కూనూరు లక్ష్మణ్ గౌడ్

(కూనూరు లక్ష్మణ్‌ గౌడ్ నుండి దారిమార్పు చెందింది)

కూనూరు లక్ష్మణ్‌ గౌడ్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి. 1999 నుంచి న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించిన లక్ష్మణ్ సివిల్, లేబర్, రాజ్యాంగ సంబంధ కేసుల్లో ప్రావీణ్యం సంపాదించి, 2019 ఆగష్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా భాద్యతలు స్వీకరించాడు.[1]

కూనూరు లక్ష్మణ్‌ గౌడ్
కూనూరు లక్ష్మణ్ గౌడ్

కూనూరు లక్ష్మణ్‌ గౌడ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 ఆగష్టు 2019 - ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1966, జూన్‌ 2
ఇంద్రపాల నగరం (తుమ్మలగూడెం)
తల్లిదండ్రులు కూనూరు గోపాల్‌, కూనూరు సత్తెమ్మ
జీవిత భాగస్వామి కూనూరు మంజుల
సంతానం కూనూరు శ్రీజ, కూనూరు హిమజ
నివాసం హైదరాబాద్
వృత్తి న్యాయమూర్తి
మతం హిందూ మతము

జననం - విద్యాభ్యాసంసవరించు

కూనూరు లక్ష్మణ్‌ యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, భోగారం గ్రామంలో కూనూరు గోపాల్‌,సత్తెమ్మ దంపతులకు 1966, జూన్‌ 2న జన్మించాడు. భోగారం ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి వరకు చదువుకున్న లక్ష్మణ్, రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశాడు. హైదరాబాదు అమీర్‌పేట్ లోని న్యూసైన్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి, నెల్లూరు వీఆర్‌ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదివి పట్టా పొందాడు.[2]

వృత్తి జీవితంసవరించు

లక్ష్మణ్, మాదిరాజు రాధాకృష్ణ వద్ద జూనియర్‌ న్యాయవాదిగా చేరాడు. 1993లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయిన లక్ష్మణ్‌, 1999 నుంచి ఇండిపెండెంట్‌ అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు.70 ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలకు స్టాండింగ్‌ కౌన్సెల్‌గా సేవలు అందించాడు. 2017 నుంచి తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా కొనసాగుతున్నాడు.[3]

పదోన్నతిసవరించు

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని కొలీజియం తెలంగాణ హైకోర్టుకు చెందిన న్యాయవాదులు తడకమళ్ల వినోద్‌ కుమార్‌, అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, కూనూరు లక్ష్మణ్‌లను న్యాయమూర్తులుగా నియమించాలని రాష్ట్రపతికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించి ఉత్తర్వులు జారీ చేశాడు. 2019 ఆగష్టు 26 న ఈ ముగ్గురు జడ్జీల చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ప్రమాణస్వీకారం చేయించాడు.[4][5]

మూలాలుసవరించు

  1. సాక్షి, రామన్నపేట (నకిరేకల్‌) (25 August 2019). "హైకోర్టు న్యాయమూర్తిగా బోగారం వాసి". Sakshi. Archived from the original on 28 August 2019. Retrieved 28 August 2019.
  2. Sakshi (24 August 2019). "హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు". Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
  3. Andrajyothy (2019). "తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు". Archived from the original on 16 అక్టోబరు 2021. Retrieved 16 October 2021.
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ (26 August 2019). "ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 28 August 2019. Retrieved 28 August 2019.
  5. Telangana High Court (2019). "HONOURABLE SRI JUSTICE K.LAKSHMAN". Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.