కూనపులి అనేది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని వెనుకబడిన కులాల జాబితాకు చెందిన "ఏ" గ్రూపులోని 40వ కులం. వీరు పద్మశాలీలను ఆశ్రయించి వారి వృత్తి పురాణాన్ని చెప్పేవారు.[1]

విశేషాలు మార్చు

నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. నల్లగొండ జిల్లా హుజూర్‌ నగర్‌, కృష్ణా జిల్లాలో విజయవాడ, గుంటూరు జిల్లా మంగళగిరిలో కూడా వీరు చెప్పుకోదగినంతమంది ఉన్నారు. కూనపులి కులస్థులను పడిగరాజులు, సమ్యరాజులు అని కూడా పిలుస్తున్నారు. కులవృత్తి దెబ్బతిన్నందువల్ల ప్రస్తుతం వీరు టీ స్టాళ్లు, కిళ్లీ బంకుల వంటి వ్యాపారాలకే పరిమితమయ్యారు. వీరు సంచార కథకులు. కూనపులి కులస్థులు పూర్వం పద్మశాలి కులస్థులకు మాత్రమే వినోదాన్ని అందిస్తూ రాగయుక్తంగా కథలు చెప్పి మెప్పించి పారితోషికం తీసుకునేవారు. పద్మశాలీల కులగురువైన మార్కండేయ పురాణం ఎక్కువగా వినిపించేవారు. పద్మశాలి కులస్థుల మూల పురుషుడు భావనాఋషి కావటంతో ఆయన కథలు కూడా చెప్పేవారు. వీరు సంచార జీవులు కావటంతో ఊరూరా తిరగడానికి గుర్రాలను వినియోగించుకున్నారు. వీరు గ్రామానికి దూరంగా ఉండేవారు.[2]

కూనపులి కళారూపం మార్చు

కూనపులి వారు సమీప గ్రామాలకు వెళ్లి పద్మశాలి కులస్థుల ఇళ్లముందు వీరి దగ్గర ఉన్న పటం (గుడ్డతో తయారు చేసిన పెద్ద చార్టు) ను తగిలించి కథలు చెప్పేవారు. ఈ పటం మీటరు వెడల్పు, ముపై్ప మూరల పొడవుంటుంది. పేపర్‌ రోల్‌ మాదిరిగా చుట్టచుట్టి ఉన్న ఈ పటంలోని ఒక్కొక్క అంశాన్ని వివరించుకుంటూ రాగయుక్తంగా కథ చెప్పుకొచ్చేవారు. ప్రధాన కథకుడు కాళ్లకు గజ్జెకట్టి, చేతిలో చిడతలు పట్టి పటంలోని బొమ్మల సందర్భాలకు అనుగుణంగా కరుణ, „హాస్యం, శృంగారం, రౌద్రం, బీభత్సం వంటి నవరసాలను పండించేవారు. వీరి కుటుంబంలో మహిళలు వంతలు పాడేవారు.హరికథ, బురక్రథ మాదిరి వీరు రాత్రి సమయంలో కథలు చెప్పేవారు కాదు. పగలే కథలు చెప్పేవారు.వీరి దగ్గర ఉన్న పటంలోని చిత్రాలు ప్రేక్షకులకు కనిపించాలి కనుక పగటిపూటను ఎంచుకున్నారు. కనుకనే ఆ రోజుల్లో వీరి కథలు వినటానికి ఆడామగా అంతా ఉదయమే వచ్చి కూర్చునేవారు. వీరు అల్ప సంతోషులు. మూడు పూటలా భోజనానికి ఢోకా లేకుండా కాలం గడవటంతో మరో వృత్తి కాదుకదా, మరో వ్యాపకం కూడా ఎంచుకోలేదు. వీరు పద్మశాలి కులస్థుల దగ్గర కాకుండా మరొకరి దగ్గర ఈ విద్య ప్రదర్శించరు కనుక ఎన్ని గ్రామాలు తిరిగినా పారితోషికం కాదుకదా, భోజనం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. పద్మశాలి, కూనపులి కులస్థుల మధ్య పెనవేసుకున్న అనుబంధం ఇప్పటికీ చాలా గ్రామాలలో కొనసాగుతోందని చెప్పొచ్చు. కనుకనే కూనపులి కులస్థులు కులధ్రువీకరణ పత్రంకోసం వెళితే వీరికి అధికారులు పద్మశాలి కులం పేరుతో సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. గతంలో వీరికి కుల ధ్రువీకరణ పత్రాలు తహసిల్దారులు ఒకపట్టాన ఇచ్చేవారు కాదు. వీరూ పద్మశాలీలతో కలిసి ఉంటారు కనుక పద్మశాలి అని కుల సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. కాగా తమకంటూ ఒక కులం ఉన్నప్పటికీ మరో కులం పేరు చెప్పుకోవటమేమిటనే ఆత్మాభిమానంతో కొందరు తమ కులం వివరాలు ప్రభుత్వానికి తెలియజేసే ఉద్యమం నడిపారు. ఫలితంగా 1975లో వీరిని బిసీ-ఎ జాబితాలో చేర్చారు. తమది సంచార జీవనం కనుక ఎస్టీ జాబితాలో తమను చేర్చాలని కోరుతున్నారు.[2]

పురాణ గాథ మార్చు

 
మార్కండేయుడిని రక్షించడానికి యముని అంతమొందిస్తానంటున్న శివుడు

మార్కండేయుడు అల్పాయుష్షు గురించి తెలుసుకొని తపస్సు చేసి శివుని నుంచి చిరంజీవిగా వరం పొందుతాడు. అదే సమయంలో దేవతలు, మునీశ్వరులు వస్త్రాలు లేక తమ దీన స్థితిని విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. మార్కండేయుని సంతతియే వారి దీన స్థితిని తొలగిస్తారని విష్ణువు అభయమిచ్చి పంపుతాడు. దేవతల కోరిక మేర మార్కండేయుడు తన ఆయుష్షంత ఆయుష్షుకల్గిన దూమ్రావతిని పెళ్ళి చేసుకొని పుత్ర కామేష్టి యాగం చేయగా భావనా ఋషి, పంచమా ఋషి జన్మిస్తారు. వీరు పెరిగి పెద్దవారై ఏమి పనిచేయాలని తండ్రిని అడుగుతారు. శివుని ఆజ్ఞమేర విష్ణువు దగ్గరకు వెళ్లమని చెపుతాడు మార్కండేయుడు. అదే సమయంలో దేవతలు, మునీశ్వరులు వస్త్రాలు లేక తమ దీన స్థితిని విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. మార్కండేయుని సంతతియే వారి దీన స్థితిని తొలగిస్తారని విష్ణువు అభయమిచ్చి పంపుతాడు. దేవతల కోరిక మేర మార్కండేయుడు తన ఆయుష్షంత ఆయుష్షుకల్గిన దూమ్రావతిని పెళ్ళి చేసుకొని పుత్ర కామేష్టి యాగం చేయగా భావనా ఋషి, పంచమా ఋషి జన్మిస్తారు. వీరు పెరిగి పెద్దవారై ఏమి పనిచేయాలని తండ్రిని అడుగుతారు. శివుని ఆజ్ఞమేర విష్ణువు దగ్గరకు వెళ్లమని చెపుతాడు మార్కండేయుడు. ఇదంతా దైవకార్యమేనని తెలుసుకొని పులిచర్మం కోసం భావనాఋషి భద్రావతి దగ్గరకు వెళ్లి పులులను తెస్తుండగా, నారదుడు ప్రేరేపించగా కాలువాసురుడనే రాక్షసుడు ఎదురు వచ్చి భావనాఋషితో యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో భావనాఋషి అలిసిపోగా అతని చెమట నుంచి కూనపులి జన్మించి భావనాఋషికి యుద్ధంలో సహాయం చేస్తాడు. కాలువాసురున్ని యుద్ధంలో సంహరించి అతని దేహ భాగాలతో మగ్గం నిర్మించి వస్త్రం నిర్మిస్తాడు. ఆ తర్వాత దేవతల కోరిక మేరకు భావనాఋషి భద్రావతిని పెళ్ళి చేసుకొని నూట ఒక్క మంది సంతానానికి జన్మనిస్తాడు. వీరంతా పద్మశాలీలుగా పిలువబడుతూ నూటొక్క గోత్రాలుగా వర్ధిల్లుతున్నారు.[1]

అంతరిస్తున్న కళారూపం మార్చు

కూనపులివారు కేవలం పద్మశాలీలకు మాత్రమే చెప్పే మార్కండేయ పురాణానికి శిష్టసాహిత్యంలోని అష్టాదశ మహాపురాణాల్లోని మార్కండేయ . ఇది కేవలం మహాపురాణాల్లోని మార్కండేయున్ని పద్మశాలీకులానికి మూలపురుషున్ని చేసుకొని సమాంతరంగా సృష్టించుకున్న పురాణమనే చెప్పవచ్చు. అయితే కూనపులివారు కథాగానం చేసే మార్కండేయ పురాణానికి శిష్టసాహిత్యంలో సా.శ. 1511-1568 మధ్య కాలానికి చెందినట్లుగా భావిస్తున్న ఎల్లకర నృసింహ కవి రచించిన మార్కండేయ పురాణానికి భేదసాదృశ్యాలు ఉన్నాయి. ఆశ్రిత కులాల ప్రస్తావన 12వ శతాబ్దం నుంచి కనిపించినట్లు పాల్కురికి సోమనాధుని రచన వల్ల తెలుస్తున్నది. అట్లాగే కూనపులివారు కథాగానం చేసే మార్కండేయ పురాణం ఎల్లకర నృసింహ కవి పురాణం కాలాన్ని బట్టి చూస్తే అప్పటికే మౌఖికంగా ప్రచారంలో ఉందని చెప్పటానికి అవకాశం ఉంది. అంతటి ప్రాచీనత కల్గిన మౌఖికసాహిత్య సంపద నేడు కనుమరుగయ్యే స్థితిలో ఉంది.

ఇతర వివరాలు మార్చు

తెలుగు విశ్వవిద్యాలయం నుండి 2014లో ఏలె లక్ష్మణ్ కూనపులి పటం కథపై చేసిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌ తీశాడు. ఇందులో కథను పురాణం రమేష్ చెప్పాడు.[3]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 నవతెలంగాణ, జాతర-స్టోరి (21 April 2015). "కూనపులి అంతరించాల్సిందేనా?". NavaTelangana. డా. బసాని సురేష్‌. Archived from the original on 6 సెప్టెంబరు 2019. Retrieved 6 September 2019.
  2. 2.0 2.1 సూర్య పత్రికలో ఆర్టికల్[permanent dead link]
  3. నవ తెలంగాణ, స్టోరి (1 June 2018). "పురాణం రమేష్‌ ప్రతిభకు గుర్తింపు". NavaTelangana. Archived from the original on 3 జూన్ 2018. Retrieved 27 April 2020.

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కూనపులి&oldid=3797655" నుండి వెలికితీశారు