కొసరాజు రామయ్య చౌదరి విద్యావేత్త, రాజకీయనాయకులు, సంఘసేవకులు.[1]

జీవిత విశేషాలుసవరించు

తెనాలికి సమీపంలోని తురుమెళ్ళలో కొసరాజు రామయ్యచౌదరి 1886 జన్మించారు. తెనాలి తాలూకా బోర్డు అధ్యక్షులుగా మూడు పర్యాయాలు వ్యవ హరించారు. గుంటూరు జిల్లా బోర్డు సభ్యులుగా వ్యవ హరించిన రామయ్యచౌదరికి బ్రిటీష్ ప్రభుత్వం రావు బహదూర్ బిరుదును ప్రదానం చేసింది. విద్యాభివృద్ధికి కృషి చేసిన కొసరాజు అనేక పాఠశాలలో వసతి గృహా లను ఏర్పాటు చేసిన ఆధ్యునిగా గుర్తింపు పొందారు. నాటి రాజకీయ ప్రముఖులు బొబ్బిలి రాజా, ముని స్వామినాయుడు వంటివారితోపాటు గుంటూరు జిల్లాకలెక్టర్, మద్రాసు గవర్నర్ జనరల్ గా పనిచేసిన టీజీ రూథర్‌ఫర్డుకు అత్యంత సన్నిహితులు. ఈ రాష్రంలోనే మొదటిసారిగా తురుమెళ్లలో పాఠశాలను ఏర్పాటు చేసి ఆదర్శ ప్రాయంగా నిలిచారు. కల్లూరి చంద్రమౌళి, యలవర్తి నాయుడమ్మ ఎల్. బుల్లయ్య, ఆవుల సాంబశివరావు, జాతీయ వాలీబాల్ క్రీడాకారులు కె.వెంకయ్య బుచ్చిరామయ్య వంటి మహనీయులందరూ తురుమెళ్ల పాఠశా లలో విద్యాభ్యాసం చేసిన వారే. నిజాంపట్నం పంట కాలువపై తురుమెళ్ళ పెదపూడి వంతెనల నిర్మాణానికి కృషి చేసి ప్రయాణ సౌకర్యాలను గణనీ యంగా మెరుగుపరిచారు. తురుమెళ్ల పాఠశాలలో హాస్టల్ నిర్మాణాన్ని చేసి పరిసర గ్రామాల విద్యారులకు సౌకర్యాలను కలిగించారు. చిలుమూరు శ్రీరా మ రూరల్ కళాశాలలో 1950లో నెహ్రూ వసతిగృహాన్ని ఏర్పాటు చేయడంలో రామయ్య కృషి చిరస్మరణీయం. 1945లో రామయ్య అస్తమించారు.

మూలాలుసవరించు