బాద్‍షా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానరు పై బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టీ.ఆర్ మరియూ కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు. బృందావనం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.[4] ఈ చిత్రానికి థమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందించారు. శ్రీను వైట్ల తీసిన దూకుడు తర్వాత వీరిరువురి చిత్రం కూడా ఇదే.[5] ఐ. ఆండ్రూస్, జయనన్ విన్సెంట్, ఆర్.డీ. రాజశేఖర్ మరియూ కే.వి. గుహన్ లు ఈ చిత్రానికి సమ్యుక్తంగా చాయాగ్రాహకులుగా వ్యవహరించారు.[6] ఈ చిత్రం 2013 ఏప్రిల్ 5 న విడుదలైంది.[7]

బాద్‍షా
దర్శకత్వంశ్రీను వైట్ల
స్క్రీన్ ప్లేశ్రీను వైట్ల
కథగోపీమోహన్
కోన వెంకట్
నిర్మాతబండ్ల గణేశ్
తారాగణంజూనియర్ ఎన్.టీ.ఆర్
కాజల్ అగర్వాల్
నవదీప్
బ్రహ్మానందం
ఛాయాగ్రహణం
కూర్పుఎం. ఆర్. వర్మ
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్
పంపిణీదార్లుగ్రేట్ ఇండియా ఫిలింస్(విదేశాలు)[2] భరత్ పిక్చర్స్(విశాఖపట్నం)
విడుదల తేదీ
ఏప్రిల్ 5, 2013 (2013-04-05)
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్55 crore (US$6.9 million)[3]

డాన్ సాధు భాయ్ (కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా (జూనియర్ ఎన్.టీ.ఆర్) యువ నాయకుడిగా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రైన రంజన్ (ముఖేష్ ఋషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక జూదశాలని రంజన్ చూసుకుంటూ ఉంటాడు.అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా తన తెలివితేటలతో, ఎంతో దూకుడుగా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న సమయంబాద్‍షాకి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాధు భాయ్ బాద్‍షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్ (ఆశిష్ విద్యార్థి), వయోలెంట్ విక్టర్ (ప్రదేప్ రావత్) తో కలిసి బాద్‍షా ని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు.

సాధు భాయ్ భారతదేశంలో పలు మెట్రో నగరాలలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయడానికి పధకరచన చేస్తాడు. సాధు పధకాలని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్‍షా జానకి (కాజల్ అగర్వాల్), ఆమె తండ్రి జై కృష్ణ సింహా (నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ నియంత్రించే కుటుంబ పెద్ద కూడా, అదే కుటుంబంలో ఒక సభ్యుడు పద్మనాభ సింహా (బ్రహ్మానందం). అలా సాగుతున్న సమయంలో బాద్‍షాకి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్‍షా ఎవరు? బాద్‍షా వేసే పధకాలకి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.

సంభాషణలు

మార్చు
  • బాద్‍షా డిసైడ్ అయితే వార్ సింగిల్ సైడ్ అవుద్ది
  • బ్రతకాలంటే బాద్‍షా కింద ఉండాలి, చావాలంటే బాద్‍షా ముందుండాలి

నటీ నటులు

మార్చు

నిర్మాణం

మార్చు

2012 మార్చి 12 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు దగ్గుబాటి వెంకటేష్, రాం చరణ్ తేజ హాజరయ్యారు. దూకుడు చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం ఈ చిత్రానికి కూడా పనిచేసారు. ఈ సినిమా కోసం ఎన్.టీ.ఆర్. బాగా సన్నబడ్డారు.[8] ఈ చిత్రంలో ప్రముఖ నటులు నవదీప్[9] , సిద్దార్థ్[10] అతిథి పాత్రలు పోషించగా ప్రముఖ నటుడు మహేష్ బాబు కొన్ని ముఖ్య సన్నివేశాలకు వ్యాఖ్యానం అందించారు.[11]

సంగీతం

మార్చు

శ్రీను వైట్ల మరియూ ఎన్.టీ.ఆర్. లతో గతంలో పనిచేసిన థమన్ ఎస్.ఎస్. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. 2013 మార్చి 17 న రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క గీతావిష్కరణ వేడుక నిర్వహించబడింది. ఈ చిత్రం యొక్క పాటలను ఆదిత్య మ్యూజిక్ ఆడియో లేబెల్ ద్వారా విడుదల చేసారు.[12] ఈ చిత్రం యొక్క పాటలకు మంచి స్పందన లభించింది.[13]

క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "సైరో సైరో"  కృష్ణ చైతన్యరంజిత్, రాహుల్ నంబియర్ & నవీన్ 3:58
2. "డైమండ్ గర్ల్"  రామజోగయ్య శాస్త్రిశింబు & సుచిత్ర 4:04
3. "బాద్‍షా"  విశ్వహేమచంద్ర, గీతా మాధురి, షెఫాల్ అల్వారిస్ 3:33
4. "బంతిపూల జానకి"  రామజోగయ్య శాస్త్రిదలేర్ మెహందీ & రాణినారెడ్డి 4:39
5. "వెల్కమ్ కనకం"  భాస్కరభట్ల రవికుమార్సౌమ్యా రావ్ & జాస్ప్రీత్ జాస్జ్ 4:26
6. "రంగోళి రంగోళి"  రామజోగయ్య శాస్త్రిబాబా సెహగల్ & ఎం.ఎం. మానసి 3:01
23:41

పురస్కారాలు

మార్చు

సైమా అవార్డులు

మార్చు

2013 సైమా అవార్డులు

  1. ఉత్తమ హాస్యనటుడు (బ్రహ్మనందం)
  2. ఉత్తమ నేపథ్య గాయకుడు (శింబు - డైమండ్ గర్ల్)

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. http://www.123telugu.com/mnews/which-cinematographer-can-showcase-ntr-the-best.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-23. Retrieved 2013-02-04.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-03. Retrieved 2013-02-04.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-22. Retrieved 2013-02-04.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-23. Retrieved 2013-03-28.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-23. Retrieved 2013-03-28.
  7. http://www.indiaglitz.com/channels/telugu/article/90069.html
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-06. Retrieved 2013-03-28.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-05. Retrieved 2013-02-04.
  10. http://www.m.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=57140&Categoryid=2&subcatid=26[permanent dead link]
  11. http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=59544&Categoryid=2&subcatid=26
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-28. Retrieved 2013-03-28.
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-23. Retrieved 2013-03-28.
"https://te.wikipedia.org/w/index.php?title=బాద్‍షా&oldid=4339703" నుండి వెలికితీశారు