కాళోజీ రామేశ్వరరావు
కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ కవి, ప్రజా సేవకుడు.
కాళోజీ రామేశ్వరరావు | |
---|---|
![]() | |
జననం | |
మరణం | 11 నవంబరు 1996 | (వయస్సు 88)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | క్రిమినల్ లాయర్ |
సురరిచితుడు | ఉర్దూ కవిత్వం |
Notable work | కలామే షాద్, కాయానా తేషాద్ (అవ్వల్ దువ్వల్) |
బంధువులు | కాళోజీ నారాయణరావు (తమ్ముడు) |
జీవిత విశేషాలుసవరించు
ఇతడు పాలమూరు జిల్లా (నేటి వనపర్తి జిల్లా) అల్వాల్ గ్రామంలో 1908, జూన్ 22న రమాబాయమ్మ, కాళోజీ రంగారావు దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం మడికొండ, హనుమకొండ, వరంగల్ తదితర ప్రాంతాలలో జరిగింది. ఇతడు వకాలత్ పట్టా పుచ్చుకుని వరంగల్ పట్టణంలో ప్రాక్టీసు చేసి గొప్ప క్రిమినల్ లాయర్‌గా పేరు గడించాడు. ఇతడికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో గొప్ప పండితుడు. ఈ భాషలే కాక ఇతడికి పార్సీ, అరబ్బీ భాషలలో కూడా ప్రవేశం ఉంది. ఇతడు స్వాతంత్రోద్యమ పోరాటంలో కవిగా, న్యాయవాదిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వరించాడు. బందగీకి, ఇస్నూరు దొరకు మధ్య నడిచిన కేసులో బందగి పక్షాన వాదించి గెలిపించాడు. ఇతడు రాజకీయంగా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అభిమాని. బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పి.వి.నరసింహారావు వంటి వారు ఇతడంటే ఎంతో అభిమానం చూపేవారు[1].
ఉర్దూ కవిత్వంసవరించు
ఇతడు షాద్ పేరుతో అద్భుతమైన ఉర్దూ కవిత్వాన్ని వ్రాశాడు. ఇతడు వ్రాసిన గజళ్ళు ఢిల్లీ, కాశ్మీర్ వంటి ప్రాంతాలలో అక్కడి రేడియోలు ప్రసారం చేశాయి. ఇతని ఆధ్వర్యంలో అనేక ముషాయిరాలు జరిగాయి. ఇతడు ఉర్దూలో వందలాది గజళ్ళు, కవితలు వ్రాశాడు. ఇతని కవితలు కొన్ని తెలుగులోనికి దేవులపల్లి సుదర్శనరావు చేత అనువదించబడ్డాయి. ఇతని కవితలు సియాసత్ వంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇతడు రాసిన కొన్ని ఉర్దూ కవితలు కలామే షాద్, కాయానా తేషాద్ (అవ్వల్ దువ్వల్) పేరుతో పుస్తకంగా వెలువడ్డాయి. ఇతడి హిందీ కవితలు గుణ్‌గాన్ పేరుతో అచ్చయ్యాయి.
పురస్కారాలుసవరించు
ఇతని సహస్ర చంద్రోదయ ఉత్సవం పేర్వారం జగన్నాథం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రామేశ్వరరావు సాహిత్యాన్ని మెచ్చుకుని అప్పటి ఉపరాష్ట్రపతి హిదయతుల్లా గారి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకున్నాడు. వి.ఆర్.విద్యార్థి వ్రాసిన పలవరింత అనే కవితా సంపుటి ఈయనకు అంకితం చేశాడు.
మరణంసవరించు
ఇతడు హన్మకొండలోని తన స్వగృహంలో 1996, నవంబరు 11న కన్నుమూశాడు.
మూలాలుసవరించు
- ↑ నియోగి (1 September 2019). అక్షర నక్షత్రాలు (1 ed.). విజయనగరం: భారతీతీర్ధ ప్రచురణ. pp. 61–63.