కుంకుడు

(కుంకుడు కాయ నుండి దారిమార్పు చెందింది)

కుంకుడు (Sapindus) ఒక రకమైన వృక్షం. ఇది సపిండేసి కుటుంబానికి చెందిన చెట్టు.[1][2][3] దీని నుండి లభించే కుంకుడు కాయల కోసం పెంచుతారు. సపిండస్ ప్రజాతిలోని 13 జాతులలో దక్షిణ భారతదేశంలో సా.లారిఫోలియస్, సా.ఎమర్జినేటస్ లను మనం ఉపయోగిస్తున్నాము.ఇవి చలికాలంలో కాస్తాయి

కుంకుడు
సపిండస్ మార్జినేటస్
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
సపిండస్

కుంకుడు చెట్టు

లక్షణాలు

మార్చు
  • మధ్యరకంగా పెరిగే వృక్షం.
  • ఉపాంతరహిత అగ్రంతో దీర్ఘవృత్తాకార పరకాలున్న సమపిచ్ఛక సంయుక్త పత్రాలు.
  • అగ్రస్థ శాఖయుత అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న గోధుమరంగుతో ఉన్న పసుపురంగు పుష్పాలు.
  • మూడు నొక్కులు గల టెంకగల ఫలం.

ఉపయోగాలు

మార్చు
  • కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం సబ్బు క్రింద ఉపయోగిస్తారు. వీటిలోని సెపోనిన్ వలన నురుగ తయారై తలపైనున్న మలినాలు తొలగిపోయి వెండ్రుకలు శుభ్రపడతాయి. ఈ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దీనిని వాడడం ఇంకా మంచిది.
  • కుంకుడుకాయ రసం నాచురల్ షాంపూగా పనిచేస్తుంది. దాంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా, నల్లగా మెరుస్తూ ఉంటుంది. కుంకుడుకాయలో ఉండే విటమిన్స్ వల్ల జుట్టు సిల్కీ ఇంకా స్మూత్ గా తయారవుతుంది.
  • కుంకుడు గింజల నుండి లభించే నూనె కీటక సంహారిణిగా పనిచేస్తుంది.
  • కుంకుడు కర్ర పసుపు రంగులో చేవకలిగి కలపగా ఉపయోగపడుతుంది.
  • పట్టు, సిల్క్ చీరలను శుభ్రపరచటానికి కుంకుడు రసం ఎంతో మేలైనది.
  • తలనొప్పికి కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టీ క్రింద వేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

తల స్నానానికి

మార్చు

కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి, వాటిలో గింజలను తీసెయ్యాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి... ఆ రసంతో తలరుద్దుకునేవారు. ఆ తర్వాత శీకాకాయపొడి మార్కెట్లో లభించడం ఆరంభమయింది. ఆ పొడిని నీటిలో తడిపి, ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే, ఈ రోజుల్లో శీకాకాయపొడి కాకుండా కుంకుడుపొడి కూడా లభిస్తోంది. చాలామంది, కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెండ్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు. వేసవిలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతీసారీ కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానంచేస్తే వెండ్రుకలు నల్లగా ఉంటాయి. త్వరగా నెరవవు. జుట్టు ఊడదు. బిరుసెక్కకుండా మెత్తగా ఉంటుంది. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డులేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలువవు. కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుళ్ళు తలస్నానానికి కాక, చర్మ సౌందర్యానికీ, మృదుత్వానికీ, చర్మ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను ఎలర్జీలను పోగొడ్తాయి. కుంకుడు రసంలో ఖరీదయిన పట్టుచీరలను నానపెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడురసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి, మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దితే... అవి శుభ్రపడి ధగదగా మెరుస్తుంటాయి. బాణాలి, పెనం వంటి జిడ్డు పాత్రలను కుంకుడు పిప్పితో శుభ్రపరచవచ్చు. కుంకుడు కాయలే శ్రేష్ఠమని తెలుసుకోవాలి. మన సాంప్రదాయపు అలవాట్లలో కూడా కుంకుడు కాయలను వాడతారు. ప్రసవమయిన బాలింతరాలికి పదకొండో రోజు పురిటి స్నానం చేయించబోయేముందురోజు ఇరుగుపొరుగు వారికి కుంకుడుకాయలు, నూనె, సున్నిపిండి పసుపు, కుంకుమతో పాటు మిఠాయిని పంచుతారు. పూర్వపు రోజులలో పెళ్ళికి వచ్చిన వియ్యాలవారి విడిదిలో కుంకుడుకాయలు, కొబ్బరి నూనె, పౌడరు, అద్దం ఉంచడం సాంప్రదాయం. అందువల్ల, కుంకుడు కాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

జాతులు

మార్చు
 
భారతదేశంలోని హైదరాబాద్‌లో ''సపిండస్ ఎమార్జినేటస్'' డ్రూప్స్

జాతుల సంఖ్య వేర్వేరు రచయితల మధ్య వివాదాస్పదమైంది, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఒకటి, మూడు జాతుల మధ్య ఆమోదించబడింది.

  • సపిండస్ డెలవాయి (చైనా, ఇండియా)
  • సపిండస్ డిటర్జెన్స్ (సిన్. వర్. సోప్‌నట్, రీతా)
  • సపిండస్ ఎమార్జినాటస్ వాహ్ల్ (దక్షిణ ఆసియా)
  • సపిండస్ లారిఫోలియస్ వాహ్ల్– కుంకుడు
  • సపిండస్ మార్జినేటస్ విల్డ్. – ఫ్లోరిడా సోప్‌బెర్రీ (ఫ్లోరిడా నుండి సౌత్ కరోలినా వరకు) ; కొంతమంది రచయితలచే S. సపోనారియాలో చేర్చబడింది.
  • సపిండస్ ఓహుయెన్సిస్ హిల్లెబ్ర్. మాజీ రాడ్క్. - లోనోమియా (కౌయి, ఓహు, హవాయి)
  • సపిండస్ రారాక్ DC. (ఆగ్నేయ ఆసియా)
  • సపిండస్ సపోనారియా ఎల్.
  • ఎస్. ఎస్. var సపోనారియా - వింగ్లీఫ్ సోప్‌బెర్రీ (ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్, కరేబియన్, హవాయి ద్వీపం, మధ్య దక్షిణ అమెరికా)
  • సపిండస్ టొమెంటోసస్ (చైనా)

మూలాలు

మార్చు
  1. "Taxon: Sapindus vitiensis A. Gray". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-04-30. Archived from the original on 2009-06-25. Retrieved 2009-03-23.
  2. "GRIN Species Records of Sapindus". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-04-30. Archived from the original on 2015-09-24. Retrieved 2010-11-01.
  3. "Sapindus". Integrated Taxonomic Information System. Retrieved 2010-11-01.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కుంకుడు&oldid=4076388" నుండి వెలికితీశారు