కెల్లీ డార్జ్
కాల్డెన్ సోనమ్ దోర్జీ (ఆంగ్లం: Kalden Sonam Dorji; జననం 1971 జనవరి 4) భూటాన్ నటుడు, మోడల్. ఆయన ప్రధానంగా భారతీయ సినిమాలలో నటిస్తున్నాడు.
కెల్లీ డోర్జీ | |
---|---|
జననం | కాల్డెన్ సోనమ్ దోర్జీ 1971 జనవరి 4 |
జాతీయత | భూటానీస్ |
వృత్తి | నటుడు, మోడల్, కళాకారుడు |
తల్లిదండ్రులు |
|
జీవితం తొలి దశలో
మార్చుఅతని తండ్రి లిన్పో పాల్జోర్ దోర్జీ, భూటాన్ నేషనల్ ఎన్విరాన్‌మెంట్ కమీషన్‌కి శాశ్వత సలహాదారు. కాగా, తల్లి లూయిస్ డోర్జీ, పిల్లల పుస్తకాల రచయిత, భూటాన్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ వ్యవస్థాపక సభ్యురాలు.
ఆయన డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్స్ పాఠశాలలో, తూర్పు భూటాన్‌లోని షెరుబ్ట్సే కళాశాలలో చదివాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చరిత్రలో ఆనర్స్ డిగ్రీని పొందాడు. అతని తాత భూటాన్ ప్రధాని జిగ్మే పాల్డెన్ దోర్జీ.
కెల్లీ డార్జ్ భూటాన్‌లోని దోర్జీ కుటుంబం, సిక్కిం రాజవంశంలకు చెందిన వారసుడు.[1][2]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
2005 | నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో | హిడెకి టోజో | హిందీ |
2005 | టాంగో చార్లీ | బోడో మిలిటెంట్ లీడర్ | హిందీ |
2005 | ఖామోష్... ఖౌఫ్ కీ రాత్ | నేరస్థుడు | హిందీ |
2005 | చాక్లెట్ | రోషన్ అబ్బాస్ | హిందీ |
2005 | ఫారెబ్ | ఇన్స్పెక్టర్ కెల్లీ డోర్జీ | హిందీ |
2005 | ఏక్ అజ్నబీ | బ్యాంకాక్ పోలీసు అధికారి కెల్లీ | హిందీ |
2007 | డాన్ | స్టీఫెన్/ఫిరోజ్ | తెలుగు |
2008 | ముఖ్బీర్ | హిందీ | |
2008 | కింగ్ | సింగింగ్ వాయిస్ | తెలుగు |
2009 | ద్రోణ | తెలుగు | |
2009 | బిల్లా | రషీద్ (డ్రగ్ డీలర్) | తెలుగు |
2010 | అసల్ | బ్రిజేష్ శెట్టి | తమిళం |
2010 | కేడి | విక్టర్ | తెలుగు |
2010 | లాహోర్ | గజానన | హిందీ |
2010 | గోలీమార్ | ఖలీద్ | తెలుగు |
2010 | క్రాంతి వీర్ - ది రివల్యూషన్ | హిందీ | |
2010 | సేమ్ గవై తాషా | పైలట్ | జోంగ్ఖా |
2011 | బద్రీనాథ్ | సర్కార్ | తెలుగు |
2011 | దడ | కెల్లీ | తెలుగు |
2011 | ది లాస్ట్ గోల్డ్ ఆఫ్ ఖాన్ | పావో | ఆంగ్లం |
2012 | రెబల్ | APC-MI6 | తెలుగు |
2013 | బాద్‍షా | సాధు భాయ్ | తెలుగు |
2014 | 1 - నేనొక్కడినే | ఆంటోనియో రోసారియస్ | తెలుగు |
పవర్ | నాయక్ | కన్నడ | |
బ్రదర్ అఫ్ బొమ్మలి | తెలుగు | ||
అంబరీష | RDX | కన్నడ | |
2015 | ఎడవపాటి | మలయాళం |
మూలాలు
మార్చు- ↑ Metho's Great Adventure. ASIN 999366345X.
- ↑ "11 New Children's Books Published". Save the Children.