కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సముదాయం

కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సముదాయం అనేది తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలంలోని కొల్లూరు గ్రామంలో నిర్మించబడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా 145 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్‌లతో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో 60 వేలమంది నివాసం ఉండేలా 15,660 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు నిర్మించబడ్డాయి. ఈ ఇళ్ళ సముదాయానికి ‘‘కేసీఆర్‌నగర్‌’’గా పేరు పెట్టబడింది.[1]

కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సముదాయం
ఇళ్ళ సముదాయాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
ప్రదేశంకొల్లూరు, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రకంగృహ సముదాయం
వెడల్పు45.5 అడుగులు
ఎత్తు125 అడుగులు
నిర్మాణం ప్రారంభం22 ఫిబ్రవరి 2018 (2018-02-22)
ప్రారంభ తేదీ22 జూన్ 2023 (2023-06-22)

ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయంగా గుర్తింపుపొందిన ఈ ఇళ్ళ సముదాయాన్ని 2023, జూన్ 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.[2]

నిర్మాణం

మార్చు

2018 ఫిబ్రవరి 22న ఈ సముదాయ నిర్మాణం ప్రారంభించబడింది. జీ+9, జీ+10, జీ+11 అంతస్తులలోని 117 బ్లాక్‌లలో 15,600 డబుల్‌ బెడ్రూం ఇళ్ళు నిర్మించబడ్డాయి. బిల్డప్‌ ఏరియా – 660 చదరపు అడుగులు కాగా, కార్పెట్‌ ఏరియా 398 చదరపు అడుగులుగా ఉంది. మౌలిక సదుపాయాలతో కలిపి ఒక్కో ఇంటి నిర్మాణానికి 8.65 లక్షలు (ఇంటికి రూ.7.90లక్షలు, మౌలిక సదుపాయలకు రూ.0.75 లక్షలు) కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు సబ్సిడీ మాత్రమే వచ్చింది.[3]

భూమి వినియోగం

మార్చు
  • గ్రీనరీ, ఓపెన్‌ ఏరియా 21.77 ఎకరాలు
  • ఇతర సౌకర్యాలకు 27.89 ఎకరాలు
  • పార్కులు, క్రీడా మైదానాలకు 13.42ఎకరాలు
  • పబ్లిక్‌ బిల్డింగ్‌ ఏరియాకు 6.26 ఎకరాలు
  • ఓపెన్‌ పార్కింగ్‌ 2.32 ఎకరాలు
  • రోడ్లకు 32.56 ఎకరాలు
  • నివాస గృహాలకు 19.85 ఎకరాలు
  • ప్రాజెక్ట్‌ మెయింటెనెన్స్‌ కోసం 20 ఎకరాలు

గృహ సముదాయం

మార్చు
  • జీ+9లో 38 భవనాలు 4,527 ఇండ్లు
  • జీ+10లో 24 భవనాలు 3,180 ఇండ్లు
  • జీ+11లో 55 భవనాలు 7,953 ఇండ్లు

మౌలిక వసతులు

మార్చు

ఆరు నుంచి 36 మీటర్ల వెడల్పుతో కూడిన 13.50 కిలోమీటర్ల రహదారితోపాటు భవిష్యత్తులో రోడ్డు కటింగ్‌ అనేది లేకుండా నాలా ఏర్పాటుచేశారు. 11కేఎల్‌ కెపాసిటీ గల 12 వాటర్‌ సంపులు, 10.05 కి.మీ తాగునీటి పైప్‌లైన్‌, 10.60 కి.మీ అండర్‌ గ్రౌండ్‌ పైప్‌లైన్‌, 37 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, వీధి దీపాల కోసం 500 పోల్స్‌.. ఐమాస్ట్‌ లైట్ల కోసం 11 పోల్స్‌ తోపాటు అండర్‌గ్రౌండ్‌ ద్వారా విద్యుత్‌ కేబుల్‌ ఏర్పాటు.. కామన్‌ ఏరియాలో లైటింగ్‌, లిఫ్టులకు వాటర్‌ సఫ్లయి, ఎస్‌టీపీలకు నిరంతర విద్యుత్‌ సరఫరాకు 30కేవీ నుంచి 400 కేవీ వరకు 133 జనరేటర్ల ఏర్పాటు చేశారు. బ్లాక్ కి 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌ల ఏర్పాటు చేశారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో 9 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్‌టీపీ, మురుగునీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్‌ చేసి సుందరీకరణ పనులకు వాడేలా అవసరమైన పైపులైన్‌ ఏర్పాటు చేశారు. 5400 చదరపు అడుగులలో 3 షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో 118 షాపులు ఏర్పాటుచేశారు.[4]

ఇతర సౌకర్యాలు

మార్చు

బస్టాండ్‌, పోలీస్‌ ఔట్‌పోస్టు, ఫైర్‌ స్టేషన్‌, మున్సిపల్‌ బిల్డింగ్‌, ప్రభుత్వ దవాఖాన, పీహెచ్‌సీ సెంటర్‌, గుడి, చర్చి, మూడు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, హైస్కూల్‌, అంగన్‌వాడీ భవనాలు, ప్రతి సెక్టార్‌లో పాలకేంద్రాలు, ఫంక్షన్‌హాళ్లు, శ్మశానవాటిక, ద్విచక్ర వాహనాల పార్కింగ్‌, బ్యాంక్‌, ఏటీఎంలు, పోస్టాఫీస్‌, మార్కెట్‌, పెట్రోల్‌ బంక్‌, కమ్యూనిటీ సెంటర్లు తదితర సౌకర్యాలను ఏర్పాటుచేశారు.

ప్రారంభం

మార్చు

2023, జూన్ 22న సముదాయ ముఖద్వారంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించి, 93వ బ్లాక్‌లో ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుకొని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు, ఇంటి తాళాలను లబ్ధిదారులకు అందజేశాడు. అనంతరం లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, రాష్ట్ర మంత్రులు మహమూద్‌అలీ,కేటీఆర్‌, టి. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సి.హెచ్. మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5][6]

మూలాలు

మార్చు
  1. Velugu, V6 (2023-06-22). "15వేల ఇండ్లు ఒకే చోట..కొల్లూరులో డబుల్‌ బెడ్రూం ఇండ్ల టౌన్ షిప్ ప్రారంభం". V6 Velugu. Archived from the original on 2023-06-23. Retrieved 2023-07-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "CM KCR: ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం.. ప్రారంభించిన కేసీఆర్". EENADU. 2023-06-22. Archived from the original on 2023-06-22. Retrieved 2023-07-24.
  3. telugu, NT News (2023-06-22). "Kollur | దారులన్నీ జిగేల్‌.. కొల్లూర్‌ 2 బీహెచ్‌కే కాలనీ మీదుగా వెళ్లే మార్గంలో ఏర్పాటు చేయనున్న హెచ్‌ఎండీఏ". www.ntnews.com. Archived from the original on 2023-06-22. Retrieved 2023-07-24.
  4. telugu, NT News (2023-06-22). "కొల్లూరులో కేసీఆర్‌ నగర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-22. Retrieved 2023-07-24.
  5. ABN (2023-06-22). "Doubel Bedroom Houses: కొల్లూరులో 'కేసీఆర్‌ నగర్‌'ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-22. Retrieved 2023-07-24.
  6. "డబుల్‌ బెడ్‌రూమ్‌ టౌన్‌షిప్‌ ప్రారంభించిన కేసీఆర్‌.. స్పెషల్‌ ఇదే." Sakshi. 2023-06-22. Archived from the original on 2023-06-22. Retrieved 2023-07-24.