దడ (సినిమా)

2011 సినిమా

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా శ్రీ కామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై అజయ్ భూయాన్ దర్శకత్వంలో శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం దడ.కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, డి.శివప్రసాద రేడ్డి నిర్మిస్తున్న విభిన్నకథ చిత్రం "దడ". "రోజాపూలు", "పోలీస్ పోలీస్" సినిమాల హీరో శ్రీరామ్ ఈ సినిమాలో నాగచైతన్యకు అన్నయ్యగా నటిస్తున్నాడు. నాగచైతన్య "దడ" సినిమాకి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన "100% లవ్" సినిమా హిట్టవటంతో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య "దడ" సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దడ
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం అజయ్ భుయాన్
నిర్మాణం డీ. శివ ప్రసాద్ రెడ్డి
కథ అజయ్ భుయాన్
శివ్ సింగ్
అబ్బూరి రవి
తారాగణం నాగ చైతన్య
కాజల్ అగర్వాల్
శ్రీరామ్
రాహుల్ దేవ్
కెల్లీ డార్జ్
సమీక్ష
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం జ్ఞానశేఖర్ వీ. ఎస్.
కూర్పు కే. ధర్మేంద్ర
నిర్మాణ సంస్థ కామాక్షి మూవీస్
నిడివి 130 నిమిషాలు
భాష తెలుగు

లాస్ ఏంజిల్స్ లొ సెటిల్ అయిన ఒక అన్నా, తమ్ముడు, ఒక వదిన. ఎవరో దారిన పోయే అమ్మాయిని హీరోగారు కాపాడటంతో హీరో కోసం, హీరో చుట్టూ తిరుగుతూనే కనిపెట్టలేని విలన్ల గ్యాంగ్. ఈ మధ్యలో తల్లి లేక, బిలియనీర్ తండ్రి నిర్లక్ష్యానికి గురైన ఒక అమ్మాయితో హీరోగారి లవ్ ట్రాక్.

అమెరికాలో అన్న (శ్రీరామ్), వదినల దగ్గరుండి చదువుతుంటాడు విశ్వ (నాగచైతన్య). అనుకోకుండా అంతర్జాతీయంగా అమ్మాయిలను అమ్మే ముఠాతో తలపడాల్సి వస్తుంది. దీంతో ఆ ముఠా ఇతగాడి వెంట పడతారు. ఇదిలా వుండగా డబ్బుండీ, ఆప్యాయతానురాగాలు కరువైన ప్రియ (కాజల్) పరిచయమై ప్రేమగా మారుతుంది. మరో పక్క ఆమెకు ఇష్టం లేని పెళ్ళి కుదురుతూ వుంటుంది. ఈ నేపథ్యంలో చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.

తారాగణం

మార్చు

నాగచైతన్య,

కాజల్ అగర్వాల్,
సమీక్ష,

బ్రహ్మానందం,

ఆలీ,
శ్రీరామ్,

కెల్లీ డార్జ్,

రాహుల్‌దేవ్

సాంకేతిక వర్గం

మార్చు
  • సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
  • సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
  • నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి
  • దర్శకత్వం: అజయ్‌భుయాన్

పాటల జాబితా

మార్చు

భూమి గుండ్రగా, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.రిచర్డ్ , రనినరెడ్డి

హాల్లో హాల్లో, రచన: అనంత శ్రీరామ్, గానం.నిఖిల్ డీ సౌజా , నేహా భాసిన్

తెలుగు బెంగాలీ , రచన:అనంత శ్రీరామ్, గానం. నీరజ్ శ్రీధర్, శ్రీ చరన్, మేఘ

గొడవ గొడవ రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కార్తీక్, ప్రియ హిమేష్

దీవాలి దీపాన్ని , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కళ్యాణ్, ఆండ్రియా జెరేమియ

చిన్నగ చిన్నగ , రచన: అనంత శ్రీరామ్, గానం.సాగర్

ఏయ్ పిల్లా, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.జస్ప్రీత్ జాస్ , సుచిత్ర .

సూచికలు

మార్చు

యితర లింకులు

మార్చు