అంజనా సౌమ్య
'అంజనా సౌమ్య' ఒక జానపద, సినీ గాయని. విజయవంతమైన పలు చిత్రాలలో మధురమైన పాటలు పాడింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్‌లో రన్నర్ గా నిలిచింది. సూపర్ సింగర్ 4లో విజేతగా, సూపర్ సింగర్ 7లో విజేతగా నిలిచింది. సదార్చన, సాయి సౌమ్యలహరి1,2, అన్నమయ్య సంకీర్తనామృతం, టీ సీరిస్‌లో భక్తితో అంజన సౌమ్య వంటి ఆల్బమ్స్ చేసింది.సుమారు 60 సినిమాల్లో పాటలు పాడింది. మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.
Anjana sowmya | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | అంజనా సౌమ్య |
జననం | [1] కాకినాడ | 1985 సెప్టెంబరు 29
మూలం | ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
వృత్తి | గాయని |
క్రియాశీల కాలం | 2006-ఇప్పటివరకు |
నేపధ్యము
మార్చునాన్న గోపాలకృష్ణ, అమ్మ విద్యల సుమతి. ఈమెకు చిన్నప్పటినుంచే పాడాలని ఉన్న కోరిక సంగీతం వైపు నడిపించింది. కాకినాడలో ఇంజనీరింగ్, విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసింది. కాకినాడలోని సంగీతోపాధ్యాయులు కాకరపర్తి వీరభద్రరావు, పెద్దాడ సూర్యకుమారి వద్ద సంగీతం నేర్చుకున్నది. సంగీతంలో డిప్లొమో చేసి ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించింది.
వివాహము
మార్చు2011 లో అమెరికా కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రావులపాలెం గ్రామానికి చెందిన రవితేజను పెళ్ళి చేసుకుంది.
సినిమా రంగం
మార్చుఈమె క్లాస్‌మేట్స్, సరదాగా కాసేపు, క్షేత్రం, తిమ్మరాజు, ప్రేమ కావాలి, దేవరాయ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భీమవరం బుల్లోడు, ముకుంద, అ ఆ, బ్రహ్మోత్సవం, అరవింద సమేత వీర రాఘవ వంటి అనేక సినిమాలలో పాటలు పాడింది. సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, వనమాలి, భాస్కరభట్ల రవికుమార్, చంద్రబోస్, అనంత శ్రీరామ్, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర మొదలైన సినీ గేయకవుల రచనలను కోటి, చక్రి, మణిశర్మ, అనూప్ రూబెన్స్, ఎస్. ఎ. రాజ్‌కుమార్ ఎస్.ఎస్. తమన్,మిక్కీ జె. మేయర్ హరిహరన్, రఘు కుంచే, రమణ గోగుల వంటి సంగీత దర్శకుల నేతృత్వంలో మల్లికార్జున్, శ్రీకృష్ణ, కార్తీక్, మాళవిక, టిప్పు, ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్, అనుదీప్ దేవ్, కె.ఎస్.చిత్ర, రమ్య బెహరా, దలేర్ మెహంది మొదలైన గాయనీ గాయకులతో కలిసి ఆలపించింది.