కొదమ సింహం కె. మురళీమోహన రావు దర్శకత్వంలో 1990 లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని కె. నాగేశ్వరరావు రమా ఫిల్మ్స్ పతాకంపై నిర్మించాడు. ఇందులో చిరంజీవి, సోనం, వాణీ విశ్వనాథ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణభారత చలనచిత్రం.[1]

కొదమ సింహం
ChiruinKodamasimham.jpg
దర్శకత్వంకె. మురళీమోహనరావు
రచనపరుచూరి బ్రదర్స్
నిర్మాతకె.నాగేశ్వరరావు
నటవర్గంచిరంజీవి,
సోనమ్,
వాణీ విశ్వనాథ్,
రాధ,
సుజాత,
అన్నపూర్ణ
ఛాయాగ్రహణంకె. ఎస్. హరి
కూర్పునాగేశ్వరరావు, సత్యనారాయణ
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1990 ఆగస్టు 9 (1990-08-09)
నిడివి
143 ని.
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్4 కోట్ల రూపాయలు

కథసవరించు

భరత్ అన్యాయాలను, అక్రమాలను అడ్డుకునే మంచి హృదయం కలిగిన కౌబాయ్. భరత్ ఒకసారి జూదం, వ్యభిచారం నడుపుతున్న కొంత మంది ముఠా మీద దాడిచేయగా వారు అతని తల్లిదండ్రుల మీద దాడి చేస్తారు. అతని తండ్రి చనిపోతూ తాము అతని పెంపుడు తల్లిదండ్రులమనీ నిజమైన తల్లిదండ్రులకోసం వేరే నగరంలో వెతకమని చెబుతారు. అతని తండ్రి రాజు ఖజానా నుంచి సొమ్ము దొంగతనం చేసినందుకు గాను తల్లిని జైలులో పెట్టి ఉంటారు. అతని తండ్రి అడవి వాళ్ళకి నాయకుడిగా చలామణి అవుతూ ఉంటారు. పట్టణ మేయర్, అతని అనుచరుడు సుడిగాలి కలిసి ఖజానా దొంగతనం చేయబోగా భరత్ తండ్రి ఆ సొమ్మును కాపాడ్డం కోసం దానిని తీసుకుని పారిపోయి ఉంటాడు. భరత్ తండ్రి సాయంతో ఆ సొమ్మును కాపాడి చట్టానికి అప్పగించి తన కుటుంబాన్ని కాపాడుకోవడం మిగతా కథ.

నటీనటులుసవరించు

 • భరత్ గా చిరంజీవి
 • సోనమ్‌
 • వాణీ విశ్వనాథ్
 • రాధ
 • సుజాత
 • అన్నపూర్ణ
 • గొల్లపూడి మారుతీరావు
 • రంగనాథ్
 • ప్రాణ్
 • అల్లు రామలింగయ్య
 • కన్నడ ప్రభాకర్
 • సుధాకర్
 • మోహన్ బాబు
 • ప్రసాద్ బాబు

నిర్మాణ వివరాలుసవరించు

కౌబాయ్ సినిమాలు బాగా ప్రచారంలో ఉండగా చిరంజీవితో కౌబాయ్ సినిమా తీయాలనే ఆలోచన నిర్మాత కైకాల నాగేశ్వరరావుకు వచ్చింది. చిరంజీవి కూడా అందుకు ఒప్పుకున్నాడు. బడ్జెట్ ఎక్కువవుతుందని చిరంజీవి చెప్పినా నాగేశ్వరరావు వెనకాడలేదు. దర్శకుడి కోసం వెతుకుతూ తన క్లాస్ మేట్ అయిన మురళీమోహనరావుకు ఈ పని అప్పగించాడు. మురళీ మోహనరావు అంతకుమునుపు చిరంజీవితో కలిసి సంఘర్షణ సినిమా కోసం పనిచేశాడు. ఈ చిత్ర కథ కోసం పలు హాలీవుడ్ సినిమాలు చూశారు. నాగేశ్వరరావు, విజయేంద్ర ప్రసాద్, శివశక్తి, పరుచూరి బ్రదర్స్ కలిసి కథను తయారు చేశారు. కౌబాయ్ చిత్రమైనా దేశీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కథను మలుచుకున్నారు.

మద్రాసు నుంచి 64 కి.మీ దూరంలో ఉన్న చంగల్ పద్దిలో ప్రత్యేకంగా సెట్ వేశారు. అక్కడ ఒక వారం రోజులపాటు చిత్రీకరణ జరిగింది. తర్వాత మద్రాస్, ఊటీ, తలకోన, కడబోగి మహన్, మైసూర్, బెంగుళూరు, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. అప్పట్లో ఈ సినిమాకు సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చయింది.

కథానాయికగా ముందు నదియా ను అనుకున్నారు. ఆమెకు అప్పటికే వివాహం అయింది. అయినా ఆమెను ఒప్పించారు నిర్మాత నాగేశ్వరరావు. కానీ చిరంజీవి డేట్లు కుదరకపోవడంతో హిందీ నటి సోనంను తీసుకున్నారు.[2] మరో కథానాయికగా రాధ నటించగా, వాణీ విశ్వనాధ్ ప్రత్యేక పాత్రలో నటించింది. ప్రతినాయకుడి పాత్రలో హిందీ నటుడు ప్రాణ్ నటించగా, మరో ప్రతినాయకుడు సుడిగాలి పాత్రలో మోహన్ బాబు నటించాడు.[3]

కౌబాయ్ పాత్రలని అంతకు ముందు ఎక్కువగా ఘట్టమనేని కృష్ణ పోషించేవారు. ఈ చిత్రంతో చిరంజీవి మొట్టమొదటి సారిగా పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించాడు. బద్రి లో కేవలం ఒక పాటకి పవన్ కళ్యాణ్ కౌబాయ్ పాత్రని పోషించాడు. టక్కరి దొంగ లో ఘట్టమనేని కృష్ణ తనయుడు మహేష్ బాబు పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించాడు.

విడుదలసవరించు

ఈ చిత్రం ఆగస్టు 9, 1990 లో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. 20 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది.[3]


సాంకేతిక వర్గంసవరించు

 • దర్శకుడు : కె.మురళీమోహనరావు
 • నిర్మాత: కె.నాగేశ్వరరావు
 • సహ నిర్మాతలు: కె.లక్ష్మీనారాయణ, కె.వి.రామారావు
 • స్క్రీన్ ప్లే: పరుచురి బ్రదర్స్
 • సంభాషణలు: సత్యానంద్
 • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
 • సంగీతం: రాజ్ - కోటి
 • కళ : భాస్కరరాజు
 • కూర్పు : సత్యం, నాగేశ్వరరావు

పాటలుసవరించు

 • జపం జపం జపం, కొంగ జపం
 • చక్కిలిగింతల రాగం
 • పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో పడ్డా ఎన్నెల్లో
 • అల్లటప్పా గోంగూరమ్మో
 • గుం గుమాయించు కొంచెం

మూలాలుసవరించు

 1. "Megastar Chiranjeevi: Lesser known facts". The Times of India. Retrieved 2021-02-11.
 2. "కొదమసింహం.. కౌబాయ్ కోసం ఇంత ఖర్చు చేశారా?". OK Telugu. 2021-03-03. Retrieved 2021-10-05.
 3. 3.0 3.1 "చిరంజీవి కౌబాయ్ లుక్ .. 'కొదమసింహం'కు 30 ఏళ్లు.. - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-10-05.