటోగ్రఫీ: విశ్వ దేవబత్తుల, సతీష్ ముత్తుయల
- కూర్పు: ప్రవీణ్ పూడి
- నిర్మాణ సంస్థ: శ్రీ కరుణాలయం
- పంపిణీదారు: బేబీ మనస్విని
నిర్మాణం
మార్చురామ్ గోపాల్ వర్మ శిష్యుడు శ్రీ ప్రవీణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రవీణ్ ఇంతకుముందు 2010లో గాయం 2 సినిమా తీశాడు.[8] ఈ చిత్రంలో చైతన్య కృష్ణ, తమిళ నటి చాందిని తమిలరసన్ ముఖ్య పాత్రల్లో నటించగా, భోజ్‌పురి నటుడు పంకజ్ కేసరి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.[2] 1980లలో జరిగిన సంఘటనలు, ఎమ్మెల్యే ఎర్రా సత్యం జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. [9] హైదరాబాదులో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంచు లక్ష్మి, అల్లు అరవింద్, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ కిషన్ తదితరులు హాజరయ్యారు.[10]
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలను నందన్ రాజ్ స్వరపరిచాడు.[8] పాటలను వనమాలి, సదా చంద్ర రాశారు.
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "కురిసికురిసి" | నందన్ రాజ్, శ్రీ కృష్ణ, అపర్ణ | 3:49 |
2. | "మెల్లా మెల్లగా" | నందన్ రాజ్, వినయ్ | 4:19 |
3. | "దేవుడన్నా పేరు" | నందన్ రాజ్, సురేష్ బాబు | 2:35 |
4. | "పలికే ఆ గువ్వా" | నందన్ రాజ్, శ్రీ కృష్ణ | 4:08 |
5. | "నాకల్లు చూడు" | నందన్ రాజ్, గీతా మాధురి | 4:22 |
6. | "ఓ నింగే తులి హోలీ" | నందన్ రాజ్, రాంకీ, సాహితి | 4:13 |
7. | "నా నిన్ను" | నందన్ రాజ్, అంజనా సౌమ్య | 4:07 |
మొత్తం నిడివి: | 27:33 |
స్పందన
మార్చుటైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ చిత్రంలో కొన్నిచోట్ల ఉత్కంఠ కలిగించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం వృధా అయింది" అని పేర్కొంది.[6] "కథలో కొత్తదనం ఉన్నాకాని కథనం నిరుత్సాహపరిచింది" అని ది హిందూ పత్రిక రాసింది. [7]
పురస్కారాలు
మార్చు- నంది పురస్కారం: 2013 నంది పురస్కారాలులో: ఉత్తమ ఎడిటర్ (ప్రవీణ్ పూడి), ఉత్తమ ఫైట్ మాస్టర్ (వెంకట్ నాగ్), ప్రత్యేక బహుమతి (చైతన్య కృష్ణ) విభాగాల్లో అవార్డులు వచ్చాయి.[11][12][13][14]
మూలాలు
మార్చు- ↑ "Chandini gets a makeover - Times of India". The Times of India. Retrieved 2020-10-15.
- ↑ 2.0 2.1 Chowdhary, Y. Sunita (October 21, 2014). "Banking on nativity". The Hindu. Retrieved 2020-10-15.
- ↑ "Chaitanya Krishna hopes 'Porkuthirai' finds him more work in Tamil films". October 20, 2014. Retrieved 2020-10-15.
- ↑ "Chandini is back with Por Kuthirai - Times of India". The Times of India. Retrieved 2020-10-15.
- ↑ "Tamil version of Kaalicharan gears up for release". Hindustan Times. August 21, 2014. Retrieved 2020-10-15.
- ↑ 6.0 6.1 "Kaalicharan Movie Review {2/5}: Critic Review of Kaalicharan by Times of India". timesofindia.indiatimes.com. Retrieved 2020-10-15.
- ↑ 7.0 7.1 Dundoo, Sangeetha Devi (November 10, 2013). "Kaalicharan: A throwback to the 80s". www.thehindu.com. Retrieved 2020-10-15.
- ↑ 8.0 8.1 "Praveen Sri's new movie is Kaalicharan - Times of India". The Times of India. Retrieved 2020-10-15.
- ↑ "Proud to be part of 'Kalicharan': Chandini". The New Indian Express. Retrieved 2020-10-15.
- ↑ "Tollywood celebs at the muhurat of 'Kaalicharan' in Hyderabad - Times of India". The Times of India. Retrieved 2020-10-15.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 26 October 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 October 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 October 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 October 2020.